By: ABP Desam | Updated at : 25 Aug 2023 03:14 PM (IST)
Photo Credit: Kiara Advani/Instagram
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది కియరా అద్వానీ. ఆ తర్వాత బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చెర్రీతో మరోసారి జోడీ కడుతోంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో కియారా కథానాయికగా నటిస్తోంది.
కియారా చాలా కాలంగా సౌత్ లో సినిమాలు చేస్తున్నా, ఆమెకు సౌత్ రాష్ట్రాలు ఎన్ని అనేది తెలియకపోవడం విశేషం. ఇప్పుడు తెలుసో? లేదో? తెలియదు కానీ, గతంలో ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఆమె సౌత్ రాష్ట్రాలు ఎన్ని, ఆయా రాష్ట్రాల ప్రజల మాతృభాష ఏంటి? అనేది చెప్పలేకపోయింది. కియారాకు సౌత్ రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లోని భాషలు తెలుసా? అనే ప్రశ్నకు ఆమె సరైన సమాధానం చెప్పలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు పేర్లు చెప్పినప్పటికీ, కేరళను ప్రస్తావించడం మర్చిపోయింది. రానా హోస్టుగా చేసిన ఓ షోలో రామ్ చరణ్, కియారా కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తరాది నుంచి వచ్చిన కొంత మంది హీరోయిన్లతో కలిసి సినిమాలు చేశానని రామ్ చరణ్ చెప్పారు. వారిలో కొందరికి తెలుగు కూడా తెలియదన్నారు. ఇంతలో కియారా కలుగజేసుకుని ‘బాహుబలి’ తర్వాత దేశంలో తెలుగు తెలియని వారు ఎవరూ ఉండరని చెప్పింది. ఈ నేపథ్యంలో సౌత్ రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో భాషలు నీకు తెలుసా? అని చెర్రీ అడుగుతారు. "నాకు తెలుసు. ఒకటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు" అంటుంది. కేరళ గురించి చెప్పడం మర్చిపోయావ్? అంటూ చెర్రీ, రానా ఆమెను ఆటపట్టించారు. ఇది జరిగి చానాళ్లు అవుతోంది. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తన సినిమాలను విస్తృతం చేసుకునేందుకు హిందీ నేర్చుకుంటున్నాడు. రానా కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగే కియారా కూడా సౌత్ గురించి తెలుసుకుంటే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక 'వినయ విధేయ రామ' తర్వాత కియారా రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్' అనే మూవీ చేస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రతో పాటు ఎన్నికల అధికారి పాత్రలో కూడా రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చెర్రీ సరసన కియార అద్వానీ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ లో మూవీ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, ఎస్‌జె సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ మరియు నాజర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read Also: ఉగాండానూ ఊపేస్తున్న తమన్నా సాంగ్ - ‘కావాలయ్య’ను రీక్రియేట్ చేసిన చిన్నారులు, వీడియో వైరల్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
/body>