Manchu Family Warning To Trollers: ట్రోలింగ్ ఆపేస్తారా? 10 కోట్లు కడతారా? - మంచు ఫ్యామిలీ హెచ్చరిక
మంచు కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ట్రోల్ చేసేవాళ్ళకు తొలి హెచ్చరిక జారీ అయ్యింది. ట్రోలింగ్ ఆపకపోతే పరువునష్టం దావా కేసులు తప్పవని ట్రోలర్స్‌కు తెలిపారు.
![Manchu Family Warning To Trollers: ట్రోలింగ్ ఆపేస్తారా? 10 కోట్లు కడతారా? - మంచు ఫ్యామిలీ హెచ్చరిక Manchu Mohan Babu family warning to trollers: Seshu Kumar, Vishnu Manchu Production house 24 frames factory employee raised complaint about Cyber bulling on Manchu Family Manchu Family Warning To Trollers: ట్రోలింగ్ ఆపేస్తారా? 10 కోట్లు కడతారా? - మంచు ఫ్యామిలీ హెచ్చరిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/4b3644210466189f9712d84e32ef9fd3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పద్మశ్రీ పురస్కార గ్రహీత, లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) ఎన్నికలు, ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించడం, ఇటీవల విడుదలైన 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్స్... ప్రతి అంశంలోనూ ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి.
మంచు ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తున్న ట్రోలర్స్‌కు ఓ విధంగా తొలి హెచ్చరిక జారీ అయ్యిందని చెప్పాలి. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ) తరఫున శేషు కుమార్ అనే ఆయన ట్రోలర్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా సైట్స్‌లో మంచు ఫ్యామిలీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని అందులో కోరారు. ఒకవేళ ట్రోలర్స్ తాము చేసిన పోస్ట్‌లు డిలీట్ చేయకపోతే... మంచు ఫ్యామిలీ మెంబర్స్ మీద పర్సనల్ ఎటాక్ చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు రూ. పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని తెలియజేశారు.
Also Read: ఇద్దరు హీరోలు ట్రోల్ చేయిస్తున్నారు - 100 మందిని పెట్టి మరీ - మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు!
'సన్ ఆఫ్ ఇండియా' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇద్దరు హీరోలు కావాలని ట్రోల్స్ చేయిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ ఇద్దరు హీరోలు ఎవరనే చర్చ మొదలైంది.
Also Read: రెండే టికెట్లు బుక్ అయ్యాయా? మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా'పై ట్రోల్స్ మామోలుగా లేవు!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)