News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

రామ్ నటిస్తోన్న 'ది వారియర్' సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది చిత్రబృందం.

FOLLOW US: 
Share:

యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది వారియర్'. లింగు స్వామి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'బుల్లెట్' అనే సాంగ్ ను విడుదల చేశారు. శింబు పాడిన ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అయింది. 

ఇక రీసెంట్ గా విడుదలైన చేసిన టీజర్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. త్వరలోనే సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది చిత్రబృందం. ఈరోజుతో షూటింగ్ కి పూర్తయిందని తెలిపారు. 

ఈ సందర్భంగా నిర్మాతగా మాట్లాడుతూ.. ''ఆల్రెడీ విడుదలైన టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో ఉందని చెబుతున్నారంతా. టీజర్‌లో డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా హై స్టాండ‌ర్డ్స్‌లో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ రోజుతో సినిమా చిత్రీకరణ పూర్తయింది. గత వారం రోజులుగా మా హీరో రామ్‌పై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించాం. దీంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు ప్రారంభించాం. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తామని'' తెలిపారు. 

Also Read: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్

Also Read: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్

View this post on Instagram
 
A post shared by Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)

Published at : 28 May 2022 05:45 PM (IST) Tags: Ram Pothineni The Warriorr Movie Ram Pothineni movie The Warriorr Movie update The Warriorr shooting

ఇవి కూడా చూడండి

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Naga Panchami December 7th Episode మోక్షతో పంచమి చివరి మాటలు.. మృత్యుంజయ యాగం జరిపించనున్న సప్తరుషులు!

Naga Panchami December 7th Episode మోక్షతో పంచమి చివరి మాటలు.. మృత్యుంజయ యాగం జరిపించనున్న సప్తరుషులు!

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

Jagadhatri December 7th Episode: సక్సెస్ ఫుల్ గా ప్లాన్ అమలు చేసిన ధాత్రి.. తెలివిగా బూచిని ఇరికించేసిన కేదార్, ధాత్రి!

Jagadhatri December 7th Episode: సక్సెస్ ఫుల్ గా ప్లాన్ అమలు చేసిన ధాత్రి.. తెలివిగా బూచిని ఇరికించేసిన కేదార్, ధాత్రి!

‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!