అన్వేషించండి

ఒక ఎన్టీఆర్, ఒక చిరు, ఒక రాజమౌళి - టాలీవుడ్‌కు నడక నేర్పారు, ఉనికి చాటారు, ఎల్లలు దాటించారు!

టాలీవుడ్ గురించి ఈ రోజు ప్రపంచం మాట్లాడుకుంటోంది అంటే ఎంతోమంది సినీ ప్రముఖుల శ్రమ ఉంది. నాడు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సినీ దిగ్గజాలు పునాది వేస్తే దాన్ని చిరు నిలబెట్టారు. రాజమౌళి ఎల్లలు దాటించారు.

తెలుగు సినిమా.. ఒక్కసారిగా గర్వంతో తలెత్తుకొంది. జక్కన్న గా ముద్దు పేరుతో టాలీవుడ్ పిలుచుకునే రాజమౌళి ప్రపంచ సినిమాపై రాజముద్ర వేసేశారు. ఇప్పుడు ఆ పేరే ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఆయనతో పాటే తెలుగు సినిమా కూడా..! ఇకపై ప్రపంచ సినిమా టాలీవుడ్ వైపు చూస్తుంది అనడం లో ఎలాంటి అనుమానం లేదు. ఆస్కార్ వచ్చింది ఒక పాటకే కావొచ్చు. కానీ దాని వెనుకున్న విజన్ మాత్రం 100 శాతం జక్కన్న దే. అయితే తెలుగు సినిమా అసలు ఈ స్థాయికి చేరడం వెనుక మూడు కీలక దశల్లో ముగ్గురు కీలక వ్యక్తుల చరిష్మా, విజన్ అని చెప్పవచ్చు.

టాలీవుడ్ ఉనికి చాటిన NTR

ఎప్పుడో 1921లో (అప్పటికే సినిమా మేకింగ్ పై ఉన్న అనుభవంతో) రఘుపతి వెంకయ్య తన కుమారుడు సూర్య ప్రకాష్ నాయుడుతో కలిసి నిర్మించిన తొలి తెలుగు మూవీ (మూకీ ) భీష్మ ప్రతిజ్ఞను రూపొందిస్తే.. 1931లో తొలి తెలుగు టాకీగా HM రెడ్డి నిర్మించిన భక్త ప్రహ్లాద ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి కమర్షియల్  సక్సెస్ మాత్రం తెలుగు సినిమాకు 1934లో సి.పుల్లయ్య తీసిన ‘లవకుశ’(NTRది కాదు)తో లభించింది. ఆ తరువాత తెలుగులో మంచి సినిమాలు రూపొందినా.. ఒకానొక దశలో తమిళ సినిమా డామినేషన్ ఎక్కువగా ఉండేది. ఆ సమయంలోనే.. అంటే 1948లో NTR టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే తెలుగులో ప్రముఖ జోనర్ గా ఉన్న జానపదాలు.. పౌరాణికాలు NTR రాకతో మరింత ఊపందుకున్నాయి. ఆయన స్పుర ద్రూపం.. వాయిస్.. ఆహార్యం.. ఇవన్నీ ప్రేక్షకులను తెలుగు సినిమాను ఓన్ చేసుకునేలా చెయ్యడంతో పాటు.. ఆ రెండు జోనర్స్ తీయాలంటే తెలుగు వారికే సాధ్యం అనేలా NTR ముద్ర వేశారు. సౌత్ సినిమా అంటే తమిళ సినిమా మాత్రమే అనే ఫీలింగ్ ను చేరిపేసింది NTR నటించిన సినిమాలే అంటే అతిశయోక్తి లేదు. ఆయన లాంటి హీరో చేతిలో ఉండడంతో KV రెడ్డి.. BN రెడ్డి.. కమలాకర కామేశ్వర రావు, విఠలాచార్య లాంటి దర్శకులు తమ దైన కథలతో చెలరేగిపోయారు. ఆ విధంగా భారతీయ సినిమాపై తెలుగు సినిమా ఉనికిని ఘనంగా చాటారు NTR.

తెలుగు సినిమా మార్కెట్ పెంచిన మెగాస్టార్

‘బిగ్గర్ దేన్ బచ్చన్’ - అమితాబ్ బచ్చన్ బాలీవుడ్‌లో రారాజుగా వెలుగుతున్న సమయంలో ‘The week’ మ్యాగజైన్‌లో చిరంజీవిపై వచ్చిన ఈ కథనం ఒక్కసారిగా బాలీవుడ్ ని ఉలిక్కిపడేలా చేసింది. 1993లో ఈ స్టోరీ పబ్లిష్ అవ్వడానికి ‘ఘరానా మొగుడు’ తర్వాత మారిన చిరు ఇమేజే కారణం. అంతకుముందు సంవత్సరం 1992లో విడుదలైన ‘ఘరానా మొగుడు’ సౌత్ ఇండియాలో మొట్టమొదటి సారిగా రూ.10 కోట్లు వసూలు చేసింది.1993లో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో మెయిన్ స్ట్రీమ్ విభాగం లో ఆ సినిమాను ప్రదర్శించారు కూడా. దానితో చిరు రెమ్యునరేషన్ కూడా కోటిన్నర కు చేరింది. అప్పట్లో రూ.20 లక్షలు ఉంటే మీడియం బడ్జెట్ సినిమాలు తీసేయొచ్చు. అలాంటి సమయంలో చిరంజీవి సినిమాలు వరుస బ్లాక్ బస్టర్‌లు సాధిస్తున్న సమయం. దానితో ఇతర నిర్మాతలు కూడా తమ సినిమాల బడ్జెట్‌లు పెంచేవారు. దానికి తగ్గట్టే తెలుగు సినిమాల మార్కెట్ కూడా భారీగా పెరిగింది. కేవలం ఉమ్మడి ఆంధ్రా అనే కాక.. తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, ముంబై లాంటి చోట్ల కూడా తెలుగు సినిమాలు విడుదల కావడం మొదలయింది. ఓ వైపు యాక్షన్ స్టార్ లుగా అమితాబ్, రాజేష్ ఖన్నా, జితేంద్రల శకం ముగుస్తున్న సమయం.. మరోవైపు ఖాన్ ల హవా ఇంకా పీక్ కు చేరుకోనే సందర్భం కావడంతో టాలీవుడ్ మార్కెట్ బాగా పెరిగింది. అప్పటి హిందీ మాస్ ప్రేక్షకులు కూడా తెలుగు హీరోలు.. సినిమాల వైపు ఆశక్తిగా చూసేవారు. ఆ ప్రభావాన్ని చూసే చిరంజీవితో ఏకంగా బాలీవుడ్ లో సినిమాలు తీసేవారు. అలా వచ్చినవే ‘ప్రతిబంధ్’, ‘ఆజ్ కా గుండా రాజ్’, ‘ది జెంటిల్ మేన్’. అదే సమయంలో నాగార్జున, వెంకటేష్ లాంటి తెలుగు స్టార్స్ కూడా హిందీలో నటించేవారు. ఇదంతా ఒక్కసారిగా తెలుగు సినిమాల మార్కెట్ పెరగడంతో వచ్చిన మార్పు. అయితే ఆ మార్పుకు కారణం చిరంజీవి సినిమాలు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ రోజుల్లో చిరంజీవి ఇమేజ్ రోజురోజుకీ పెరుగుతూ ఉండేది అంటారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ లాంటి వారు.

ప్రపంచ సినిమాపై జెండా పాతిన రాజమౌళి

చిరంజీవి లాంటి స్టార్ తీసుకున్న విరామం... ఖాన్‌ల హవా... వీటన్నింటి మధ్యా తెలుగు సినిమా కొన్నేళ్ల జాతీయ స్థాయిలో ఎఫెక్ట్ చూపించ లేదన్న మాట వాస్తవం. ఆ సమయంలో ‘బాహుబలి’తో ప్రభంజనం సృష్టించాడు రాజమౌళి. నిజానికి అంతకు ముందే ఈగ సినిమాతో టెక్నాలజీ పై తనకున్న పట్టు నిరూపించుకున్న రాజమౌళి తన ఊహల్లోని కథకు సాంకేతిక జోడిస్తూ ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అన్ని వుడ్ లనూ తన దర్శకత్వ ప్రతిభతో కమ్మ్మేశాడు. రోజుకో రకంగా మారే ట్రెండ్ ను ఐదేళ్ల ముందే ఊహిస్తూ.. దానికి తగ్గట్టు ఇప్పటి నుంచే సినిమాను చెక్కడం అంటే మాటలు కాదు. కేవలం దర్శకత్వమే కాకుండా.. సినిమాను మార్కెట్ చెయ్యడంలో కూడా ఆరితేరాడు మన జక్కన్న. దానితో ఇప్పుడు ఆయన పేరే ఒక బ్రాండ్ గా మారిపోయింది. ప్రస్తుతం తన సినిమాలో పాటకు ఆస్కార్ వచ్చినా.. క్రెడిట్ మాత్రం రాజమౌళికే ఇస్తున్నారు అంటే అందులో ఎలాంటి పొరబాటు కనిపించడం లేదు. దీనితో కేవలం రాజమౌళి మాత్రమే కాదు.. తెలుగు సినిమా అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఒక క్రొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది. OTT ల కాలంలో ఇది కొత్త తెలుగు దర్శకులకు మంచి అవకాశాలు తెచ్చే పరిణామమే కాకుండా.. ఇతర తెలుగు బడా దర్శకులకు కూడా తమ సినిమాలకు సంబంధించి మార్కెట్ విస్తరణకు మరిన్ని అవకాశాలు కల్పించినట్టే. అందుకే రాజమౌళి సినిమాలో పాటకు లభించిన ఆస్కార్ అవార్డ్ ను మొత్తం తెలుగు ఇండస్ట్రీ పండుగలా భావిస్తోంది. 

Also Read బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
SearchGPT: గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
High Tension in Kappatralla: నిన్న దామగుండం, నేడు కప్పట్రాళ్ల - యురేనియం తవ్వకాలు వద్దంటూ గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్తత
నిన్న దామగుండం, నేడు కప్పట్రాళ్ల - యురేనియం తవ్వకాలు వద్దంటూ గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్తత
Embed widget