అన్వేషించండి

MAA Naresh: ‘చచ్చిపోతుంటే వదిలేస్తామా?’ హేమాపై జీవిత ఫైర్.. మండిపడ్డ నరేష్!

నటి హేమా చేసిన వ్యాఖ్యలపై ‘మా’ అధ్యక్షుడు నరేష్ స్పందించారు. హేమా మాటలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని జీవిత కూడా మండిపడ్డారు.

మా ఎన్నికల కోసం టాలీవుడ్‌లో వాడీవేడి వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య నెలకొన్న వాగ్వాదాలు చర్చనీయం కాగా.. తాజాగా ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై నటి హేమా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నరేష్ ఆధ్వర్యంలో ‘మా’ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని హేమా చేసిన ఆరోపణలపై నరేష్, జీవిత స్పందించారు. 

విలేకరుల సమావేశంలో నరేష్ మాట్లాడుతూ.. హేమా వ్యాఖ్యలను ఖండించారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ గౌరవ మర్యాదలను దెబ్బతీసేలా హేమ మాట్లాడారని తెలిపారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కమిటీ తీసుకొనే నిర్ణయం ప్రకారమే ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వల్లే ఎన్నికలు వాయిదా పడుతున్నాయని, ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయిస్తామన్నారు.

కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించకూడదని హైకోర్ట్, సుప్రీం కోర్టులు చెప్పాయని నరేష్ గుర్తు చేశారు. ఈ నెల 22న జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని నరేష్ తెలిపారు. ‘మా’లో ప్రస్తుతం 4.70 కోట్ల ఫండ్ ఉందన్నారు. కరోనా సమయంలో మా సభ్యుల కోసం ఎన్నో సేవలను చేశామని, ఫండ్‌ను ముట్టుకోకుండా బయట నుంచి నిధులు సేకరించామన్నారు. ఇందుకు పరిశ్రమ పెద్దలు, స్నేహితులు ఎంతో సహకరించాని తెలిపారు. అన్నింటికీ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. 

జీవిత మాట్లాడుతూ.. ‘‘హేమా చెప్పిన మాటలు చాలా తప్పుగా అనిపించాయి. సభ్యులకు ఆలోచించి ఓటు చేసే స్వేచ్ఛను ఇవ్వండి. ఇలా గందరగోళానికి గురిచేయకండి. మెంబర్స్ చనిపోతుంటే ఫండ్ ముట్టుకోమని, వారిని చనిపోనిస్తామా? ఆ నిధులతో సభ్యులకే లబ్ది జరిగింది. మా ఇంట్లో పెళ్లి చేసుకున్నామా? లేదా నరేష్ పార్టీలు చేసుకున్నారా?’’ అని ప్రశ్నించారు.  

మా ఎన్నికల కోసం ఒక వర్గం పట్టుబడుతుంటే.. మరోవర్గం మాత్రం ఏకగ్రీవం చేయాలనే వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, నరసింహారావులు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘మా’కు సొంత బిల్డింగ్ కట్టాలన్న నినాదంతో వీరు పోటీకి సిద్ధమయ్యారు. అయితే, హేమా.. ఇటీవల ‘మా’ నిధుల వినియోగంపై తీవ్ర ఆరోపణలు చేయడం వల్ల వివాదం రాజుకుంది. 

‘‘కొంతమంది నరేష్‌ను అధ్యక్షుడిగా కొనసాగించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మా అసోషియేషన్‌లోని రూ.5 కోట్ల నిధుల్లో ఇప్పటికే నరేష్ రూ.3 కోట్లను ఖర్చు చేశారు. ఇదివరకు ఆఫీస్ ఖర్చులకు బయట నుంచి నిధులు తీసుకొచ్చి ఫండ్ రైజ్ చేసేవాళ్లం. కానీ నరేష్ హాయిగా కూర్చొని అకౌంట్లోని సొమ్ములన్నీ ఖర్చుపెట్టేస్తున్నారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలను తప్పకుండా నిర్వాహించాలనే డిమాండ్‌తో 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నా. ఇంతవరకు ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించలేదు. రూ.5 కోట్ల నిధులను రూ.2 కోట్లకు తీసుకొచ్చారు. గత మెడికల్ క్లైయిమ్, రానున్న మెడికల్ క్లైమ్‌కు కలిపి సుమారు రెండున్నర కోట్లకు పైగా ఖర్చయ్యాయి. ఆఫీస్ ఖర్చులతో కలిపితే సుమారు రూ.3 కోట్లు అవుతుంది. నరేష్ ఆ కూర్చీ దిగకూడదు, ఎన్నికలు జరగకూడదని ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలు తప్పకుండా జరగాలనే డిమాండుతోనే ఈ లేఖ పంపుతున్నా. ఇందుకు మీ మద్దతు కావాలి’’ అని హేమా ఇటీవల వ్యాఖ్యానించారు. 

టాప్ హెడ్ లైన్స్

Surekha Vani : 'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్' - పర్సనల్ వీడియో వైరల్... సురేఖా వాణి సీరియస్
'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్' - పర్సనల్ వీడియో వైరల్... సురేఖా వాణి సీరియస్
Crime Thriller OTT : రేప్ కేస్ నిందితుల ఎన్‌కౌంటర్ - ఓటీటీలోకి వారణాసి విలన్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రేప్ కేస్ నిందితుల ఎన్‌కౌంటర్ - ఓటీటీలోకి వారణాసి విలన్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Athulya Chandra Case : డాక్టర్‌పై దాడి కేసులో హీరోయిన్ అరెస్ట్ - మత్తు మందిచ్చి లైంగికంగా వేధించాడంటూ బిగ్ ట్విస్ట్
డాక్టర్‌పై దాడి కేసులో హీరోయిన్ అరెస్ట్ - మత్తు మందిచ్చి లైంగికంగా వేధించాడంటూ బిగ్ ట్విస్ట్
Bigg Boss Kalyan Padala Movie : బిగ్ బాస్ విన్నర్ కల్యాణ్ పడాల హీరోగా కొత్త మూవీ - హారర్ కామెడీ జానర్‌లో 'ఫన్'
బిగ్ బాస్ విన్నర్ కల్యాణ్ పడాల హీరోగా కొత్త మూవీ - హారర్ కామెడీ జానర్‌లో 'ఫన్'

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Bigg Boss Kalyan Padala Movie : బిగ్ బాస్ విన్నర్ కల్యాణ్ పడాల హీరోగా కొత్త మూవీ - హారర్ కామెడీ జానర్‌లో 'ఫన్'
బిగ్ బాస్ విన్నర్ కల్యాణ్ పడాల హీరోగా కొత్త మూవీ - హారర్ కామెడీ జానర్‌లో 'ఫన్'
Driving Licence Rules: LLR ఉంది కదాని నేరుగా డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లలేరు.. లైసెన్స్‌ పొందాలంటే కొత్త నిబంధనలు ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఈ ఆరు వీడియోలు చూడకపోతే మీకు DL రాదు!
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
CM Revanth Reddy: 3 రోజులపాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.9100 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
3 రోజులపాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.9100 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
HYDRA Hyderabad Water Crisis: తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
Embed widget