Kriti Sanon : టాలెంట్ ఉన్నవారికి కూడా అవకాశం ఇవ్వండి, నెపోటిజంపై కృతిసనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నెపోటిజంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గతంతో పోల్చితే పరిస్థితి కాస్త మెరుగైనా, ఇంకా మారాల్సిన అవసరం ఉందని చెప్పింది.
Kriti Sanon on Nepotism: బాలీవుడ్ లో చాలా కాలంగా నెపోటిజం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంత మంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీలో నెపోటిజాన్ని పెంచి పోషిస్తున్నారని తరచుగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆలియా భట్, కరణ్ జోహార్ లాంటి వారి మీద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నెపోటిజం అంశంలో తీవ్ర విమర్శలు చేసింది. సమయం దొరికినప్పుడల్లా చేస్తూనే ఉంటుంది. ఇక బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నెపోటిజం మీద జోరుగా చర్చ నడిచింది. ఇదే చర్చ నెమ్మదిగా ‘బాయ్ కాట్ బాలీవుడ్‘ ఉద్యమానికి దారి తీసింది. ఈ మూమ్మెంట్ దెబ్బతో అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో అతలాకుతలం అయ్యారు. ‘లాల్ సింగ్ చద్దా‘ డిజాస్టర్ కావడంతో ఏకంగా సినిమాలకు కొంతకాలం పాటు విరామం ప్రకటించే పరిస్థితి నెలకొంది. తాజాగా ఇదే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి కృతి సనన్.
స్టార్ కిడ్స్ కే కాదు, టాలెంట్ ఉన్నవారికీ అవకాశం ఇవ్వండి- కృతి
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిది కృతి సనన్. చక్కటి నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తొలత మోడలింగ్ లో రాణించిన కృతి, నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి వచ్చింది. అయితే, ఈ జర్నీలో తాను ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన ఇబ్బందులతో పాటు ఇండస్ట్రీలో నెపోటిజం గురించి కీలక విషయాలు వెల్లడించింది. “బాలీవుడ్ లో ఇప్పటికీ నెపోటిజం ఉంది. టాప్ ఫిల్మ్ మేకర్స్ వారసులకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఎప్పుడూ బంధు ప్రీతితో వ్యవహరించడం మానుకుంటే బాగుటుంది. టాలెంట్ ఉన్నవారికి కూడా అవకాశాలు ఇస్తే మంచిది. తమ కుటుంబ సభ్యులకు ఇచ్చే ఇంపార్టెన్సీలో, టాలెంటెడ్ నటులకు కూడా కొంత ఇస్తే బాగుంటుంది. గతంతో పోల్చితే ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. పెద్ద స్టార్లు అని చూడకుండా టాలెంట్ ఉన్నవారికే ప్రేక్షకులు కూడా మద్దతు పలుకుతున్నారు” అని కృతి వెల్లడించింది.
గతంలోనూ నెపోటిజం గురించి మాట్లాడిన కృతి
గతంలోనూ బాలీవుడ్ లో నెపోటిజం గురించి కృతి సనన్ మాట్లాడింది. కెరీర్ ప్రారంభంలో తనకు వచ్చిన ఎన్నో అవకాశాలను ఆ తర్వాత స్టార్ కిడ్స్ కొల్లగొట్టుకుపోయారని చెప్పింది. కొన్ని సినిమాలలో తొలుత తనకు ఆఫర్ వచ్చినా, ఆ తర్వాత తన ప్లేస్ లో స్టార్ ఫిల్మ్ మేకర్స్ పిల్లలను తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టు విడవకుండా ప్రయత్నించడం మూలంగానే ఇప్పుడు హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పింది. ఇక కృతి సనన్ ఓవైపు హీరోయిన్ గా సత్తా చాటుతూనే, మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ఓటీటీ వేదికగా పలు సినిమాలను నిర్మిస్తున్నది. అటు పలు రకాల వ్యాపారాల్లోనూ రాణిస్తోంది.
Read Also: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మిల్కీ బ్యూటీ, బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే?