Lavanya theft case against Raj Tarun : బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
Actor Raj Tarun : రాజ్ తరుణ్ మీద లావణ్య దొంగతనం కేసు పెట్టింది. పుస్తెల తాడు కూడా తీసుకెళ్లిపోయాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చింది.
Lavanya files a Gold theft case against Raj Tarun : సినీ నటులు లావణ్, రాజ్ తరుణ్ మధ్య ఏర్పడిన వివాదం అంతకంతకూ పెరుగుతోంది. ఇద్దరూ రాజీపడటం లేదు. తాజాగా రాజ్ తరుణ్‌పై లావణ్య మరో కేసు పెట్టింది. తన ఇంట్లో బీరువాలో ఉన్న తన పుస్తెల తాడు.. ఇతర బంగారాన్నిరాజ్ తరుణ్ దొంగతనం చేశాడని ఆ ఫిర్యాదు సారాంశం. తాను కొన్న బంగారం రసీదులను కూడా లావణ్య పోలీసులకు సమర్పించారు.
రాజ్ తరుణ్, లావణ్య పదేళ్ల పాటు సహజీవనం చేశారు. మధ్యలో వివాదాలు రావడంతో రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడని.. తనను మోసం చేశాడని లావాణ్య ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు ఇటీవలే కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇద్దరూ కలిసి ఉన్నది నిజమేనని చార్జిషీటులో పేర్కొన్నారు. రాజ్ తరుణ్ ను నిందితుడిగా పేర్కొన్నారు. ఈ కేసులో రాజ్ తరుణ్ ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
కేన్సర్ మందుల నుంచి చిరుతిళ్ల వరకు రేట్లు భారీగా తగ్గుతున్నాయ్! ఎందుకంటే?
రాజ్ తరణ్ సినిమా లు ఇటీవల వరసగా రిలీజ్ అవుతున్నాయి. త్వరలో మరో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రాజ్ తరుణ్ ఈ వివాదం కారణంగా సినీ ప్రమోషన్లలో కూడా పాల్గొనలేకపోతున్నారు. ఆయన హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో కలిసి ముంబైలోనే సహజీవనం చేస్తున్నారని లావణ్య ఆరోపిస్తోంది. మూడు రోజుల కిందట రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా నివాసం ఉంటున్న ముంబైలోని ఫ్లాట్ కు వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్ననని మీడియాకు వీడియోలు విడుదల చేశారు. తర్వాత ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత వివాదం కావడంతో.. అంతర్గతంగా పరిష్కరించుకోవాలని ముంబై పోలీసులు సలహా ఇచ్చి పంపేశారు.
అదే సమయంలో లావణ్య తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిందని .. ఆమెపై మాల్వీ మల్హోత్రా కుటుంబీకులు కూడా ఫిర్యాదు చేశారు. దాడికి ప్రయత్నించిందని ఆరోపించారు. ఆమె హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో కూడా ఉన్నారని ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు కానీ.. లావణ్య మాత్రం హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. తాము నివాసం ఉన్న ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం కోసం చూస్తే లేకపోవడతో కేసు పెట్టినట్లుగా చెబుతున్నారు.
లావణ్యతో కలిసి ఉన్నది నిజమే అయినా విడిపోయామని రాజ్ తరుణ్ చెబుతున్నారు. తనకు అసలు ఎవర్నీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదంటున్నారు. లావణ్య కేవలం డబ్బుల కోసమే బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన అంటున్నారు. వీరి ఎపిసోడ్ మరికొన్ని రోజులు సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.