అన్వేషించండి
Advertisement
Maa Elections : మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి.. 'మా' సభ్యుల కామెంట్స్..
టాలీవుడ్ లో ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు భారీ పోటీ నెలకొంది.
టాలీవుడ్ లో ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ఎన్నికలకు భారీ పోటీ నెలకొంది. మంచు విష్ణు(Manchu Vishnu), ప్రకాష్ రాజ్(Prakash Raj), హేమ, జీవితా రాజశేఖర్ ఇలా చాలా మంది అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవలు మరింత పెద్దవి చేస్తున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజుకి లేఖ రాస్తూ.. 'మా' ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. తాజాగా 'మా' అసోసియేషన్ సభ్యులు కొందరు ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
అధ్యక్ష పోటీకి ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని క్రమశిక్షణ కమిటీని డిమాండ్ చేశారు. అలానే అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ 110 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖలను కృష్ణంరాజుకి పంపినట్లు 'మా' వ్యవస్థాపక సభ్యుడు మానిక్ తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడు నరేష్ పై కొంతమంది సభ్యులు అసత్య ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని.. 'మా' అసోసియేషన్ ను చులకనగా చేసి మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : నటి హేమకు షాక్.. షోకాజ్ నోటీసులు జారీ..
అలానే మా ఎన్నికల్లో మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కృష్ణంరాజుని కోరారు. 110 మంది సభ్యుల సపోర్ట్ మంచు విష్ణుకి ఉందని అన్నారు. ఇండియా, పాకిస్తాన్ తరహాలో మా లో గొడవలు జరుగుతున్నాయని.. గత 25 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఇలాంటి వివాదాలు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా ప్రకాశ్ రాజ్ ‘జెండా’ ఎగరేస్తాం అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చకు దారితీసింది. ఆగస్ట్ 15ని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టారా... లేదా... త్వరలో జరగబోతున్న మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో తాము జెండా ఎగరేస్తామని ఇలా అన్నారా అనే చర్చ ఊపందుకుంది.
Also Read:
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
రాజమండ్రి
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion