MAA Election: వారికి కూడా బాధ్యత ఉంది.. స్టార్ హీరోలపై ప్రకాష్ రాజ్ కామెంట్స్..
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలెక్షన్స్ అక్టోబర్ 10న జరగనున్నాయి.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలెక్షన్స్ అక్టోబర్ 10న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 'సినిమా బిడ్డలం' ప్యానెల్ తరఫున 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలో ఆదివారం 'మా' సభ్యుల కోసం విందు ఏర్పాటు చేసి.. సమావేశం నిర్వహించారు. 'మా' ఎన్నికల్లో తన ప్యానెల్ గెలిస్తే రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తానని ప్రకాష్ రాజ్ ఈ సమావేశంలో పేర్కొన్నారని తెలిసింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, జీవిత, హేమ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Maa Elections 2021: ఎన్నికలు అన్నాక చర్చలు కామన్.. బండ్ల గణేష్ కి కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్..
సమావేశం అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ప్యానెల్ లోని 26 మందితో పని చేయడం కాదని.. ఇంట్లో 200 మందితో పని చేయించేవాడు నిజమైన నాయకుడవుతాడని అన్నారు. పెద్ద హీరోలు గతంలో 'మా' ఎలెక్షన్స్ లో ఎందుకు పాల్గొనలేదో విశ్లేషించుకున్నామని చెప్పారు. వారితో మాట్లాడామని.. ఈసారి వారు కూడా ఎలెక్షన్స్ లో పాల్గొంటారని నమ్ముతున్నామని అన్నారు. 'మా' ఉన్నతికి తను.. తన ప్యానెల్ రావడమే కాదు.. హీరోల బాధ్యత కూడా ఉందని అన్నారు.
ఈ నెల 19న 'మా' ఎలెక్షన్స్ నోటిఫికేషన్స్ వస్తుందని.. అది వచ్చిన తరువాత తన మేనిఫెస్టోను తెలియజేస్తానని అన్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. కరోనా సమయంలో ప్రకాష్ రాజ్ 'మా' కళాకారులందరినీ పిలిచి విందు భోజనాలు ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని బండ్ల గణేష్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలను విని షాక్ అయిన ప్రకాష్ రాజ్.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కనిపిస్తున్న ర్యాలీలపై కూడా బండ్ల గణేష్ స్పందిస్తే బాగుంటుందని అన్నారు. కోవిడ్ రూల్స్ ప్రకారమే తాము సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేశారు.
Also Read : MAA Election 2021: ఇవేం విందు రాజకీయాలన్నా.. కావాలంటే ఫోన్ చేయోచ్చుగా.. 'మా' ఎన్నికల హీట్.. బండ్ల కామెంట్స్
Also Read: MAA Election 2021: మోహన్ బాబు వ్యాఖ్యలపై నాగబాబు మండిపాటు.. దాని గురించి నరేష్-శివాజీలను అడగండి
Also Read : Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ
Also Read: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..