అన్వేషించండి
Advertisement
Manchu Vishnu: ''ఇండస్ట్రీలో నటుల బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఈగోలే ఎక్కువ..''
''అవార్డులు ఆయన తీసుకొచ్చాడా..? అంటే రామారావు గారు కన్నా, నాగేశ్వరావు గారు కన్నా.. మా నాన్నగారి కన్నా.. చిరంజీవి గారి కన్నా.. గొప్ప నటుడా ఆయన..? అంటూ ప్రకాష్ రాజ్ ని ప్రశ్నించారు మంచు విష్ణు.
'మా' ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ప్రచారం షురూ చేసిన ఈ రెండు వర్గాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు మంచు విష్ణు.
'పవన్ కళ్యాణ్ సినిమా మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్' అనే కామెంట్ పై రియాక్ట్ అయిన మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ చెప్పిన స్టేట్మెంట్ చాలా ఫన్నీగా ఉందని.. పవన్ కళ్యాణ్ గారంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. ఆయనొక ఆడియో ఫంక్షన్ లో నాన్న గారి పేరు ఎందుకు ఎత్తారో ఆయనకే తెలియాలని.. ఆల్రెడీ ఇండస్ట్రీ పెద్దలు టికెట్ రేట్ ఇష్యూ గురించి మాట్లాడుతున్న సమయంలో.. ఆ విషయంపై చర్చలు జరుగుతున్న సమయంలో.. పవన్ కళ్యాణ్ గారు సడెన్ గా గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేసేసరికి నిర్మాతలంతా 'అయ్యేయో ఎందుకు ఇలా మాట్లాడారో' అనుకున్నారని మంచు విష్ణు అన్నారు.
ఆ తరువాత ప్రకాష్ రాజ్ గారు నామినేషన్ వేయడానికి వచ్చారని.. ఆ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని 'మీరు ఇండస్ట్రీ తరఫున ఉన్నారా..? లేక పవన్ కళ్యాణ్ తరఫున ఉన్నారా..?' అని అడిగానని.. ఆయనకు తెలుగు సగం అర్ధం కాదు కదా..? సో తప్పుగా తీసుకున్నారని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు మంచు విష్ణు.
అంత గొప్ప నటుడా ఆయన..?:
''అవార్డులు ఆయన తీసుకొచ్చాడా..? అంటే రామారావు గారు కన్నా, నాగేశ్వరావు గారు కన్నా.. మా నాన్నగారి కన్నా.. చిరంజీవి గారి కన్నా.. గొప్ప నటుడా ఆయన..? ఇండస్ట్రీ ఆయన్ను పోషించింది.. అవకాశం ఇచ్చింది.. ఆయన టాలెంట్ ను నేను ప్రశ్నించడం లేదు. కానీ తెలుగు వ్యక్తులపై ఆయన అవగాహన శూన్యం. నడిగర్ సంఘం విషయంలో కూడా ఈయన రచ్చ రచ్చ చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకో అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇంతకముందు 'మా' ఎలెక్షన్ ఇంత అగ్రెసివ్ గా జరగలేదు. ఈసారి ఇలా జరుగుతున్నందుకు కారణం ప్రకాష్ రాజ్ గారే. ఆయనొక టాక్సిక్ నేచర్ ఉన్న వ్యక్తి'' అంటూ మండిపడ్డారు మంచు విష్ణు.
ఆయనకు అంత పొగరు..
''తెలుగువాళ్ల కోసం ఈ అసోసియేషన్ మొదలుపెట్టారు. ఎవరూ కాంపిటిషన్ లో ఉండకూడదని నేను చెప్పలేదు. కానీ ఆయన సరైన తెలుగువాళ్లు లేక ఇక్కడకి వచ్చానని చెప్పడాన్ని నేను వ్యతిరేకించాను. ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని అడగండి ఆయన గురించి చెప్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ ని బూతులు తిట్టారు.. దీంతో సినిమా నుంచి తీసేసి సోనూసూద్ ని తీసుకున్నారు. ఆయనకు అంత పొగరు. 'మా' అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆయనకంటే బెటర్ గా నేను చేయగలను'' అని అన్నారు.
వారసత్వాన్ని చూపించుకొని ముందుకువెళ్తున్నారనే కామెంట్స్ విష్ణు రియాక్ట్ అయ్యారు. 'వారసత్వాన్ని వాడుకొని ఉంటే నేను సూపర్ స్టార్ అయిపోయేవాడ్ని కదా.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మొదటి సినిమాకే పనికొస్తుంది. నేను పెద్దలందరి బ్లెస్సింగ్స్ తీసుకున్నానంటే వాళ్లంతా నా ఫ్యామిలీ కాబట్టి. నేను ఇక్కడే పెరిగాను' అని చెప్పుకొచ్చారు.
కులం పాత్ర 'జీరో'..
కులం పాత్ర ఎంతవుందని అడిగిన ప్రశ్నకు 'జీరో' అని సమాధానమిచ్చారు మంచు విష్ణు. ఇండస్ట్రీ మొత్తం ఒక కులంగా ఉంటామని.. నా ప్యానెల్ లో ఉన్నవారిది ఒకటే కులమా..? అని ఎదురు ప్రశ్నించారు.
ఇండస్ట్రీలో నటుల బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఈగోలే ఎక్కువ ఉంటాయి..
పోనీ ఈగోలు ఉన్నాయా..? అని ప్రశ్నించగా.. ''ఇండస్ట్రీలో నటుల బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఈగోలే ఎక్కువ ఉంటాయి'' అని నవ్వుతూ బదులిచ్చారు మంచు విష్ణు. 'మా' ఎలెక్షన్స్ లో కూడా ఈగో ఒక పార్ట్ అని చెప్పారు. 'మంచు విష్ణు ఈగోనా..? మంచు ఫ్యామిలీ ఈగోనా..?' అని అడగ్గా.. ''ప్రతి వ్యక్తికి ఈగో ఉంటుంది.. కానీ ఈగోతో నేను ఇందులో పోటీ చేయడం లేదు. ఈగోతో ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని'' అన్నారు.
''ప్రకాష్ రాజ్ చేసే విమర్శలు చూస్తుంటే నాకు నవొస్తుంది.. ఆయనకు చిన్నా, పెద్దా అనే గౌరవం లేదు. 'రామ్ లీల' సినిమాను సాఫ్ట్ పోర్నోగ్రఫీ అన్నారు. కోట్ల మంది కొలిచే రాముడిని ఆయన విమర్శించారు. ప్రధాన మంత్రినే ఆయన తక్కువ చేస్తూ మాట్లాడతారు'' అని చెప్పుకొచ్చారు.
ఇక తన ఫ్యామిలీలో క్యాస్ట్ ఫీలింగ్ లేదని.. తన భార్య క్రిస్టియన్ అని.. తన బావ అయ్యంగార్ అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion