Kushi Re Release Collections : 'ఖుషి' కలెక్షన్స్ - రీ రిలీజుల్లో పవన్ కళ్యాణే టాప్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమాను డిసెంబర్ 31న రీ రిలీజ్ చేశారు. కలెక్షన్స్ విషయంలో ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకు ముందు, ఇప్పుడు... రీ రిలీజుల్లో పవన్ కల్యాణే టాప్.
'ఈ పాట వచ్చి పదేళ్ళు అయ్యింది. అయినా పవర్ తగ్గలేదు' అని 'గబ్బర్ సింగ్' సినిమాలో ఆలీ ఓ డైలాగ్ చెబుతారు. ఆయన చెప్పింది 'ఖుషి' సినిమా (Kushi Movie) లోని 'ఏ మేరా జహాన్... ఏ మేరా ఘర్ మేరా ఆషియా' గురించి! పదేళ్ళు కాదు, ఆల్మోస్ట్ 22 ఏళ్ళ తర్వాత కూడా పవర్ తగ్గలేదని పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశారు.
దుమ్ము లేపిన 'ఖుషి' రీ రిలీజ్ కలెక్షన్స్!
Kushi Re Release Collections Day 1 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలు అన్నిటిలో కంటే 'ఖుషి' వెరీ వెరీ స్పెషల్. కలెక్షన్స్ పరంగా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు కూడా ఏమాత్రం జోరు తగ్గలేదు. డిసెంబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా మూడున్నర కోట్ల రూపాయలకు పైగా సినిమా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రీ రిలీజ్ సినిమాల్లో ఇదే టాప్.
సెకండ్ ప్లేసూ పవన్ సినిమాదే!
ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఏదీ రూ. 3.5 కోట్లు కలెక్ట్ చేయలేదు. మూడు కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది. అదీ కూడా పవన్ కళ్యాణ్ మూవీయే. పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 1న 'జల్సా'ను రీ రిలీజ్ చేశారు. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.2 కోట్లు కలెక్ట్ చేసింది. 'ఖుషి' ఫస్ట్ డే కలెక్షన్లతో ఆ రికార్డ్ బీట్ చేసింది. మూడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'పోకిరి' ఉంది. ఆ సినిమా రీ రిలీజ్ చేయగా... రూ. 1.75 కోట్లు కలెక్ట్ చేసింది.
ఏపీలోని కొన్ని ఏరియాల్లో లా అండ్ ఆర్డర్ సమస్యల పేరుతో 'ఖుషి' రీ రిలీజ్ చేయడానికి అనుమతులు ఇవ్వలేదు. ఒకవేళ అనుమతులు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసేది.
Also Read : చేసుకుంటా, రాసి పెట్టిలేదు, క్లారిటీ లేదు - పెళ్ళిపై కన్‌ఫ్యూజ్ చేసిన ప్రభాస్
'ఖుషి' సినిమా వచ్చి 21 సంవత్సరాలు అయ్యింది. ఏప్రిల్ వస్తే... 22 ఏళ్ళు. కానీ, ఆ సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. పవన్ కళ్యాణ్ పవర్ ఏ మాత్రం తగ్గలేదు. శనివారం థియేటర్ల దగ్గర సందడి చూస్తే ఎవరైనా ఆ మాటే చెబుతారు. ఇప్పటికే కొన్ని వందల సార్లు యూట్యూబ్, టీవీల్లో ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ చూసి ఉంటారు. కానీ, థియేటర్లలో చూస్తే... ఆ యుఫోరియానే వేరు. మణిశర్మ పాటలు, ఆ మ్యూజిక్, వింటేజ్ పవన్ కల్యాణ్ లుక్స్, భూమిక యాక్టింగ్, అలీ కామెడీ... వాట్ నాట్ సిద్ధూ, సిద్ధార్థ రాయ్... సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే మజాయే వేరని ఫ్యాన్స్ చెబుతున్నారు.
దేవిలో సినిమా చూసిన అకిరా నందన్!
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా సినిమా చూశారు. అతడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి థియేటర్‌కు వెళ్ళాడు. అయితే... ఎటువంటి హంగామా లేకుండా ముఖానికి మాస్క్, ఒక హుడీ టీ షర్ట్ వేసుకుని వెళ్ళాడు. కొందరు అభిమానులు అకిరాను గుర్తు పట్టారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా 'ఖుషి' ఫీవర్ కనబడుతోంది. ఆ సినిమాతో తమకున్న నోస్టాల్జియాను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 'ఖుషి' కాలం నాటి టేప్ రికార్డర్స్, క్యాసెట్స్, పవన్ వాడిన గ్రీన్ హుడీస్ అన్నీ ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఎంతైనా పవర్ స్టార్ కదా ఆ రేంజ్ ఉంటుందిలే!
Also Read : పూనకాలు లోడింగ్ అంటే ఇదేనేమో!? - నరేష్, పవిత్ర పెళ్లిపై రెచ్చిపోయిన మీమర్లు, బాబోయ్ ఆ ట్రోల్స్ చూశారా?