News
News
X

Upasana New Car: కొత్త కారు కొన్న కొణిదెల కోడలు - ఫీచర్స్‌ అదుర్స్ అంటూ పోస్ట్

Upasana Kamineni: మెగా కోడలు ఉపాసన ఆడీ ఇట్రాన్ కార్ కొనుగోలు చేశారు. తన ప్రతి ప్రయాణంలోనూ ఇదే తోడుగా ఉంటోందని సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు.

FOLLOW US: 

Upasana New Car:

ఉపాసన కొత్త కారు ధర రూ.కోటిన్నరకు పైనే..

సినీ సెలెబ్రిటీలు ఏం చేసినా ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. వాళ్లు వేసుకునే డ్రెస్‌ల నుంచి వాళ్లు వినియోగించే కార్ల వరకూ అన్నింటిపైనా ఇంట్రెస్ట్ చూపిస్తారంతా. వాళ్లు కొత్త కార్ కొన్నా బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ఇప్పుడు రామ్‌ చరణ్ సతీమణి ఉపాసన ఓహైఎండ్ మోడల్ కార్ కొని వార్తల్లో నిలిచారు. ఆడీ కంపెనీకి చెందిన e-Tron కార్ కొన్నారు ఉపాసన. ప్రపంచమంతా అప్‌గ్రేడ్ అవుతోంది. అందుకే నేను కూడా అప్‌గ్రేడ్ అయిపోయానంటూ తన కొత్త కార్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది ఎలక్ట్రిక్ వెహికిల్. ఈ కార్ విలువ కోటి 66 లక్షలు. రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ కార్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఫీచర్లను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో షేర్ చేశారు ఉపాసన.

అదిరిపోయే ఫీచర్లు..

"ఇది ఆడీ కంపెనీ నుంచి వచ్చి కొత్త e-Tron కార్. సేవా కార్యక్రమాలను మరింత సమర్థంగా చేసేందుకు ఇది నాకు కొత్త శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. నా ప్రతి ప్రయాణంలోనూ ఈ కార్‌ నాకు తోడుగా ఉంటోంది. నా జీవితాన్ని ఎఫీషియెంట్‌గా మార్చేసింది. నాకు ఇందులో బాగా నచ్చిన ఫీచర్ ఒకటి ఉంది. మనకు కావాల్సిందేదో వాయిస్ కమాండ్ ద్వారా చెబితే ఆ పని క్షణాల్లో పూర్తైపోతుంది. కావాలంటే చూడండి" అంటూ వాయిస్ కమాండ్ ఇచ్చారు ఉపాసన. అలా ఇచ్చిన వెంటనే ఆమె అడిగిన పాట ప్లే అయింది. యాపిల్‌లో వచ్చే "సిరి" తరహాలో ఇది పని చేస్తోంది. 2021 జులైలో భారత్‌లో విడుదలైంది ఆడీ e-Tron కార్. ఆడీ e-Tron 55, ఆడీ e-Tron స్పోర్ట్స్ బ్యాక్ 55 ఇలా రెండు వేరియంట్లు లభ్యమవుతున్నాయి. డిజైన్‌లో ఈ రెండూ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 359-484 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. మరో స్పెషాల్టీ ఏంటంటే... కేవలం 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

Also Read: Tollywood Bandh : రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్

Also Read: Harish Rao: చెత్త క్లీన్ చేసిన మంత్రి హరీశ్ రావు, 10 నిమిషాలు అందరూ చేయాలని పిలుపు

Published at : 31 Jul 2022 02:50 PM (IST) Tags: Audi Upasana Kamineni Upasana Audi e-Tron Features

సంబంధిత కథనాలు

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Puri Jagannadh: ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్

Puri Jagannadh: ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్

Janaki Kalaganaledu August 16th Update: గర్ల్ ఫ్రెండ్ జెస్సితో అఖిల్ రొమాన్స్, మల్లికని ఓ ఆట ఆడుకున్న గోవిందరాజులు- జ్ఞానంబ ఇంట్లో రాఖీ సంబరాలు

Janaki Kalaganaledu August 16th Update: గర్ల్ ఫ్రెండ్ జెస్సితో అఖిల్ రొమాన్స్, మల్లికని ఓ ఆట ఆడుకున్న గోవిందరాజులు- జ్ఞానంబ ఇంట్లో రాఖీ సంబరాలు

Guppedantha Manasu ఆగస్టు 16 ఎపిసోడ్: ఈ పెళ్లి వద్దు, రిషి వద్దంటూ నరసింహలో రమ్యకృష్ణలా శపథం చేసిన సాక్షి - ప్రేమను ప్రేమించానంటూ కూల్ గా చెప్పిన రిషి

Guppedantha Manasu ఆగస్టు 16 ఎపిసోడ్: ఈ పెళ్లి వద్దు, రిషి వద్దంటూ నరసింహలో రమ్యకృష్ణలా శపథం చేసిన సాక్షి - ప్రేమను ప్రేమించానంటూ కూల్ గా చెప్పిన రిషి

Devatha August 16th Update: సంతోషంలో రుక్మిణి, దేవి - పసిమనసు చెడగొట్టేందుకు మాధవ కొత్త ప్లాన్

Devatha August 16th Update: సంతోషంలో రుక్మిణి, దేవి -  పసిమనసు చెడగొట్టేందుకు మాధవ కొత్త ప్లాన్

టాప్ స్టోరీస్

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Independence Day 2022: కోనసీమ జిల్లాలో వినూత్నంగా స్వాతంత్ర్య దినోత్సవం, నాణెేలతో దేశ చిత్రపటం!

Independence Day 2022: కోనసీమ జిల్లాలో వినూత్నంగా స్వాతంత్ర్య దినోత్సవం, నాణెేలతో దేశ చిత్రపటం!