అన్వేషించండి
Advertisement
Kiran Abbavaram: 'బ్రహ్మాస్త్ర'కి పోటీగా యంగ్ హీరో - పెద్ద సాహసమే!
'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా విడుదల చేయనున్నారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. 'S R కళ్యాణమండపం' లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'రాజావారి రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు.
ఈ మధ్యే విడుదలైన సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని లహరి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో అందర్ని ఆకట్టుకుంటున్నాడు.
ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజున బాలీవుడ్ సినిమా 'బ్రహ్మాస్త్ర' విడుదల కానుంది. రణబీర్ నటిస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తెలుగులో 'బ్రహ్మాస్త్ర'ను రాజమౌళి సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సైలెంట్ గా ఉన్నా త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది. అప్పటికి సినిమాపై హైప్ రావడం ఖాయం. ఇలాంటి సినిమాకి పోటీగా కిరణ్ అబ్బవరం తన సినిమాను రిలీజ్ చేయడం సాహసమనే చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion