Krishna Mukunda Murari May 15th: ఇరువురి భామల నడుమ నలిగిపోతున్న మురారీ- ఉంగరం ఎక్కడదని అడిగిన రేవతి
కృష్ణకు మురారీ మీద ప్రేమ పుట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
గుడిలో మురారీ అభిషేకం చేస్తూ ఉండగా ముకుంద వేలికి ఉంగరం తొడిగేస్తుంది. అది ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా ఉండేందుకు దాస్తూ ఉంటాడు. పసుపు కొమ్ముని చెట్టుకు కడితే దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతోందని పూజారి చెప్తాడు. అది కృష్ణ తీసుకుంటుంది. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే నేనేమైపోవాలి ఇప్పుడే మాకు నిశ్చితార్థం కూడా అయ్యిందని కావాలని కృష్ణతో కలిసి వెళ్తుంది. చెట్టు దగ్గరకి వెళ్తుండగా కృష్ణని మెచ్చుకుంటుంది. అదంతా మురారీ చూస్తూనే ఉంటాడు. ముకుంద అనాలోచితంగా చేసిన పని ఎక్కడికి దారి తీయబోతుందని భయపడతాడు. కృష్ణ ఈ ముడుపు కడితే ఏం లాభం అది నేను కడితే మురారీ నాకు పెళ్లి జరుగుతుంది కదా అని మనసులో అనుకుంటుంది. అక్కడ ఒకామే వాయనాలు ఇస్తుంటే వెళ్ళి వాటిని తీసుకోమని చెప్తుంది.
ముడుపు ఇచ్చేసి వెళ్ళు అనగానే కృష్ణ పిచ్చిదానిలా పూజారి ఇచ్చిన పసుపు కొమ్ము ముకుంద చేతిలో పెట్టి వెళ్తుంది. తాను అటు వెళ్ళగానే ముకుంద దాన్ని చెట్టుకు కడుతుంది. నాలో ఓపిక నశించిపోయింది అందుకే ధైర్యం చేసి మురారీకి ఉంగరం తొడిగాను, ఇప్పుడు పసుపు కొమ్ము కడుతున్నా కృష్ణ వెళ్లిపోగానే నాకు మురారీకి పెళ్లి జరగాలని కోరుకుంటూ ముడుపు కట్టేస్తుంది. అది మురారీ చూస్తాడు. ఏం చేశావాని అడుగుతాడు. మనకి కలిసి ఉండే యోగం లేదు. నువ్వు ఆదర్శ్ ని మర్చిపోయినట్టు నేను కృష్ణని మర్చిపోలేను. ఈ క్షణమే ఉంగరం తీసేస్తానని దాన్ని తీయడానికి ట్రై చేస్తాడు. అది రాదు. అప్పుడే కృష్ణ వచ్చి ముడుపు ఏదని అడుగుతుంది. చెట్టుకు కట్టానని చూపిస్తుంది. నేను రాకుండా ఎవరు కట్టారంటే నేనే కట్టానని చెప్తుంది. కాదులే మీ ఏసీపీ సర్ కట్టారని అబద్ధం చెప్తుంది.
Also Read: ధాన్యలక్ష్మిని కన్నీళ్ళు పెట్టించిన రాజ్- భర్త ఆఫీసు ఎదుటే కావ్యకి అవమానం
మన ఇద్దరిలో ఎవరు కట్టినా పర్లేదులే అంటుంది. మురారీ ఉంగరం తీసేందుకు తిప్పలు పడుతూనే ఉంటాడు. గుడిలో ఒక చెట్టు దగ్గర ఆడవాళ్ళు అందరూ అమ్మవారి త్రిశూలంకి గాజులు వేస్తూ ఉంటారు. అక్కడికి ముకుంద వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతుంది. ఏదైనా బలమైన కోరిక ఉంటే తీరాలని కోరుకుంటూ గాజులు వేస్తే కోరిక నెరవేరుతుందని పూజారి చెప్తాడు. ముకుంద అమ్మవారిని మొక్కుకుని గాజులు వేస్తుంది. మురారీకి, తనకి పెళ్లి జరగాలని కోరుకుంటూ గాజు వెయ్యగానే పడినట్టు ఊహించుకుంటుంది. ఒకవేళ పడకపోతే ఏమవుతుందోనని భయపడుతూ వేయకుండానే వెళ్ళిపోతుంది. గుడి బయట ఉన్న ముసలి వాళ్ళ కోసం కృష్ణ చూస్తుంటే మన ఆశ్రమం వాళ్ళు వచ్చి కారులో తీసుకెళ్లారని ఇక వాళ్ళకి ఫుడ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని భవానీ చెప్తుంది. అది విని అందరూ భవానీని మెచ్చుకుంటారు.
Also Read: అనుకున్నది సాధించిన అభిమన్యు- చిత్ర జీవితం సర్వనాశనం, పెళ్లికి ఒప్పుకోక తప్పదా?
ముకుంద కూడా కృష్ణ వాళ్ళతో కలిసి కారులో రెస్టారెంట్ కి బయల్దేరుతుంది. మురారీ కృష్ణ చూడకుండా ఉన్నప్పుడు ఉంగరం తీసేందుకు ట్రై చేస్తాడు. ఏసీపీ సర్ డల్ గా ఉన్నారని కృష్ణ అంటుంది. తను వెళ్లిపోయే వరకు మా ప్రేమ గురించి జరగబోయే మా పెళ్లి గురించి తెలియకపోవడమే మంచిది. తెలిస్తే ఇప్పుడే చిన్నత్తయ్యతో చెప్పేస్తుందని ముకుంద మనసులో అనుకుంటుంది. మురారీ వాళ్ళు ఎప్పుడూ వెళ్ళే రెస్టారెంట్ కి వెళతారు. అక్కడ బేరర్ వాళ్ళని చూసి బిక్క మొహం వేస్తాడు. ముకుంద కావాలని మురారీ పక్కనే కూర్చుంటుంది. మురారీ ఉంగరం దాచేందుకు జేబులో చెయ్యి పెట్టుకుని ఉంటాడు.