(Source: ECI/ABP News/ABP Majha)
Harish Rao: చెత్త క్లీన్ చేసిన మంత్రి హరీశ్ రావు, 10 నిమిషాలు అందరూ చేయాలని పిలుపు
Harish Rao: మంత్రి హరీష్ రావు తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్ర పరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు.
మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. డెంగ్యూ నివారణలో భాగంగా మంత్రి హరీష్ రావు తన నివాస ప్రాంగణంలో పారిశుద్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్ర పరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలను క్లిన్ చేశారు. ప్రజలంతా ఇంటిలోని అన్ని నీటి స్తబ్దత పాయింట్లను శుభ్రపరచుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని, ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు. డెంగ్యూ నివారణ చేపట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్త చేదారం , నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు.
Defend Against Dengue
— Harish Rao Thanneeru (@trsharish) July 31, 2022
I cleared water stagnation points at my house.Urge all citizens to spare #EverySunday10min to clean up all sources of stagnant water at ur house & share pictures.
Prevent dengue causing Aedes mosquito breeding which bites mainly during day#DenguePrevention pic.twitter.com/9Ftje2SOqE
‘‘మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే.. డెంగ్యూ నివారణలో భాగంగా తన ఇంటి పరిసరాల్లో స్వయంగా మంత్రి హరీశ్ రావు పారిశుధ్యం నిర్వహించారు. ప్రతి ఆదివారం 10 నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్త చేదారం, నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాల’’ని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
డెంగ్యూ లక్షణాలు ఇవీ..
అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావని, జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ మాత్రలు వాడాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
లక్షణాలు
తీవ్రమైన జ్వరం
తీవ్రమైన తలనొప్పి
కంటి లోపల భాగంలో నొప్పి, వాంతులు, విరోచనాలు, కండరాలు, కీళ్ల నొప్పులు
చర్మంపై దద్దుర్లు (తీవ్రమైన కేసుల్లో మాత్రమే)
పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం (తీవ్రమైన కేసుల్లో మాత్రమే) డెంగ్యూ హేమరేజిక్ (రక్తస్రావం) జ్వరం
● మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే...!
— Harish Rao News (@TrsHarishNews) July 31, 2022
డెంగ్యూ, ఇతర కాలానుగుణ వ్యాధుల నివారణలో భాగంగా తన ఇంటి పరిసరాల్లో స్వయంగా పారిశుధ్యం నిర్వహించి, ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు ఇంటి చుట్టు పరిశుభ్రతకు కేటాయించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి @trsharish గారు. pic.twitter.com/sHAYZIClUP
డెంగ్యూ వ్యాధి నిర్ధారణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయబడుతును
జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు NS 1 ఎలీసా, ఆరవ రోజు నుంచి IgM తర్వాత IgG ఎలీసా పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో (బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) ఉచితంగా చేస్తారు.
డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలు.!
— Harish Rao Thanneeru (@trsharish) July 30, 2022
పౌరులందరినీ 10 నిమిషాలు కేటాయించమని అభ్యర్థిస్తున్నాను రేపు ఉదయం 10 గంటలకు మరియు ప్రతి ఆదివారం. మీ ఇంటిలోని అన్ని నీటి స్తబ్దత పాయింట్లను శుభ్రపరచడానికి.
పగటిపూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణం.
ఉమ్మడిగా నివారిద్దాం. pic.twitter.com/4KbyIs7hyc
హైదరాబాద్‌లో మరో ప్రకృతి వైద్యశాల
కార్పొరేట్ లుక్స్ తో మారిపోయిన హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. త్వరలో ప్రభుత్వ ప్రకృతి వైద్యశాల అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రి హరీశ్ రావు శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ ప్రకృతి వైద్యశాల ఏకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఇందుకోసం రూ.6 కోట్ల నిధులను విడుదల చేస్తూ మంత్రి హరీశ్ రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా నేచర్ క్యూర్‌గా పేరు పెట్టనున్న ఈ వైద్యశాల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.