By: ABP Desam | Updated at : 29 Jan 2022 07:17 PM (IST)
మహేష్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోన్న 'మహానటి'.
'మహానటి' సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించింది కీర్తి సురేష్. అప్పటివరకు సావిత్రి పాత్రలో ఆమెని ఎలా తీసుకున్నారని ప్రశ్నించిన వారంతా.. ఆమె పెర్ఫార్మన్స్ తో సైలెంట్ అయిపోయారు. సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసింది కీర్తి సురేష్. ఈ సినిమాతో నేషనల్ లెవెల్ లో అవార్డులను అందుకుంది. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.
చాలా మంది దర్శకనిర్మాతలు ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకున్నారు. కథల ఎంపిక విషయంలో పొరపాట్లు చేయడంతో కీర్తి నటించిన ఏ ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమా సక్సెస్ కాలేదు. 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించాయి. కానీ అవి ఓటీటీలో విడుదల కావడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారు.
రీసెంట్ గా రజినీకాంత్ నటించిన 'పెద్దన్న' సినిమాలో అతడి చెల్లెలిగా కనిపించింది. ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చినా.. ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక నిన్న విడుదలైన 'గుడ్ లక్ సఖి' సినిమాకి దారుణమైన రేటింగ్స్ వస్తున్నాయి. దీంతో కీర్తి బ్యాడ్ లక్ వెంటాడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం కీర్తి విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే.. మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ కీర్తి సెంటిమెంట్ ఈ సినిమాకి రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు. మరోపక్క ఈ సినిమాపై కీర్తి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇది హిట్ కొడితే గనుక.. తన క్రేజ్ పెరుగుతుందని భావిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి!
Tiger Nageswara Rao: 'వీడు' లిరికల్ సాంగ్ వీడియో - ఒక్క మాస్ పాటతో 'టైగర్ నాగేశ్వరరావు' పాత్రను చెప్పేశారు!
Bigg Boss Telugu Season 7 Episode 19: మగాళ్లకు సెన్స్ ఉండాలి, ఆడవాళ్ల ముందు షర్టులు విప్పుతున్నారు: శోభాశెట్టి కామెంట్స్ - గౌతమ్‌కు అన్యాయం?
నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!
మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?
Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>