News
News
X

Darshana - Break Up Party : ఆదివారం ఉదయం 'దర్శన', సాయంత్రం కిరణ్ అబ్బవరం 'బ్రేకప్ పార్టీ' 

వరంగల్ యువతకు ఆదివారం సాయంత్రం కిరణ్ అబ్బవరం బ్రేకప్ పార్టీ ఇస్తున్నాడు. అయితే, ఉదయం 'దర్శన...' సాంగ్ విడుదల చేయడానికి రెడీ అయ్యాడు. అసలు ఆ కహానీ ఏంటంటే?

FOLLOW US: 
Share:

యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఆదివారం సాయంత్రం వరంగల్ యువతకు బ్రేకప్ పార్టీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పుకొందామని అందర్నీ ఆహ్వానించారు. ఈ ఆహ్వానం వెనుక ఓ కథ ఉంది. ఆ బ్రేకప్ బాధ వివరించేలా ఓ పాట రెడీ చేశారు. ఆ సాంగ్ రిలీజ్ ప్రమోషన్ అన్నమాట.

కిరణ్ అబ్బవరం హీరోగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha). 'వాసవ సుహాస...', 'బంగారం...' - సినిమాలో రెండు పాటలను విడుదల చేశారు. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది బ్రేకప్ సాంగ్. 
దర్శనా... ఇది తెలుగు పాటే!తెలుగుతో పాటు మలయాళ సినిమాలు ఫాలో అయ్యేవాళ్ళకు 'దర్శన...' అంటే మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ హీరోగా నటించిన 'హృదయం' సినిమాలో సాంగ్ గుర్తుకు వస్తుంది. ఆ సాంగ్ వేరు, ఈ సాంగ్ వేరు. ఇది పక్కాగా తెలుగు పాట. 

Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్

కిరణ్ అబ్బవరం సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆ మధ్య విడుదలైన 'వినరో భాగ్యము విష్ణు కథ' టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

'వాసవ సుహాస...' ప్రారంభానికి ముందు హీరోకి, తాతకు మధ్య జరిగే సంభాషణ సినిమాలోని కథా సారాంశాన్ని తెలిపే విధంగా ఉంది. కనిపించే ప్రతివాడు మన పక్కింటి వాడేనని సందేశాన్ని సినిమాలో ఇస్తున్నారని అర్థమైంది. ''నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావ్ అన్నదాని బట్టే ఉంటుంది'' అని 'శుభలేఖ' సుధాకర్ చెప్పే మాట బావుంది. కనిపించే ప్రతి మనిషికి సాయం చేసే గుణం ఉన్న యువకుడిగా హీరో పాత్రను పాటలో పరిచయం చేశారు. కిరణ్ అబ్బవరం లుక్ కూడా పక్కింటి కుర్రాడిలా ఉంది. ''ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్?'' అని కిరణ్ అబ్బవరం చెప్పడం... స్క్రీన్ మీద క‌శ్మీర ప‌ర్ధేశీతో లవ్ సీన్స్ రావడం బావుంది. ఆ తర్వాత కామెడీ, థ్రిల్, కాన్సెప్ట్ అన్నీ ఉన్నాయని హీరో చెప్పారు.''ఇది కాన్సెప్ట్ తో మొదలై... లవ్, కామెడీ మిక్స్ అయ్యి... క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోండి'' సినిమా గురించి కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చారు.

Also Read : ఆ రోజే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓపెనింగ్

'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో', '18 పేజెస్' వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది. ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చిత్రసీమకు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: స‌త్య‌ గమిడి - శ‌రత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియ‌ల్, స‌హ నిర్మాత‌: బాబు, సంగీతం: చైత‌న్ భరద్వాజ్.

Published at : 28 Jan 2023 08:37 AM (IST) Tags: Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Break Up Party Darshana Song Telugu

సంబంధిత కథనాలు

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో

Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో

Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శ‌కున‌ములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్

Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శ‌కున‌ములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్

Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక

Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక

Manisha Koirala: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు

Manisha Koirala: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?