News
News
వీడియోలు ఆటలు
X

Ennenno Janmalabandham May 15th: అనుకున్నది సాధించిన అభిమన్యు- చిత్ర జీవితం సర్వనాశనం, పెళ్లికి ఒప్పుకోక తప్పదా?

చిత్ర, వసంత్ పెళ్లి ఫిక్స్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

అభిమన్యు గదిలో నుంచి చిత్ర తప్పించుకుని బయటకి వచ్చేసరికి ఎదురుగా యష్, వేద ఉంటారు. చిత్ర నువ్వేంటి ఇక్కడని యష్ అడుగుతాడు. ఏయ్ నువ్వేంటని అభిని నిలదీస్తాడు. కంగారు పడాల్సిన పని లేదు వసంత్ రూమ్ అనుకుని వచ్చింది కాలికి డోర్ తగిలి లాక్ అయిపోయి భయపడిపోయిందని అబద్దం చెప్పి కవర్ చేస్తాడు. నిజం చెప్పు అభిమన్యు చెప్పింది నిజమేనని అంటుంది. సులోచన పెళ్లి మండపంలోకి వెళ్తూ సులోచన చూసుకోకుండా మాళవికని ఢీ కొడుతుంది. ఇద్దరూ కాసేపు వాదులాడుకుంటారు. పెద్ద పెద్ద ఆఫీషియల్స్ వస్తారు జాగ్రత్తగా ఉండమని మాళవిక అంటుంది. ఆ మాటకి సులోచన గట్టిగానే బదులిస్తుంది. ఏదైనా జరిగి న్నీ పెళ్లి పెటాకులు అయితే అందుకు కారణం నువ్వే నీ కాళ్ళ కింద నువ్వే గోతులు తవ్వుకుంటున్నావని తిడుతుంది.

పంచదార నీళ్ళు గోరింటాకుకి రాసుకుంటే ఎర్రగా పండుతుందని మాళవిక ఫ్రెండ్ చెప్తుంది. పంచదార నీళ్ళు రాసుకుంటావా అని సోడా ఉప్పు కలిపిన నీళ్ళు మాళవికకి వచ్చేలా చేస్తుంది. అవి రాసుకునేసరికి మాళవిక చేతులు మంట పుట్టిపోతున్నాయని చిందులు వేస్తుంది. గోరింటాకులోనే ఏదో తేడా ఉందని అనుమానపడుతుంది. అదేంటి చిత్ర, వేద వదిన కూడా ఇదే గోరింటాకు పెట్టుకున్నారు కదా వాళ్ళకి రాని ఇబ్బంది నీకు ఎందుకు వచ్చిందని వసంత్ అంటాడు. సులోచన వైపు చూస్తూ అనుమానంగా మాట్లాడుతుంది. మా అమ్మ ఇప్పుడు వచ్చింది తనని అనొద్దని వేద తిడుతుంది. ఈ విషయం దగ్గర అందరూ కాసేపు వాదులాడుకుంటారు. మమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి అనకపోతే ఉండలేవా అంటుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది ఊరికే గొడవలు పెట్టుకోవద్దని వసంత్ నచ్చజెప్పడానికి చూస్తాడు. ఇక్కడ జరుగుతుంది మీ పెళ్లి కూడా తెలిసో తెలియకో ఏదైనా జరిగితే చూసి చూడనట్టు వెళ్లిపో లేదంటే మనస్పర్థలు వస్తాయని చెప్పేసి వెళ్లిపోతారు.

Also Read: అత్తాకోడళ్ళ ఫన్ టైమ్- గుడ్ న్యూస్ చెప్పిన మల్లిక, బాధలో జానకి

చిత్ర ఒక్కతే ఉండగా మళ్ళీ అభిమన్యు తన దగ్గరకి వస్తాడు. ఇంకోసారి నీకు, నాకు పెళ్లి అంటే అక్క, మాళవిక వాళ్ళకి చెప్పేస్తానని చిత్ర అంటుంది. అమ్మో భయమేస్తుంది చెప్పేస్తావా రా చెప్పు అని చిత్ర చెయ్యి పట్టుకుంటే విదిలించుకుని లాగిపెట్టి కొడుతుంది. చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడితే ఇప్పుడే వెళ్ళి మాళవికకి నీ నిజస్వరూపం చెప్పేస్తానని ఆవేశంగా వెళ్లబోతుంటే ఒక్క నిమిషం అని ఆపుతాడు. నీకు కొన్ని చూపిస్తాను అవి చూశాక ఇదే విషయం చెప్పమని అంటాడు. తన ఫోన్ లో చిత్ర వీడియో చూపిస్తాడు. నీకు దణ్ణం పెడతాను నా బతుకు బజారుపాలు చేయొద్దు ప్లీజ్ అని చిత్ర వేడుకుంటుంది. ఇది సాంపుల్ మాత్రమే అసలు షో ముందుందని అంటాడు. ఒక ఆడపిల్ల బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే, బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకుంటుంటే దొంగచాటుగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడానికి సిగ్గు లేదా. ఆ వీడియో డిలీట్ చేయమని వేడుకుంటుంది.

Also Read: రంగంలోకి దిగిన కంచు కోడలు, ఇక అత్తకి దబిడీ దిబిడే- డిప్రెషన్ లో నందు

నేను ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకుని నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది వదులుకోవడానికా? పెళ్లికి 20 నిమిషాల ముందు నీ అంతట నువ్వే నా దగ్గరకి రావాలి లేదంటే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తాడు. నా మాట కాదని ఏమైనా చేస్తే వసంత్ ప్రాణాలతో ఉండదని బ్లాక్ మెయిల్ చేస్తాడు.

Published at : 15 May 2023 08:14 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial May 15th Episode

సంబంధిత కథనాలు

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

Ennenno Janmalabandham May 30th: రోడ్డు పక్కన చెత్తలో మాళవిక, ఏడిపించేసిన ఆదిత్య- యష్, వేద రొమాంటిక్ మూమెంట్

Ennenno Janmalabandham May 30th: రోడ్డు పక్కన చెత్తలో మాళవిక, ఏడిపించేసిన ఆదిత్య- యష్, వేద రొమాంటిక్ మూమెంట్

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి