News
News
X

Pushpa 2: 'పుష్ప2' మూవీ అప్డేట్ - ఫొటో షేర్ చేసిన టీమ్!

'పుష్ప2' చిత్రబృందం ఒక అప్డేట్ ఇచ్చింది. 'పుష్ప2'కి సంబంధించిన పనులు ఫుల్ ఫ్లోతో జరుగుతున్నాయని.. ఒక ఫొటోని షేర్ చేసింది.   

FOLLOW US: 
 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన 'పుష్ప ది రైజ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లలో, కిక్ బాక్సింగ్ లో 'తగ్గేదేలే' అంటూ రచ్చ చేశారు సెలబ్రిటీలు. 'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' రాబోతుంది.

అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. తాజాగా చిత్రబృందం ఒక అప్డేట్ ఇచ్చింది. 'పుష్ప2'కి సంబంధించిన పనులు ఫుల్ ఫ్లోతో జరుగుతున్నాయని.. ఒక ఫొటోని షేర్ చేసింది. ఇందులో దర్శకుడు సుకుమార్, ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్, పోస్టర్ డిజైనర్ జాన్ కనిపిస్తున్నారు. వీరంతా బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్మాణ సంస్థ రాసుకొచ్చింది. 

'పుష్ప2'లో పులి ఫైట్:

అల్లు స్టూడియోస్ లో తొలి సినిమా షూటింగ్ గా 'పుష్ప2' మొదలుకాబోతుంది. ఆ తరువాత సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. చిత్రయూనిట్ లో ఒక గ్రూప్ థాయిలాండ్ వెళ్లి అక్కడ ఫారెస్ట్ లో పులితో ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారని సమాచారం. పులి సీన్ అనగానే 'ఆర్ఆర్ఆర్' సినిమాలో సన్నివేశం గుర్తుకురాకమానదు. ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు 'పుష్ప2'లో కూడా బన్నీతో ఈ పులి ఫైట్ పెడుతున్నట్లు టాక్. చిత్రబృందం కొన్ని రోజులు థాయిలాండ్ లో షూటింగ్ చేసి మళ్లీ ఇండియాకు వచ్చి.. దానికి గ్రాఫిక్స్ జోడించి.. బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావాలనుకుంటున్నారు. 

బన్నీకి విలన్ గా పవర్‌ఫుల్‌ పొలిటీషియన్:
మొదటి పార్ట్ లో బన్నీకి సపోర్ట్ గా ఉండే ఎంపీ రోల్ లో రావు రమేష్ కనిపించారు. ఎర్ర‌చంద‌నం సిండికేట్ మొత్తాన్ని పుష్ప చేతిలో పెట్టి వెనుక ఉంటూ కథ నడిపిస్తారు. ఇప్పుడు పార్ట్ 2లో పుష్పను ఇబ్బంది పెట్టే ఓ పొలిటీషియన్ రోల్ ఉంటుందట. ఫహద్ ఫాజిల్ తో కలిసి సదరు పొలిటీషియన్ బన్నీతో ఫైట్ కి దిగుతాడట. ఆ పాత్రలో పేరున్న నటుడిని తీసుకోవాలనుకుంటున్నారు. దీనికోసం ఆదిపినిశెట్టి లాంటి స్టార్స్ ను పరిశీలిస్తున్నారు. గతంలో బన్నీ నటించిన 'సరైనోడు' సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

2023లో 'పుష్ప' రిలీజ్:
2023లో 'పుష్ప' పార్ట్ 2ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం దొరకలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ సీజీ వర్క్ పై పడింది. సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి కామెంట్స్ కి తావివ్వకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. గ్రాఫిక్స్ అండ్ మిగిలిన వర్క్ పై ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నారు.

Read Also: పెళ్లికూతురుగా కీర్తి సురేష్‌ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!

Published at : 17 Oct 2022 05:21 PM (IST) Tags: Allu Arjun Sukumar Mytri Movie Makers Pushpa 2 Pushpa 2 update

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Tamannaah Interview : 'గుర్తుందా శీతాకాలం' ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా

Tamannaah Interview : 'గుర్తుందా శీతాకాలం' ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Telugu Movies Remake 2022 : తెలుగులో ఈ ఏడాది రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?

Telugu Movies Remake 2022 : తెలుగులో ఈ ఏడాది రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?

టాప్ స్టోరీస్

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

KTR Vs Bandi Sanjay : కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !

KTR Vs Bandi Sanjay :  కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !