Rangamarthanda: 'రంగమార్తాండ' స్టేటస్ - ఆగస్టులో రిలీజ్ పక్కా?
ఎట్టకేలకు 'రంగమార్తాండ' సినిమాకి మోక్షం కలిగినట్లు తెలుస్తోంది.
మరాఠీ భాషలో తెరకెక్కించిన 'నటసామ్రాట్' సినిమా అక్కడ పెద్ద హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్న సినిమా అది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు కృష్ణవంశీ. నాలుగేళ్ల క్రితమే సినిమాను మొదలుపెట్టారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఇంకా ఓ పది శాతం షూటింగ్ ఉందనగా.. డబ్బు లేక సినిమా ఆగిపోయింది. నిర్మాత కూడా డబ్బు సర్దుబాటు చేయలేక ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టేశారు.
అయితే ఈ సినిమాకి ఓటీటీ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. బయట కూడా సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. దీంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాకి మోక్షం కలిగిందట. నిర్మాతకు డబ్బు సర్దుబాటు కావడంతో మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయమని చెప్పారట. దీంతో మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చినా.. ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకుడు కృష్ణవంశీ. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి తారలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర చాలా కొత్తగా ఉంటుందని.. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కానీ, టీజర్ కానీ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ ఈ రేంజ్ బజ్ రావడమంటే విశేషమనే చెప్పాలి. అందుకే క్రేజీ ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. మరి ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
View this post on Instagram