(Source: ECI/ABP News/ABP Majha)
స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!
రామ్ చరణ్ తేజ్ ఎన్డీటీవీ అందించే ‘ట్రూ లెజెండ్’ అవార్డును ఈసారి దక్కించుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు. ఎన్డీటీవీ అందించే ‘ట్రూ లెజెండ్’ అవార్డును ఈసారి రామ్ చరణ్ దక్కించుకున్నారు. ‘ప్యూచర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ పేరుతో ఈ అవార్డు కోసం పోల్స్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల ఒపీనియన్‌ని ఎన్డీటీవీ కలెక్ట్ చేసింది. ఈ అవార్డుల రేసులో జూనియర్ ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, సోనూ సూద్, తాప్సీ వంటి స్టార్లు కూడా ఉన్నారు.
ఈ అవార్డును అందుకున్న అనంతరం స్టేజీపై రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. తమ కుటుంబంలో జరిగిన ఓ విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తన తండ్రి, మెగా స్టార్ చిరంజీవి పైనా రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 1997లో మా కుటుంబంలోని ఒక వ్యక్తి రక్తం అందుబాటులో లేకపోవడంతో చనిపోయారన్నారు. అప్పటికే చిరంజీవి మెగా స్టార్ అని, కోట్లాది మంది అభిమానులు ఉన్నారని తెలిపారు. కానీ తమ కుటుంబంలోని ఓ వ్యక్తి అలా రక్తం దొరకక చనిపోవడం అందరినీ షాక్‌కి గురి చేసిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏడాదే చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ని స్టార్ట్ చేశారని, బ్లడ్ ఇచ్చి సమాజానికి మంచి చేసిన ప్రతి ఒక్కరితో ఫొటో దిగతానని ప్రకటించారని రామ్ చరణ్ వెల్లడించారు.
కరోనా సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన వారికి చిరంజీవి ఆరు నెలల పాటు సాయం చేయడంపైనా స్పందించారు. ఆ సమయంలో తాము చేసింది తక్కువే కానీ వారికి అప్పుడు అది చాలా అవసరం అని పేర్కొన్నారు. తన తండ్రితో ఎక్కువ సమయం గడపలేకపోయానని చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటారని తెలిపారు. ఈ పరిస్థితి రామ్ చరణ్‌కి రాకూడదనే ఉద్దేశంతో తనతో ఎక్కువ సమయం గడపాలని రామ్‌చరణ్‌కి తరచూ సూచిస్తుంటారట. ఈ విషయాన్ని కూడా రామ్ చరణ్ స్టేజ్‌పైనే చెప్పుకొచ్చాడు.
ఇక సినిమాల విషయంలో కథని చిరంజీవి ఎంత ఇన్వాల్వ్ అవుతారో కూడా తెలిపారు. 2009లో మగధీర కథను రామ్ చరణ్‌కి చెప్పిన తర్వాత చిరంజీవికి కూడా ఒకసారి చెప్పాలని దర్శకుడు రాజమౌళి వారి ఇంటికి వచ్చారని పేర్కొన్నారు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్‌ని చెప్తుండగానే చిరంజీవి అక్కడి నుంచి తాను జంప్ చేశాక అని ఏదో చెప్పబోయారని తెలిపారు. వెంటనే రాజమౌళి మీరు కాదు రామ్ చరణ్ చేయాలని గుర్తు చేశారట.
View this post on Instagram