Maa Elections 2021: ఎన్నికలు అన్నాక చర్చలు కామన్.. బండ్ల గణేష్ కి కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఎన్నికలకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారం షురూ చేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారు.. ఎవరికివారు వారి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్ 'మా' కళాకారులను విందుకి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Also Read : MAA Election 2021: ఇవేం విందు రాజకీయాలన్నా.. కావాలంటే ఫోన్ చేయోచ్చుగా.. 'మా' ఎన్నికల హీట్.. బండ్ల కామెంట్స్
దేనిని బండ్ల గణేష్ తీవ్రంగా ఖండించారు. విందులు, సన్మానాల పేరుతో 'మా' కళాకారులందరినీ ఒక చోట చేర్చొద్దని.. కరోనా సమయంలో ఇలాంటి పనులు కరెక్ట్ కాదని.. ఓటు కావాలంటే ఫోన్ చేసేయి అడగాలని.. అంతేకానీ ఇలా విందుల పేరుతో కళాకారుల ప్రాణాలతో చెలగాటాలాడొద్దని అన్నారు. బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. అసోసియేషన్స్ ఎన్నికలు అన్నాక అందరితో చర్చలు, క్యాంపెయిన్ చేయడాలు కామన్ అని.. అందులో భాగంగా ఈరోజు కొంతమంది ఆర్టిస్ట్ లను లంచ్ కు పిలిచానని.. వారితో సమస్యల గురించి చర్చించామని అన్నారు.
ఇప్పటివరకు 'మా'లో జరిగిన పనులు.. ఇకపై జరగాల్సిన పనుల గురించి దాదాపు మూడు గంటల పాటు చర్చించుకున్నామని తెలిపారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలు విన్నాక షాకయ్యానని తెలిపారు. గుజరాత్ తో పాటు మరికొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని.. అక్కడికే అందరూ వెళ్తున్నారని.. మరి దాని గురించి బండ్ల గణేష్ ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. 'మా' ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 19న వస్తుందని.. ఆ తరువాత అన్ని విషయాలు తెలియజేస్తానని తెలిపారు.
ఇక కరోనా నియమాలు పాటిస్తూ ప్రకాష్ రాజ్ సమావేశం జరిగిందని జీవితరాజశేఖర్ తెలిపారు. కరోనా భయంతో ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటామని ఆమె ప్రశ్నించారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ పెళ్లిళ్లు, సమావేశాలు జరుగుతున్నాయని.. తాము కూడా నియమాలు పాటిస్తూ విందు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
Also Read: MAA Election 2021: మోహన్ బాబు వ్యాఖ్యలపై నాగబాబు మండిపాటు.. దాని గురించి నరేష్-శివాజీలను అడగండి
Also Read : Sai Dharam Tej Accident: బైక్ రైడింగ్ వద్దని ఎన్నో సార్లు చెప్పా.... సీనియర్ నటుడు నరేష్
Also Read : Sai Dharam Tej Accident: అంతా విషాదంలో ఉంటే రాజకీయాలేంటి? నరేష్‌పై మండిపడుతున్న సినీ ప్రముఖులు..
Also Read : Sai Dharam Tej Medical Bulletin: తేజ్ ఇంకా అపస్మారక స్థితిలో ఉండటానికి కారణం ఇదేనా? వైద్యులు ఏమన్నారు?