Hari Hara Veeramallu: పవన్ కోసం రంగంలోకి దిగిన లెజెండ్, ఫొటో వైరల్
ఇటీవలే 'హరిహర వీరమల్లు' సినిమా ప్రిపరేషన్ లో భాగంగా క్రిష్ అండ్ టీమ్ పవన్ కళ్యాణ్ ను కలిశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'హరిహర వీరమల్లు' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 2021 ఆరంభంలో సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా గతేడాది ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. తొలిసారి పవన్ కళ్యాణ్ చారిత్రక నేపథ్యమున్న సినిమాలో నటిస్తున్నారు.
ఇటీవలే 'హరిహర వీరమల్లు' సినిమా ప్రిపరేషన్ లో భాగంగా క్రిష్ అండ్ టీమ్ పవన్ కళ్యాణ్ ను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఈ సినిమా సెట్స్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. లెజండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఈ సినిమాకి పని చేస్తుండడం విశేషం. ఒకప్పుడు ఇండియాలోనే టాప్ ప్రొడక్షన్ డిజైనర్లలో ఆయన ఒకరు. 'అర్జున్' సినిమా కోసం మధుర మీనాక్షి ఆలయాన్ని పున:ప్రతిష్ఠ చేశారాయన.
అయితే గత కొన్నేళ్లలో సాబు సిరిల్, రవీందర్ లాంటి ప్రొడక్షన్ డిజైనర్ల హవా బాగా పెరిగింది.తోట తరణికి వయసు మీద పడడంతో ఆయన పెద్దగా సినిమాలు చేయడం లేదు. అయితే క్రిష్ కావాలని పవన్ కళ్యాణ్ కోసం ఆయన్ను తీసుకొచ్చారు. ఆయన నేతృత్వంలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. కొత్త షెడ్యూల్లో కీలక సన్నివేశాలను ఈ సెట్స్ లోనే చిత్రీకరించనున్నారు. పవన్ కళ్యాణ్.. తోట తరణిని కలిసి మాట్లాడుతున్న ఫొటోను నిర్మాణ సంస్థ ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం.. ఆమె రాకుమారి పాత్రలో కనిపించనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాదే సినిమాను పూర్తి చేసి 2023 సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
Also Read: అమెజాన్ ప్రైమ్ లో 'రాధేశ్యామ్', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
View this post on Instagram