అన్వేషించండి

‘భోళా శంకర్‘తో కొడుకు, 'బెదురులంక 2012'తో తండ్రి- చెత్త మ్యూజిక్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, ఆయన కొడుకు మహతి సాగర్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వీరి రీసెంట్ మూవీస్ ‘భోళా శంకర్‘,'బెదురులంక 2012'లో చెత్త మ్యూజిక్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపేసిన సంగీత దర్శకుడు మణిశర్మ. టాలీవుడ్ టాప్ హీరోలు అందరికీ ఆయనే సంగీతం అందించే వారు. మణిశర్మ మ్యూజిక్ అంటే ఆల్బమ్ అదిరిపోవాల్సిందే అనే టాక్ నడిచేంది. ఆయన మీద హీరోలకు ఎంతో నమ్మకం ఉండేది. కనీసం  ట్యూన్లు కూడా వినేవారు కాదు. అలాంటి మణిశర్మ రాను రాను పోటీలో వెనుకబడి పోయారు. ఇప్పటి వరకు సుమారు 200 సినిమాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన కొడుకు మహతి స్వర సాగర్ కూడా సంగీత దర్శకుడిగా బిజీ అయ్యారు. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలను కూడా హ్యాండిల్ చేస్తున్నారు.

మణిశర్మ సంగీతంపై విమర్శలు

అయితే, కొద్ది రోజులుగా తండ్రి, కొడుకులు ఆయా సినిమాకు అందిస్తున్న సంగీతం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మణిశర్మ సంగీతం అందించిన ‘అమీతుమీ‘, ‘ఫ్యాష‌న్ డిజైన‌ర్‘, ‘శ‌మంత‌క‌మ‌ణి‘, ‘లై‘, ‘దేవదాస్‘ లాంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పుకోవచ్చు. 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్‘ సినిమాతో ఫుల్ ఫామ్‌ లోకి వచ్చారు. అయితే, వెంకటేష్‌ ‘నారప్ప‘, చిరంజీవి ‘ఆచార్య‘ సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో అలరించలేకపోయాయి. ‘శాకుంతలం‘ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక తాజాగా విడుదలైన 'బెదురులంక 2012'  సంగీతం కూడా ప్రేక్షకులను అకట్టుకోలేదనే టాక్ నడుస్తొంది. ‘బెదురులంక 2012‘ బ్యాగ్రౌండ్ స్కోర్‌ అస్సలు బాగాలేదంటున్నారు నెటిజన్లు. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉన్న థియేటర్లలో కూడా మణిశర్మ సంగీతం ఆకట్టుకోలేకపోయిందనే టాక్ నడుస్తోంది.

ఆకట్టుకోని మహతి సాగర్ మ్యూజిక్

అటు మణిశర్మ కొడుకు మహతి సాగర్  రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘బోళా శంకర్‘ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం కూడా మ్యూజిక్ పరంగా పెద్దగా సక్సెస్ కాలేదనే టాక్ వినిపించింది. మహతి సాగర్ ‘భోళా శంకర్‘ చిత్రానికి ముందు ‘భీష్మ‘  ‘ఛలో‘, ‘మాచెర్ల నియోజకవర్గం‘ చిత్రాలకు సంగీతం అందించారు. మొత్తంగా ‘బోళా శంకర్‘ చిత్రంతో కొడుకు విమర్శలను ఎదుర్కోగా, 'బెదురులంక 2012'తో తండ్రి ట్రోలింగ్ కు గురవుతున్నారు. టాలీవుడ్ మెలోడీ బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న మణిశర్మ సంగీతం ఎందుకు చప్పగా మారుతోంది? అని నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం తర్వాత అంచనాలు పెరిగినప్పటికీ, మణిశర్మ 'ఆచార్య', ‘బెదురులంక 2012’తో మళ్లీ ఫామ్ కోల్పోయాడంటున్నారు.

'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' భామ నేహా శెట్టి జంటగా నటించిన 'బెదురులంక 2012' శుక్రవారం(ఆగష్టు25న) విడుదలైంది. డిసెంబర్ 31, 2012లో యుగాంతం వస్తుందని అందమైన గోదావరి తీరంలోని ఓ పల్లెలో ప్రజలు ఏం చేశాడనేది 'బెదురులంక 2012' కథ. క్లాక్స్ దర్శకత్వంలో సి. యువరాజ్ సమర్పణలో బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మించారు.  అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన పాత్రల్లో నటించారు.

Read Also: తెలుగులో సినిమాలు చేస్తున్నా, దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో తెలియదట - అడ్డంగా బుక్కైన కియారా అద్వాని

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget