Manchu Vishnu: మా నాన్నలో ఆ విషయమే నాకు అస్సలు నచ్చదు: మంచు విష్ణు - ఆ మాటకు షాకయ్య: మోహన్ బాబు
తన తండ్రి మోహన్ బాబుపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయనను అన్ని విషయాల్లో రోల్ మోడల్ గా తీసుకుంటాన్న విష్ణు, ఒక విషయం మాత్రం అస్సలు నచ్చడని చెప్పాడు.
మంచు విష్ణు హీరోగా, అందాల ముద్దుగుమ్మలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నది. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మా నాన్నలో ఆ విషయం అస్సలు నచ్చదు!
ఈ సందర్భంగా మాట్లాడిన హీరో మంచు విష్ణు ‘జిన్నా’ టీమ్ కు థ్యాక్స్ చెప్పారు. ఈ సమయంలోనే తన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబులోని మంచి చెడుల గురించి వివరిస్తూ పలు కీలక విషయాలు వెల్లడించాడు. జిన్నా సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైందన్నాడు. ఈ సినిమాకు అనూబ్ రూబెన్స్ చక్కటి సంగీతం అందించినట్లు చెప్పారు. తన బిడ్డలు అరియానా, వివియానా కలిసి ఈ సినిమాలో ఓ పాట పాడారని చెప్పాడు. ప్రసంగం మధ్యలో, తన తండ్రి మోహన్ బాబు గురించి గతంలో ఎప్పుడూ చెప్పని విషయాలను విష్ణు వెల్లడించాడు.
‘‘నాన్న నుంచి నేను చాలా విషయాల్లో స్ఫూర్తి పొందాను. ఒకటి తప్ప ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అదే ఆయన కోపం. ఆయనలో నాకు నచ్చని విషయం ఏదైనా ఉందంటే అది ఆయన కోపమే. ఇక మా అమ్మ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంలో నెంబర్ వన్. నా భార్య చూడ్డానికి 5 అడుగులే ఉంటుంది. కానీ, కంటి చూపుతోనే నన్ను బెదిరిస్తుంది” అని చెప్పాడు.
విష్ణు మాటలు విన్ని ఆడియెన్స్ నవ్వుల్లో మునిగిపోయారు. ఇక ఈ కార్యక్రమానికి హోస్టుగా చేసిన అలీకి ధన్యవాదాలు చెప్పాడు విష్ణు. అడగ్గానే వచ్చి ఓ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవాకు కృతజ్ఞతలు చెప్పాడు. సాంగ్ పూర్తయ్యాక చెక్ ఇవ్వమని నాన్న మనిషిని పంపిస్తే తమ్ముడికి సాంగ్ చేస్తే అన్న డబ్బులు తీసుకోడని ప్రభుదేవా అన్నట్లు వివరించాడు. జిన్నా సినిమా కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ విష్ణు ధన్యవాదాలు చెప్పాడు. ఈ వేడుకలో తండ్రిపై విష్ణు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
విష్ణు ఏ సినిమాకు కష్టపడని కష్టం ఈ సినిమాకు పడ్డాడు!
కార్యక్రమంలో విష్ణు ఎక్కువ సేపు మాట్లాడొద్దని చెప్పడంపై మోహన్ బాబు కాస్త గంభీరంగానే స్పందించారు. అన్నగారు ఎన్టీఆర్ మూవీ ఫంక్షన్లో గానీ, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు సినిమా ఫంక్షన్లలో ఎవరూ ఇన్ని నిమిషాలే మాట్లాడాలనే కండిషన్ పెట్టలేదన్నారు. కానీ, విష్ణు మీరు ఇంత సేపే మాట్లాడాలని చెప్పడంతో షాకయ్యానన్నారు. అంటే నేను వేదికపై ఎక్కువగా మాట్లాడతానా అని తనకు అనిపించిందన్నారు. ఆ తర్వాత ‘జిన్నా’ మూవీ గురించి మోహన్ బాబు మాట్లాడారు. విష్ణు ఏ సినిమాకు కష్టపడని కష్టం ఈ సినిమాకు పడ్డాడని తెలిపారు. నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు స్టోరీ ప్లాన్ అందిస్తే దాన్ని పట్టుకుని, డైరెక్టర్ సూర్య ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని వెల్లడించాడు.
చాలా కాలంగా హిట్ లేక బాధపడుతున్న విష్ణుకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. వాస్తవానికి మంచు విష్ణు నటిచించి కొన్ని సినిమాలు మినహా చాలా చిత్రాలు ఫ్లాప్ గానే మిగిలాయి. ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ సినిమాలు అప్పట్లో ఫర్వాలేదు అనిపించాయి. ఈ సినిమాల కారణంగానే ఆయన మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిగతా సినిమాలన్నీ ఆయన కెరీర్ కు పెద్దగా పనికిరాలేదని చెప్పుకోవచ్చు.