News
News
X

Maruthi: 'ఫ్యాన్స్ నన్ను కొడతారు' - ప్రభాస్‌తో సినిమాపై మారుతి కామెంట్స్!

ప్రభాస్ సినిమా గురించి ఏమైనా చెప్పమని మారుతి అడిగారు సంతోష్ శోభన్. దానికి ఆయన రియాక్షన్ ఏంటంటే..?

FOLLOW US: 
 
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మొదలుపెట్టొద్దని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రిక్వెస్ట్ చేశారు. దానికి కారణం మారుతి అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో మారుతి నుంచి వచ్చిన ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'పక్కా కమర్షియల్' సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ తో సినిమా కరెక్ట్ కాదనేది అభిమానుల అభిప్రాయం. ఈ క్రమంలో మారుతిని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయొద్దని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు.

ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే.. కనీసం ఈ సినిమా ప్రారంభోత్సవం గురించి ప్రకటన చేయడానికి కూడా భయపడ్డారు. ఏ అప్డేట్ ఇస్తే అభిమానులు ఎలా స్పందిస్తారో అని దర్శకనిర్మాతలు భయపడుతున్నట్లు ఉన్నారు. తాజాగా మారుతి 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ గా వచ్చారు. ఆ సినిమా గురించి.. హీరో సంతోష్ శోభన్ గురించి బాగా మాట్లాడారు. మారుతి తన స్పీచ్ ను ముగిస్తున్న సమయంలో.. సంతోష్ శోభన్ వచ్చి ఏమైనా అప్‌డేట్ ఇస్తారా..? అంటూ మారుతిని అడిగాడు. 

ప్రభాస్ సినిమా గురించి ఏమైనా చెప్పమని అడిగారు సంతోష్ శోభన్. దానికి మారుతి ''ఫ్యాన్స్ నన్ను కొడతారు'' అని నవ్వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మారుతి సరదాగా అన్నప్పటికీ.. తాను ప్రభాస్ తో సినిమా చేస్తుండడం పట్ల అభిమానుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అతడికి బాగా అర్ధమైనట్లే ఉంది. ఇదిలా ఉండగా.. అప్పుడే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. మూడు రోజుల పాటు సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్నారు. 

అతడితో పాటు రిద్ధి కుమార్, వైవా హర్ష లాంటి నటులు కూడా షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రభాస్ లేకుండా మరో నాలుగు రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. 'రాజా డీలక్స్' అనే పేరుని ఈ సినిమాకి టైటిల్ గా అనుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడట. అందులో ఒకటి ఓల్డ్ గెటప్ కాగా.. మరొకటి యంగ్ రోల్ అని తెలుస్తోంది. తాతమనవళ్లుగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో కథ నడుస్తుందట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు మాళవిక మోహనన్ కాగా.. మరొకరు నిధి అగర్వాల్. మూడో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ లేదు.

News Reels

దెయ్యంగా ప్రభాస్:
ఇదొక హారర్ స్టోరీ అని మొదటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ దెయ్యం ప్ర‌భాసేన‌ట‌. 'చంద్రముఖి' సినిమాలో జ్యోతిక క్యారెక్టర్ గుర్తుందా..? ఓ ఆత్మ అప్పుడప్పుడూ ఆమెని ఆవహిస్తుంటుంది. అలానే ప్రభాస్ సినిమాలో కూడా ఓ ఆత్మ అప్పుడప్పుడు హీరోని ఆవహిస్తుందట. ఆ సమయంలో ప్రభాస్ ప్రవర్తన వింత వింతగా ఉంటుందని.. అందులోనుంచే కామెడీ పుట్టేలా రాసుకున్నారట. ఓ స్టార్ హీరో, యాక్షన్ హీరో.. పైగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి కాన్సెప్ట్ లో నటించడం కొత్తనే చెప్పాలి. మారుతి బలం.. కామెడీ. ఈ సినిమాలో అదే హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నారట.

Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్

Published at : 31 Oct 2022 04:27 PM (IST) Tags: Santosh Shobhan Maruthi Prabhas like share subscribe movie

సంబంధిత కథనాలు

Guppedantha Manasu December 3rd Update:  అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Guppedantha Manasu December 3rd Update: అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు