Krishna Mukunda Murari April 17th: డబుల్ ట్విస్ట్, కృష్ణ మీద చేయి ఎత్తిన మురారీ- రెండు నిజాలు బట్టబయలు
నందిని పెళ్లి చేయాలని అటు కృష్ణ, ఇటు భవానీ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రయత్నాలు చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.
నందిని పెళ్లి గురించి భవానీ ఈశ్వర్ తో మాట్లాడుతుంది. నందిని జీవితం హ్యాపీగా ఉండాలి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని అంటాడు. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయని అడుగుతుంది. అన్నీ పనులు ముకుంద, మురారీ చూసుకుంటున్నారని చెప్తాడు. కృష్ణ, మురారీ ఇంటికి వస్తారు. కపుల్ స్వీట్ గురించి కృష్ణ చెప్పబోతుంటే మురారీ మాత్రం వద్దని అంటాడు. ప్లీజ్ కృష్ణ అనేసరికి అసలు చెప్పాను అది కపుల్ స్వీట్ అని ఒకరికొకరు తినిపించుకున్నామని అసలు చెప్పను అనేసి మొత్తం చెప్పేస్తుంది. అది విని రేవతి సంతోషపడుతుంది. తర్వాత కృష్ణ నందిని గదికి వెళ్తుంది. భవానీ, ముకుందకి ఏదో చెప్తుంది అది షాకింగ్ గా మొహం పెడుతుంది. జాగ్రత్త ఈ విషయం మూడో కంటికి కూడా తెలియకూడదు. ముఖ్యంగా కృష్ణకి, మురారీకి అసలు తెలియకూడదని చెప్పేసి వెళ్ళిపోతుంది.
కృష్ణ నందిని కోసం వెతుకుతూ వచ్చి భవానీని అడుగుతుంది.
కృష్ణ: మీ కూతురు అయ్యింది కాబట్టే మతి స్థిమితం కూడా పోయింది. ఇప్పుడు తను ఏమైంది ఎక్కడికి పోయింది. ఇల్లు దాటించారా? దేశమే దాటించారా?
ఈశ్వర్: ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా?
Also Read: మండపంలో తులసి, లాస్య గొడవ - చివరి నిమిషంలో పెళ్లి చేసుకోనని చెప్పిన దివ్య, రాజ్యలక్ష్మి షాక్
కృష్ణ: తెలుసు నందినికి తల్లి అని చెప్పుకునే పెద్దత్తయ్యతో మాట్లాడుతున్నా
ప్రసాద్: నీ భార్య స్థాయి మరిచి మాట్లాడుతుంటే చూస్తూ ఉంటావ్ ఏంటి మురారీ
భవానీ: నన్ను నిలదీసే హక్కు ఎవరు ఇచ్చారు
కృష్ణ: తన మెడలో తాళి చూపిస్తూ ఇది ఇచ్చిందని అంటుంది. నందిని కావాలని ఇల్లు దాటించారు ఎందుకు
భవానీ: నీకు నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు
అసలు ఏం జరిగిందని మురారీ కూడా అడుగుతాడు. ఏంటి ఈ గొడవ నీ భార్యని నువ్వు కంట్రోల్ లో పెట్టుకుంటావా లేదా అనేసరికి మురారీ వెళ్లిపోదాం రమ్మని అంటాడు. తనకి క్షమాపణ చెప్పి మరీ కదలాలని భవానీ అంటుంది.
కృష్ణ: మీరు నన్ను నిలువునా నరికినా సోరి చెప్పను. నందిని దాచి పెట్టారు అది అడిగితే తప్పులు నామీద పెడుతున్నారు ఇన్నాళ్ళూ మీ పెద్దరికాన్ని ఎవరూ ప్రశ్నించలేదు
భవానీ: ఇది నా ఇల్లు నా సామ్రాజ్యం. నా కొడుకు నీ మెడలో తాళి కట్టినంత మాత్రనా నన్ను ప్రశ్నిస్తావా. నీ భార్యని తీసుకుని లోపలికి వెళ్ళు
Also Read: మిస్టర్ ఇగోలో రొమాంటిక్ యాంగిల్, అసలు ఆగడం లేదుగా- కిడ్నాపర్స్ కి చెక్ బెట్టబోతున్న రిషి
కృష్ణ: దయచేసి ఏసీపీ సార్ ని ఇందులోకి లాగొద్దు ఆయనకి ఇంట్లో జరిగేవి ఏవి ఆయనకి తెలియవు
భవానీ: ఇదే ఆఖరి సారి చెప్తున్నా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లకపోతే కట్టుబట్టలతో బయటకి నెట్టేస్తాను
మురారీ కృష్ణని లోపలికి రమ్మని అంటుంటే రానని అనేసరికి తన మీదకు చేయి ఎత్తుతాడు. నా ముందే మా పెద్దమ్మని ఎదిరించి మాట్లాడితే సహించనని మురారీ అంటాడు. పరువు కోసం మీరు ఎంతదూరం అయినా వెళతారు కానీ దయచేసి అమాయకురాలు అయిన నందిని ప్రాణాలు మాత్రం తీయకండని కృష్ణ వేడుకుంటుంది.
భవానీ మాటలు గుర్తు చేసుకుని తప్పు జరుగుతుందని ఆలోచిస్తుంది. నందినికి పెళ్లి అంటే అందరి కంటే కృష్ణనే ఎక్కువ సంతోషపడుతుంది కదా మరి ఎందుకు తనని అజ్ఞాతంలో ఉంచుతున్నారని అనుమానిస్తుంది. రేవతి కృష్ణ మీద అందరూ అరుస్తున్నారని కోపంతో ఊగిపోతుంది. కృష్ణ జోలికి వస్తే ఊరుకునేది లేదని అనుకుంటుంది. గది సర్దుతూ ఉండగా నందిని పెళ్ళికి రాయించిన లగ్నపత్రిక రేవతి కంట పడుతుంది.