By: ABP Desam | Updated at : 23 Dec 2021 04:17 PM (IST)
Edited By: RamaLakshmibai
image credit : Lasya Manjunath /Instagram
అల్లు అర్జున్-సుకుమార్ పుష్ప సినిమాలో సమంత సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. విడుదలైనప్పటి నుంచి మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. సమంత తన కెరీర్‌లో తొలిసారి స్పెషల్ సాంగ్ చేయగా ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ సాంగ్‌కు చాలా మంది సెలబ్రిటీలు డ్యాన్స్ చేస్తూ ఇన్ స్టా లో వీడియోలు షేర్ చేస్తున్నారు. బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి ఈ సాంగ్‌కు దుమ్ములేపేలా డాన్స్ చేసి వీడియో షేర్ చేసింది. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ బ్యూటీ లాస్య కూడా తన ఇన్ స్టా అకౌంట్లో ఓ వీడియే షేర్ చేసింది. అయితే అషు రెడ్డి డాన్స్ చేసిన వీడియో షేర్ చేయగా..లాస్య మాత్రం చీపురుకట్ట పట్టుకుని భర్తకు వార్నింగ్ ఇస్తున్నట్టున్న వీడియో షేర్ చేసింది.
ఇల్లు ఊడ్చమని, గిన్నెలు కడమనే ఉద్దేశంతో... ఊ అంటావా మామా ఊఊ అంటావా అంటూ చీపురు పట్టుకుని క్యూట్ గా వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారు కొందరైతే... పాటని పాటగా చూడండనేవారు ఇంకొందరు. మరోవైపు అల్లు అర్జున్ సైతం ఇటీవల ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో ఈ వివాదంపై స్పందించాడు. ‘‘ప్రస్తుతం మనం సమాజంలో ఏదైతే చూస్తున్నామో అదే పాటలా రచించారు. అందులో ఉన్న లిరిక్స్ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి’’ అని తెలిపారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటించగా...సమంత స్పెషల్ సాంగ్ చేసింది.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్టర్ సంగతేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అనసూయ!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మరి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్స్టాప్?
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు
Weather Updates : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు