News
News
X

Naatu Naatu Song: ‘నాటు నాటు’ వెనుక ఎన్ని పాట్లో - 19 నెలల శ్రమ ఆ పాట, 110 రకాల స్టెప్పుల్లో ఆ ఒక్కటే ప్రత్యేకం!

‘RRR’ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ విజేతగా నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో కీరవాణి, చంద్రబోస్ బంగారు ఆస్కార్ లను అందుకున్నారు. ఈ పాట గురించి 5 ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం..

FOLLOW US: 
Share:

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తీయడం ఒక ఎత్తైతే.. అత్యధిక అభిమానులు కలిగిన ఇద్దరు హీరోలతో డ్యాన్స్ చేయించడం మరో ఎత్తు. ఎందుకంటే.. అప్పడికే ఆ ఇద్దరు హీరోలు డ్యాన్సులు ఇరగదీస్తారని ప్రేక్షకులకు తెలుసు. అయితే, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే.. ప్రేక్షకులు తప్పకుండా కంపేరిజన్ చేస్తారు. అలా చేయకూడదంటే.. తప్పకుండా జనాలను మాయ చేయాలి. పాటలో లీనమయ్యేలా చేయాలి. ఫ్యాన్స్‌ను హర్ట్ చేయకుండా డ్యాన్స్ ఉండేలా చూడాలి. ఆ విషయంలో రాజమౌళి విజయం సాధించారనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ పాట ఔట్ పుట్ కోసం ఆయన ఎంత శ్రమించారనేది ఆ చిత్రయూనిట్‌కే తెలుసు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ను ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారనేది ఆ పాట విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరికీ అర్థమైపోయింది. అయితే, అదిరిపోయే స్టెప్పులు వేయించే ఆ ట్యూన్ కోసం కీరవాణి పడిన శ్రమ.. దానికి తగిన లిరిక్స్ రాసేందుకు చంద్రబోస్ పడిన తపన.. అంతా ఇంతకాదు. చెప్పాలంటే.. టీమ్ వర్క్‌కు నిదర్శనమే ఈ ‘‘నాటు నాటు’’. 

తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడింది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు ‘RRR’లోని ‘‘నాటు నాటు’’ పాటకు సలాం చేసింది. లేడీ గాగా,  రిహన్నలాంటి హాలీవుడ్ సింగర్స్ ను వెనక్కి నెట్టి ‘‘నాటు నాటు’’ ఆస్కార్ ను అందుకుంది.  ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ స్టాట్యూట్‌ దక్కించుకుంది. సంగీత స్వరకర్త MM కీరవాణి, రచయిత చంద్రబోస్ ఈ అవార్డును స్వీకరించారు. దర్శకుడు రాజమౌళితో పాటు Jr NTR, రామ్ చరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ సహా పలువురు ఈ వేడుకలో పాల్గొన్నారు.   

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ ను గెలుచుకోవడంతో పాటు, నాటు నాటు గాయకులు - రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ,  కీరవాణితో కలిసి 95వ అకాడమీ అవార్డ్స్‌ లో ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా వేడుకలో పాల్గొన్న సినీ దిగ్గజాలు లేచి నిలబడి అభినందించారు. ఈ ఆస్కార్ విన్నింగ్ పాటకు సంబంధించి 5 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఉక్రెయిన్ లో ’నాటు నాటు’  పాటు చిత్రీకరణ  

‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికారిక నివాసం అయిన మరియిన్స్కీ ప్యాలెస్ లాన్ లో చిత్రీకరించారు. 1920 కాలాన్ని రీక్రియేట్ చేయడం కోసం అక్కడ ఈ పాటను షూట్ చేశారు. ఈ పాటను సుమారు 12 రోజుల పాటు కష్టపడి చిత్రీకరించినట్లు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ టెలివిజన్ యాక్టర్ అయినందునే తమ షూటింగ్ కు అనుమతిచ్చారని దర్శకుడు రాజమౌళి చెప్పారు. ఈ భవనం ఆదేశ పార్లమెంట్ కు పక్కనే ఉన్నట్లు తెలిపారు.  

2. పాట రాయడానికి 19 నెలల సమయం తీసుకున్న చంద్రబోస్  

ఇక ‘నాటు నాటు’ పాటను రాయడానికి రచయిత చంద్ర బోస్ ఏకంగా 19 నెలల సమయం తీసుకున్నారట. వాస్తవానికి ఈ పాటకు సంబంధించి సగం రోజుల్లో 90 శాతం రాసినట్లు చెప్పారు చంద్రబోస్. అది దర్శకుడికి బాగా నచ్చిందన్నారు.  మిగిలిన 10 శాతం పూర్తి చేయడానికి 7 నెలలకు పైగా సమయం పట్టిందన్నారు.  

3. పాట చిత్రీకరణకు పట్టిన సమయం 20 రోజులు

‘నాటు నాటు’ పాటను చిత్రీకరించడానికి  ఏకంగా 20 రోజుల సమయం పట్టినట్లు వెల్లడించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్  స్టెప్స్ ఫర్ఫెక్టుగా వచ్చేందుకు రెండు నెలల పాటు రిహార్సల్స్ చేశారట.  ‘మగధీర’, ‘బాహుబలి’ సహా పలు సినిమాలలో ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేసిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.  

4. ’నాటు నాటు’ పాటకు 110కి పైగా స్టెప్స్ కంపోజ్  

‘నాటు నాటు’ పాట కోసం కొరియోగ్రాఫర్  ప్రేమ్ రక్షిత్ ఏకంగా 110కి పైగా స్టెప్స్ కంపోజ్ చేశారట. ఒక్కో స్టెప్ షూట్ కోసం 20 కంటే ఎక్కువ టేక్ లు చేసినట్లు ప్రేమ్ తెలిపారు. అయినా ఒక్కోసారి దర్శకుడికి నచ్చేది కాదన్నారు. అతడికి నచ్చే వరకు టేకులు చేస్తూనే ఉన్నట్లు వెల్లడించారు. చివరికి ఎన్టీఆర్, చరణ్ కలిసి వేసే ‘‘నాటు నాటు’’ స్టెప్పే ప్రత్యేకంగా నిలిచింది. రాజమౌళికి కూడా అదే ఫెవరెట్ స్టెప్. 

5. గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న మొదటి భారతీయ పాట

‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న మొదటి భారతీయ పాటగా రికార్డు సాధించింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాట జనవరి 11, 2023న ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.

Read Also: ఒక ఎన్టీఆర్, ఒక చిరు, ఒక రాజమౌళి - టాలీవుడ్‌కు నడక నేర్పారు, ఉనికి చాటారు, ఎల్లలు దాటించారు!

Published at : 14 Mar 2023 02:32 PM (IST) Tags: RRR Movie Charan Naatu Naatu Song Naatu Naatu song facts Jr NTR Ram

సంబంధిత కథనాలు

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?