Guppedanta Manasu April17th: మిస్టర్ ఇగోలో రొమాంటిక్ యాంగిల్, అసలు ఆగడం లేదుగా- కిడ్నాపర్స్ కి చెక్ బెట్టబోతున్న రిషి
Guppedantha Manasu April 17th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
వసు కాఫీ తీసుకుని గదిలోకి రాగానే రిషి డోర్ గడి పెట్టేసి తన దగ్గరగా వస్తూ ఉంటాడు. కాఫీ తీసుకుని పక్కన పెట్టేసి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళిపోతాడు. మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. దేనికోసమే పరితపిస్తుంది. అసలు శూన్య మాసం ఏంటి వసుధార అని అడుగుతాడు. శుభకార్యాలు శూన్యమాసంలో చేయకూడదని వయసు చెప్తుంది. ఇంతకీ అది ఎప్పుడు అయిపోతుందని రిషి అంటే తెలియదని తల ఊపుతుంది. వసు భయం భయంగా ఎవరో వస్తున్నారని అంటుంది. వస్తే ఏమైందని అంటాడు. వస్తే ఏంటి మనకి పెళ్లి జరగబోతోంది కదా అని క్యూట్ గా అంటాడు. ఇంకా జరగలేదు కదా అప్పటి దాకా ఇది బాగోదు కదా దగ్గరకి రావడం చేతితో గడ్డం పట్టుకోవడమని సిగ్గు పడుతూ చెప్తుంది. నువ్వే కదా దగ్గరగా ఉండాలని అన్నావ్ అంటే అది వేరు ఇది వేరని అంటుంది.
Also Read: యష్ హెల్త్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్- ఎన్నెన్నో జన్మలబంధంలో 'పవిత్రబంధం'
ఇద్దరూ కాఫీ షేర్ చేసుకుని తాగుతారు. వసుధార ఫస్ట్ టైమ్ కాలం పరిగెడితే బాగుండని అనిపిస్తుంది. నువ్వు నేను ఒకే గదిలో ఆ క్షణం త్వరగా రావాలని అంటాడు. వసు సిగ్గుపడుతూ ఇష్టమైన క్షణాల కోసం ఎదురుచూడటం బాగుంటుందని అంటుంది. మహేంద్ర అద్దం ముందు నుంచుని ఉంటే జగతి వచ్చి తన నోట్లో చక్కెర పోస్తుంది.
మహేంద్ర-జగతి: నా కొడుకు దేవయాని ఆక్కయ్యని నోరెత్తకుండా చేశాడు. వాళ్ళ ఊరు వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడాలని అనగానే ఎక్కడ తలొగ్గుతాడో అనుకున్నా కానీ సమాధానం చెప్పాల్సిన రీతిలో చెప్పాడు. ఇక దేవయాని అక్కయ్య పప్పులు ఏవి ఉడకవు. పెళ్లి జరుగుతుందని సంతోషపడుతున్నావ్. ఆ పెళ్లి అమ్మగా చూడగలుగుతావు ఏమో కానీ దగ్గరుండి అమ్మగా పెళ్లి చేసే అవకాశం రాదేమో అంటాడు. వస్తే ఒక అమ్మగా అంతకు మించిన అదృష్టం ఉండదు. ఆ అదృష్టం అక్కయ్యదేనని బాధపడుతుంది.
రిషి-వసు: మన జీవితంలో చేదు అనుభవాలు ఉన్నాయంటే అది మీ ఊర్లోనే. అయినా నీకు నాకు దూరం ఇద్దరి మనసులో సంఘర్షణ. నువ్వు మీ ఊర్లో అడుగు పెట్టాక మన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. మన ప్రేమకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. వాటిని దాటుకుని ప్రేమని దక్కించుకున్నాం. మనం ఆ చేదు జ్ఞాపకాలని గుర్తు చేసుకోవద్దు. నిన్ను ఒంటరిగా ఒక్క క్షణం కూడా ఎక్కడికి పంపించను. మీరు పొమ్మన్నా ఎక్కడికి వెళ్ళను.
Also Read: అపర్ణతో రానని తెగేసి చెప్పిన రాజ్- స్వప్న రాకతో కావ్య కష్టాలు మరింత పెరగనున్నాయా?
వసు వాళ్ళు కాలేజీకి రాగానే ఒక వ్యక్తి పేపర్ లో పడిన వార్త చూపిస్తాడు. జగతి, ఫణీంద్ర, మహేంద్ర మాట్లాడుకుంటూ ఉండగా రిషి వచ్చి థాంక్స్ చెప్తాడు. అప్పుడే మినిస్టర్ రిషికి కాల్ చేస్తాడు. ఏం జరిగిందని వివరాలు అడిగి తెలుసుకుంటాడు. వాళ్ళు ఎవరో చెప్పు వెంటనే యాక్షన్ తీసుకుంటానని అంటాడు. ఇది ఎవరో చేశారో వాళ్ళ పేర్లు బయట పెట్టడం తనకి ఇష్టం లేదని రిషి చెప్తాడు. మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి రిషి మీద ఇంకోసారి ఇలాంటి కుట్రలు జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తాడు.