Mahesh Babu:‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లో యంగ్ టైగర్‌తో మహేష్ బాబు, అభిమానులకు పండగే

ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి గెస్ట్ గా అలరించబోతున్నాడు.

FOLLOW US: 

టాలీవుడ్లో ఇద్దరు సూపర్ స్టార్లను తెలుగు ప్రేక్షకులు ఒకేతెరపై చూడబోతున్నారు. ప్రిన్స్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులని అందరికీ తెలిసిందే. త్వరలో వీరిద్దరూ ఒకే వేదికపై అలరించబోతున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’షోకు ఎన్టీఆర్ హోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోకు ప్రతివారం ఒక గెస్టును పిలుస్తారు. గతంలో సమంత, రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు మహేష్ బాబు గెస్టుగా వచ్చారు. ఆ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఎపిసోడ్ త్వరలో రాబోతోందంటూ జెమిని ఛానెల్ వాళ్లు కూడా ప్రకటించారు. 

Koo App
#TMSRUpdates ఎవరు మీలో కోటీశ్వరులు | జెమినీ టీవీ త్వరలో జెమినీ టీవీలో దశాబ్దపు ఎపిసోడ్‌ని చూడటానికి సిద్ధంగా ఉండండి. #JrNTR #MaheshBabu #GeminiTV #PoonakaalaEpisodeLoading #EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu #మన_టీవీ - TMSR Updates (@TMSRUpdates) 20 Nov 2021నిజానికి మహేష్ బాబు ఎపిసోడ్ ఎప్పుడో షూటింగ్ జరిగినా కూడా ఇప్పటివరకు ప్రసారం చేయాలేదని టాక్ వినిపించింది. సెప్టెంబరు చివరివారంలోనే ఆ ఎపిసోడ్ షూటింగ్ జరిగినట్టు సమాచారం. ఆ ఎపిసోడ్ ను దసరా లేదా దీపావళికి ప్రసారం చేస్తారని అనుకున్నారంతా. కానీ ఛానెల్ వారు ప్రసారం చేయలేదు. దీంతో ఆశగా చూసిన అభిమానులు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు మాత్రం త్వరలో ప్రసారం చేయబోతున్నట్టు జెమిని ఛానెల్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేశారు నిర్వాహకులు.  ఈ ఫొటోలో ఎన్టీఆర్ హోస్ట్ గా సూటు బూటు ధరించి ఉండగా.. మహేష్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో స్టైలిష్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వీరిద్దరి ఎపిసోడ్ కు ఓ రేంజ్లో టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ షోలో మహేష్ బాబు పాతిక లక్షలు గెలుచుకున్నట్టు సమాచారం. మహేష్‌కు చదివే అలవాటు ఉండడం వల్లే ఆయన పాతిక లక్షలు గెలచుకున్నారు. తాను గెలుచుకున్న మొత్తాన్ని ఓ స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇచ్చేశారట ప్రిన్స్. అభిమానులు ఈ ఎపిసోడ్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 20 Nov 2021 04:21 PM (IST) Tags: Mahesh Babu Jr NTR Evaru Meelo Koteeswarulu ఎవరు మీలో కోటీశ్వరులు

సంబంధిత కథనాలు

Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత

Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత

Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్‌లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్

Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్‌లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్

Netizens Reaction To VD Nude Poster: ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ

Netizens Reaction To VD Nude Poster: ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ

Bollywood Horror Movies: ఈ హిందీ హర్రర్ సినిమాల్లోని ఈ ఘటనలు నిజంగానే జరిగాయ్!

Bollywood Horror Movies: ఈ హిందీ హర్రర్ సినిమాల్లోని ఈ ఘటనలు నిజంగానే జరిగాయ్!

Sita Ramam 2nd Song: సీత అంత అందంగా 'సీతా రామం'లో పాట - ప్రోమో చూడండి 

Sita Ramam 2nd Song: సీత అంత అందంగా 'సీతా రామం'లో పాట - ప్రోమో చూడండి 

టాప్ స్టోరీస్

Pawan Kalyan : ఇద్దరు ఎంపీలతో మొదలై కేంద్రంలో అధికారం, జనసేన ప్రస్థానం కూడా అంతే - పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఇద్దరు ఎంపీలతో మొదలై కేంద్రంలో అధికారం, జనసేన ప్రస్థానం కూడా అంతే - పవన్ కల్యాణ్

Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ!

Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ!

Jagan Daughter Harsha : కుమార్తె విజయంపై సంతోషం - ప్యారిస్‌ నుంచి సీఎం జగన్ ట్వీట్ వైరల్

Jagan Daughter Harsha : కుమార్తె విజయంపై సంతోషం - ప్యారిస్‌ నుంచి సీఎం జగన్ ట్వీట్ వైరల్

Shiv Sena MP Sanjay Raut: షిండే శిబిరం నుంచి నాకూ ఆఫర్ వచ్చింది, మభ్యపెడితే లొంగిపోను-సంజయ్ రౌత్

Shiv Sena MP Sanjay Raut: షిండే శిబిరం నుంచి నాకూ ఆఫర్ వచ్చింది, మభ్యపెడితే లొంగిపోను-సంజయ్ రౌత్