Krishna Mukunda Murari June 12th: ముకుందకి థాంక్స్ చెప్పిన రేవతి- ఇంకెన్నాళ్ళు ఈ మురారీ, కృష్ణ ప్రేమ ఊగిసలాట
మురారీ వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని రేవతికి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ముకుంద ఒంటరిగా కూర్చుని బాధపడుతుంది. తన ఫ్రెండ్ ఫోన్ చేసి మురారీ మాట్లాడాడా? అని అడుగుతుంది. నువ్వు ఇక్కడ ఉండటం కంటే మీ అమ్మ పక్కన ఉండవచ్చు కదా అన్నాడు. దాన్ని బట్టే అర్థం అవుతోంది తనకి నేను దూరంగా ఉండాలని కోరుకుంటున్నాడని బాధపడుతుంది. కానీ అదేమీ ఉండదులే అని తన ఫ్రెండ్ నచ్చజెపుతుంది. మురారీ, కృష్ణ శాశ్వతంగా భార్యాభర్తలుగా కలిసి ఉండాలంటే ప్రతిక్షణం వాళ్ళు భార్యాభర్తలని నేనే గుర్తు చేస్తూ ఉండాలి. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. వెంటనే ఒక ఆలోచన వస్తుంది. ముకుంద బయటకి వచ్చి ఏంటి ఎవరూ కనిపించడం లేదు రేవతి అత్తయ్య ఎప్పుడు నన్ను సీసీ కెమెరాలాగా గమనిస్తూ ఉంటుంది కదా అనుకుంటుంది. వీళ్ళ అగ్రిమెంట్ అయిపోగానే మమ్మీకి కూడా తగ్గిపోతుంది. అప్పుడు మమ్మీ డాడీకి చెప్పి మురారీతో పెళ్లి అని సంబరపడుతుంది.
Also Read: ఒకరికొకరు ఎదురుపడిన రిషిధార- మహేంద్రకి ఫోన్ చేసిన వసు, కొడుకు ఆచూకీ తెలుసుకోగలుగుతాడా?
రేవతి వచ్చి ఏంటి ముకుంద ఒంటరిగా ఉన్నావని అడుగుతుంది. జీవితంలో ఒంటరితనమే కదా మిగిలిందని అంటుంది. మురారీ, కృష్ణ కలిసి రావడం చూసి ఏంటి నిజంగా భార్యాభర్తలుగా కనిపిస్తున్నారని ముకుంద అనుకుంటుంది. ఏంటి అత్తయ్య డల్ గా కనిపిస్తున్నారు బయటకి వెళ్ళి వచ్చారా? అని కృష్ణ అడుగుతుంది. ఫేస్ రీడింగ్ తెలుసని మురారీ అనేసరికి ముకుంద అయితే నా బాధ ఏంటో చెప్పమని అడుగుతుంది. కృష్ణ కాసేపు ముకుంద మొహంలోకి చూసి నువ్వు మీ మదర్ ఆరోగ్యం గురించి కాకుండా ఇంక ఎవరి గురించో ఆలోచిస్తున్నావని ఇప్పుడైతే ఇది నిజం అవునా కాదా? అని అంటుంది. అవును నువ్వు చెప్పింది నిజం నీకు ఫేస్ రీడింగ్ ఇంత బాగా తెలుసని ఇప్పుడే తెలిసింది. నేను ఆలోచించేది ఎవరి గురించో ఇప్పుడే చెప్తానని ముకుంద అనేసరికి రేవతి వాళ్ళు టెన్షన్ పడతారు. తను ఆలోచించేది ఆదర్శ్ గురించని ముకుంద అబద్ధం చెప్తుంది. ఆదర్శ్ తప్పకుండా వస్తాడని రేవతి అంటుంది.
రేవతి కృష్ణ వాళ్ళకి మెట్టెలు ఇస్తుంది. భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలని మెట్టెలు తొడుగుతారని చెప్తుంది. కృష్ణని కూర్చొబెట్టి మురారీతో మెట్టెలు తొడిగిస్తుంది. ఏసీపీ సర్ మీ మనసులో ఉన్న డైరీ అమ్మాయి స్థానాన్ని నాకు ఇవ్వలేరా? అని కృష్ణ మనసులో అనుకుంటుంది. నటించడం కాదు కానీ ఇది నిజం కావాలని ఎప్పుడు ఏ కోరిక కోరని దేవుడిని నిన్ను ఇవ్వమని మనస్పూర్తిగా మురారీ కోరుకుంటాడు. బలవంతంగా తొడుగుతున్నట్టు ఉన్నాయి వీళ్ళ మొహాలు వీళ్ళ చేతనే ఒకరినొకరు విడిచి పెట్టి ఉండలేమని అనేలా చేస్తానని రేవతి అనుకుంటుంది. కృష్ణ సంతోషంగా అత్తయ్యకి థాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతుంది. అనవసరంగా చెప్పాను వీళ్లిద్దరినీ కలపడానికి ట్రై చేస్తుందని ముకుంద తిట్టుకుంటుంది.
రేవతి: నువ్వే అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పకపోయి ఉంటే తెలిసేది కాదు. ఇప్పుడు చూడు వాళ్ళ మధ్య బంధం శాశ్వతం కావాలని ప్రయత్నాలు చేసేదాన్ని కాదు. నువ్వు చాలా మంచి పని చేశావు. ఇందాక ఆదర్శ్ గురించి ఆలోచిస్తున్నా అని అబధ్దం చెప్పావు కానీ అదే నిజం చెయ్యి అప్పుడే అందరి జీవితాలు బాగుపడతాయి.
ముకుంద: మీరు ఎన్ని ప్రవచనాలు చెప్పినా నా మనసు మారదు అత్తయ్య
Also Read: స్వప్నతో పెళ్లి రద్దు చేయమన్న రుద్రాణి- అక్కని కాపాడుకోవడానికి వెళ్ళిన కావ్య
కారులో వెళ్తూ కృష్ణ కాలికి మెట్టెలు గుచ్చుకుంటున్నాయని చెప్తుంది. తన కాళ్ళు తీసుకొచ్చి మురారీ ఒడిలో పెడుతుంది. నువ్వు నా భార్యవి అయితే జీవితాంతం ఇలాగే సేవలు చేస్తానని అనుకుంటాడు. నిజంగా మీరు నా భర్త అయితే ఇంతకంటే సంతోషం ఏమి ఉండదని అనుకుంటుంది. తన భర్త మనసులో డైరీ అమ్మాయి ఉందా? ఈ తింగరి పిల్ల ఉందో అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది.