Love Story Day1 Collections: చైతు కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ప్రీమియర్స్ తో భారీ వసూళ్లు..
నిన్న విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది.
కరోనా కాలంగా ప్రేక్షకులు థియేటర్లను వస్తారా..? ముఖ్యంగా ఓటీటీలకు అలవాటుపడ్డ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ ముఖం చూస్తారా..? ఇవి కాకుండా ఆంధ్రాలో టికెట్ రేట్ల పరిస్థితేంటి..? ఈ మొత్తం డిస్కషన్ కు ఫుల్ స్టాప్ పెట్టింది 'లవ్ స్టోరీ'. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సగం అనుమానాల్ని పటాపంచలు చేసిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో ఆశ్చర్యపరిచింది. నిన్న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది.
ఓవర్సీస్ లో అయితే ఈ ఏడాది ప్రీమియర్స్ తో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది 'లవ్ స్టోరీ'. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అటుఇటుగా రూ.6 కోట్ల 80 లక్షల వసూళ్లు సాధించింది. ఒక్క నైజాం నుంచే ఈ సినిమాకి మూడు కోట్లకు పైగా షేర్ రావడం విశేషం.
ఏరియాల వారీగా కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం..
నైజాం రూ.3.01 కోట్లు
సీడెడ్ రూ.కోటి
ఉత్తరాంధ్ర రూ.0.6 కోట్లు
గుంటూరు రూ.0.59 కోట్లు
ఈస్ట్ రూ.0.45 కోట్లు
వెస్ట్ రూ.0.55 కోట్లు
కృష్ణ రూ.0.32 కోట్లు
నెల్లూరు రూ.0. 26 కోట్లు
మొత్తం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.6.78 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ ను చేరుకుంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. సినిమా క్లైమాక్స్ విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. అది వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఈరోజు హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీల్లో ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది.