BiggBoss 5 Promo: శ్రీరామ్ ముఖంపై నీళ్లు కొట్టిన కాజల్... రవి-కాజల్ మధ్య మళ్లీ లొల్లి, గొంతుచించుకున్న జెస్సీ
మిగతా సీజన్లతో పోలిస్తే మొదటి ఎపిసోడ్ నుంచే జోరుమీద సాగుతోంది బిగ్ బాస్ 5. నేటి ప్రోమో మరింత ఆసక్తికరంగా ఉంది.
ఇంట్లో చాలా వాడీ వేడిగా ఉంది వాతావరణం. ఎవరితో, ఎవరికీ ఎప్పుడు గొడవ మొదలవుతుందో తెలియని పరిస్థితి. అందులోనూ ఈ వీక్ వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారిని జైలుకు పంపే టాస్క్ నడుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇంట్లోని సభ్యులంతా తాము ఎవరినీ దోషిగా అనుకుంటున్నారో చెప్పమని అడిగారు బిగ్ బాస్. వారిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని జైలుకు పంపిస్తారు. ప్రోమో చూస్తుంటే వాదనలు వాడివేడిగానే అయినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా మొన్నటి వరకు పిల్లాబచ్చాగా పేరు తెచ్చుకున్న జెస్సీ గొంతుచించుకుని మరీ శ్రీరామ్ మీద అరిచాడు. ‘నాకు కుకింగ్ రాదు, నన్ను కుకింగ్ కి రమ్మంటారేంటి?’ అంటూ శ్రీరామ్ తో వాదించాడు జెస్సీ. శ్రీరామ్ ఏదో చెప్పబోతే ‘ఆపండి’అంటూ గొంతుచించుకున్నాడు. జెస్సీ ఇలా అరవడం వెనుక షన్ను, సిరిలా ఇన్ ఫ్లూయెన్స్ ఉందని భావిస్తున్నారు ప్రేక్షకులు.
ఇక కాజల్ కు రవికి మధ్య మళ్లీ వాదన అయ్యింది. ‘ఎవరిమీద చెయ్యెత్తకు, నొప్పయితది, పద్ధతి తెలుసుకో’ అంటూ రవి అనగానే ‘నువ్వు నాకు పద్దతులు నేర్పక్కర్లేదు’ అంటూ వాదించింది కాజల్. దానికి రవి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ‘నీ పీరియడ్లు క్లాసులో పెట్టుకో ఈడ కాదు’ అంటూ రవి మధ్యలోనే కాజల్ ని మాట్లాడనివ్వకుండా చేశాడు. తరువాత కాజల్ శ్రీరామ్ తన దోషిగా చెప్పింది. టాస్కులో భాగంగా అతని ముఖం మీద గ్లాసు నీళ్లు కొట్టింది. ఇక యానీ మాస్టర్ కాజల్ ను దోషిగా తేల్చి ‘నేను మీకిది చేయలేను’ అంటూ ఆ గ్లాసు నీళ్లను తన ముఖం మీద కొట్టుకుంది. అలాగే శ్వేత కూడా కాజల్ నే దోషిగా తేల్చినట్టు ప్రోమోలో కనిపిస్తోంది. యానీ మాస్టర్, సన్నీ, తన మధ్య ఒక బాండింగ్ ఉందని, దాన్ని ఇన్ ఫ్లూయెన్స్ చేసేందుకు ప్రయత్నించవద్దని చెప్పింది. విశ్వను షన్నూ, సిరి ఇద్దరూ దోషిగా ఎంచుకున్నారు. రాజకుమారుడు టాస్కులో విశ్వ వ్యహహారశైలిని వారు తప్పు బట్టారు. సిరి, షన్ను, జెస్సీ ఒక గ్రూపుగా ఏర్పడినట్టు క్లియర్ గా అర్థమైపోతోంది. జైలుకు ఎవరు వెళతారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Who is the worst performer for this week?? Miru evarini nominate chestharu?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFire & #FiveMuchFun pic.twitter.com/a8NFfjfGWk
— starmaa (@StarMaa) October 8, 2021
Also read: రోజుకో నువ్వుల లడ్డూ తింటే ఎన్ని లాభాలో...
Also read: సోనూసూద్ కు మరో గుడి... ఈసారి ఏ గ్రామంలో కట్టారంటే?
Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్స్క్రైబ్ చేయండి