అన్వేషించండి

బాయ్‌కాట్ వల్ల నష్టపోయేది వాళ్లే, థియేటర్లో కాకపోతే ఓటీటీలో చూస్తారు: విజయ్ దేవరకొండ

బాలీవుడ్ బాయ్ కాట్ భయం లైగర్ కు బలంగా పట్టుకుంది. ఈ చిత్రానికి కరణ్ జోహార్ సహ నిర్మాత కావడంతో సినిమాను బహిష్కరించాలంటూ క్యాంపెయిన్ ఊపందుకుంది. విజయ్ మాత్రం బాయ్ కాట్ ను పట్టించుకునేది లేదంటున్నాడు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా విడుదల కాబోతుంది. ఈ నెల 25న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారు.

తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో లైగర్ సినిమాకు బాయ్ కాట్ భయం పట్టుకుంది.  బాలీవుడ్ లో బలంగా కొనసాగుతున్న ఈ ట్రెండ్ ‘లైగర్’ మీద కూడా పడుతుందేమోనని.. చిత్ర యూనిట్ టెన్షన్ పడుతోంది. అటు విజయ్ మాత్రం అస్సలు పట్టిచుకునేది లేదంటున్నాడు. థియేటర్లలో కాకుండా ఓటీటీలో చూస్తారంటున్నాడు.   

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో ‘బాయ్‌కాట్’ ట్రెండ్ మొదలయ్యింది. బాలీవుడ్ హీరోలు ఎవరూ సుశాంత్ మరణం పట్ల సంతాపం ప్రకటించలేదని నెటిజన్లు మండిపడ్డారు. కరణ్ జోహార్ లాంటి దర్శక నిర్మాతల వైఖరి మూలంగానే ఆయన చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

అప్పటి నుంచి సినిమా నిర్మాతలకు బాయ్ కాట్ భయం బలంగా పట్టుకుంది. తాజాగా విడుదలైన బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’.. బాయ్ కాట్ దెబ్బకు అల్లాడింది. సినిమా ఆడక వందల స్క్రీన్లలో ఆటలను నిలిపివేశారు. అమీర్ ఖాన్ పీకే సినిమాలో హిందూ మతం పట్ల అభ్యంతరకర సీన్లు చూపించడంతో పాటు దేశంలో తనకు రక్షణ లేదని వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతూ ఆయన సినిమాను బాయ్ కాట్ చేస్తున్నట్లు నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  

అటు అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘రక్షాబంధన్’ మీద కూడా బాయ్ కాట్ ప్రభావం పడింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయ్యాయి. సుశాంత్ సింగ్ మరణానికి కారణమంటూ కరణ్ జోహార్ మీద దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. తాజాగా ఆయన సహ నిర్మాణంలో రూపొందించిన ‘లైగర్’ సినిమాను సైతం బాయ్ కాట్ చేయాలని నెట్టింట్లో ప్రచారం మొదలు పెట్టారు.

‘లాల్ సింగ్ చడ్డా’ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాను బాయ్ కాట్ చేయడం వల్ల కేవలం ఆమీర్ ఖాన్ మాత్రమే కాదు, ఆ సినిమాకు పనిచేసిన వేలాది మంది సిబ్బంది కూడా నష్టపోతారని విజయ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు బాయ్‌కాట్ ట్రెండ్‌కు ఆజ్యం పోసినట్లయ్యింది. ఆమీర్ ఖాన్‌కు మద్దతు తెలపడంపై పలువురు విజయ్ దేవరకొండపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బాలీవుడ్ లో మొదలైన ఈ ప్రచారం ‘లైగర్’ సినిమా యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు.. కరణ్ జోహార్ బాగా ప్రమోట్ చేసే హీరోయిన్ అనన్య పాండే సైతం ఇందులో హీరోయిన్ గా నటించడంతో ఇంకా నెటిజన్లు ఈ బాయ్ కాట్ క్యాంపెయిన్ ను బలంగా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఆడుతుందోనని నిర్మాతల్లో టెన్షన్ మొదలయ్యింది. 

అటు ‘లైగర్’ను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మీద హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. బాయ్ కాట్ చేస్తున్న వాళ్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ‘‘బాయ్ కాట్ చేస్తే చేయనివ్వండి వాళ్లను ఎవరూ పట్టించుకోరు. థియేటర్లకు వచ్చేవాళ్లు వస్తారు.. లేదంటే ఓటీటీలో చూస్తారు’’ అని చెప్పారు. ఇప్పుడు ఆయన మాటలు మరో దుమారం రేపుతున్నాయి. అయితే, మరో వైపు విజయ్‌కు నెటిజన్స్ నుంచి సపోర్ట్ మొదలైంది. లైగర్ బాయ్‌కాట్‌కు వ్యతిరేకంగా #ISupportLIGER హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. 

Also Read : తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది, సినిమా ఎలా ఉందంటే?

Also Read : హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget