By: ABP Desam | Updated at : 17 Nov 2022 09:03 PM (IST)
యువ దర్శకులను భయపెట్టిన 'మసూద'
'మసూద' (Masooda Movie) - తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన సినిమా. సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్ర చేసిన సినిమా. దీనికి మరో స్పెషాలిటీ ఏంటంటే... 'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన సినిమా. 'దిల్' రాజు విడుదల చేస్తున్న సినిమా. ఆల్రెడీ కొంత మంది యువ దర్శకులకు 'మసూద'ను చూపించారు. సినిమా భయపెట్టిందని వాళ్ళు చెబుతున్నారు.
రెండుసార్లు చూశా... భయపడ్డా! - వెంకటేష్ మహా
''హారర్ జానర్ సినిమాలు తీసే ఆసక్తి లేదని దర్శకులు చెబుతున్నారు. నేను కూడా ఆ మాట అన్నాను. కానీ, 'మసూద'ను రెండు సార్లు చూశా. హారర్‌ను ఫుల్లుగా ఎక్స్‌పీరియన్స్ చేశా. చాలా భయపడ్డా. హారర్ అంటే కామెడీ, మసాలా ఉండాలని అనుకునే సమయంలో... ఇటువంటి కథతో సినిమా నిర్మించిన రాహుల్‌కు థాంక్స్'' అని 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' తీసిన వెంకటేష్ మహా అన్నారు.
చాలా చోట్ల భయపడ్డా! - సందీప్ రాజ్
''మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తర్వాత రాహుల్ ఎలాంటి సినిమా తీస్తారో? అనుకున్నా. హారర్ జానర్ అన్నప్పుడు... రొటీన్ అనుకున్నా. కానీ, సినిమా చూసిన తర్వాత షాకయ్యా. చాలా చోట్ల కచ్చితంగా భయపడతాం. కొత్త దర్శకుడు తీసినట్టు లేదు. మంచి టీం కలిసి పని చేస్తే ఎలా ఉంటుందనే దానికి ఈ సినిమా ఉదాహరణ. మ్యూజిక్, సౌండ్, కెమెరా అన్నీ చక్కగా కుదిరాయి'' అని 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ చెప్పారు.
ఇరవై నిమిషాల్లోనే భయపెట్టేస్తాడు - వినోద్
''ఇప్పుడు హారర్ రొటీన్ అయింది. అందులోనూ కొత్త పాయింట్ తీసుకుని ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో దెయ్యాన్ని చూస్తే కాదు... ఆ సీన్, ఆ వాతావరణం లోంచి భయాన్ని క్రియేట్ చేశారు. అది మామూలు విషయం కాదు'' అని 'మిడిల్ క్లాస్ మెలోడీస్' దర్శకుడు వినోద్ అనంతోజు చెప్పారు.
Also Read : 'ఐరావతం' రివ్యూ : థ్రిల్స్ ఉన్నాయా? లేదంటే టార్చర్ చేశారా?
''ఇటువంటి సినిమాలను థియేటర్లలో చూస్తేనే థ్రిల్. మేం సినిమాను చూస్తూ ఎంత ఎంజాయ్ చేశామో... థియేటర్లలో చూసినపుడు మీకు అర్థమవుతుంది. రేపు ఆడియెన్స్ ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తారు'' అని 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' దర్శకుడు స్వరూప్ అన్నారు. ''సంగీత, తిరువీర్, కావ్య, 'శుభలేఖ' సుధాకర్... అందరూ చక్కగా నటించారు. బెలూన్ సౌండ్‌కి కూడా నా గుండె ఝల్లుమంది. రాత్రి ఇంటికి వెళ్లి ఒంటరిగా భోజనం చేయాలన్నా... భయంగా అనిపించింది. ఆర్ఆర్, విజువల్స్ అద్భుతంగా అనిపిస్తుంది. థియేటర్లలో చూస్తేనే ఫీలింగ్ వస్తుంది. 'అమ్మోరు', 'కాంతార'లో ఎటువంటి ఫీల్ వచ్చిందో... ఈ చిత్రంలోనూ అలాంటి ఫీలింగ్ వస్తుంది'' అని వివేక్ ఆత్రేయ చెప్పారు.
టెర్రిఫిక్, హారిఫిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం థియేటర్లలో 'మసూద'ను చూడమని చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, దర్శకుడిగా పరిచయం అవుతున్న సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
/body>