News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vijayashanthi-NTR: ఇంటికి వచ్చి మరీ క్షమాపణ చెప్పారు, ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే- విజయశాంతి

నందమూరి తారక రామారావు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని నటి విజయశాంతి తెలిపారు. ఎన్టీఆర్ కు చెల్లిగా నటించే అవకాశం రావడం తన అదృష్టమని వెల్లడించారు.

FOLLOW US: 
Share:

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావుపై ప్రముఖ నటి విజయశాంతి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన గొప్ప నటుడే కాదు, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. నటుడిగా, నాయకుడిగా ఆయన ప్రయాణం తిరుగులేనిదన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నటి విజయశాంతి.

ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం

“నేను 14 సంవత్సరాల వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో ‘సత్యంశివం’ సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కలిసి నటించే అవకాశం కలిగింది. సుమారు 1980లో వారితో కలిసి పని చేశాను. ఆ తర్వాత 1985లో నా ‘ప్రతిఘటన’ చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డును ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకున్నాను. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నన్ను అభినందించారు. ప్రజాప్రాయోజిత చిత్రాలతో మరింత ముందుకు సాగాలని ఆయన ఆశీర్వదించారు” అని చెప్పారు.

ఇంటికి వచ్చి మరీ క్షమాపణ చెప్పారు!

ఎన్టార్ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తూ ఓ సంఘటన గురించి వివరించారు విజయశాంతి. “1990లో ఏవీఎం స్టూడియోలో ఎన్టీఆర్ గారు ’బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడు, నేను చిరంజీవితో  అదే స్టూడియోలో సినిమా చేస్తున్నాను. వారిని డబ్బింగ్ థియేటర్‌లో కలవడానికి వెళ్లాను. డబ్బింగ్ థియేటర్ లో సరిగా వెలుతురు లేదు. నన్ను ఆయన గుర్తించలేకపోయారు. అయితే, విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకే  మద్రాసులో మా ఇంటికి వచ్చి, (నేను ఆ ఉదయం ప్లయిట్‌కి హైదరాబాదులో షూటింగ్‌కి వెళ్లాను) “అమ్మాయిని మేము చూసుకోలేదు. పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి” అని శ్రీనివాస్ ప్రసాద్ గారితో చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తు ఉంటుంది. అంతేకాదు, ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ "జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, I am extremely sorry ..." అని చెప్పినంత వరకూ.. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే” అని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే!

“ఎన్టీఆర్ గారు మద్రాస్ వచ్చిన సందర్భాలలో మధ్యాహ్నం 11 గంటల కల్లా లంచ్ మా ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారు పంపడం, ఎన్టీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించటం జరిగేది.  నేను వారిని కలవడానికి హైదరాబాదులో ఎంతో బిజీగా ఉన్న సమయంలో వెళ్లినా కూడా స్వయంగా టిఫిన్ తినిపించేవారు. ఆయన ఆతిథ్యానికి మారుపేరు. ఆదరాభిమానాలకు మరో రూపు.  ఎన్టీఆర్ గారు బహుశా ప్రపంచం తిరిగి ఎప్పటికీ చూడలేని అరుదైన ఒక కారణజన్ముడు, యుగపురుషుడు. 100 సంవత్సరాలైనా, మరో 100 సంవత్సరాలైనా, సినిమాకి ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే. సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే” అని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

Read Also:ఎన్టీఆర్‌కు సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ మూవీ పారితోషికం ఎంతో తెలుసా?

Published at : 28 May 2023 10:37 AM (IST) Tags: Vijayashanti NTR Birthday NTR Birth Anniversary Nandamuri Taraka Rama Rao

ఇవి కూడా చూడండి

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ

త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ

Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'