By: ABP Desam | Updated at : 24 Jan 2022 11:43 AM (IST)
'గుడ్ లక్ సఖి' సినిమాలో జగపతి బాబు, కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి
కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్ లక్ సఖి'. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. జగపతి బాబు, ఆది పినిశెట్టి ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు (శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్) సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ సినిమాకు శ్రావ్యా వర్మ సహ నిర్మాత. సినిమా ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే... దేశం గర్వపడేలా షూటర్స్‌ను తయారు చేయాలని సంకల్పించిన ఓ కోచ్‌కు మట్టిలో మాణిక్యం లాంటి అమ్మాయి సఖిని ఓ కుర్రాడు పరిచయం చేస్తాడు. ఊళ్లో ఆ అమ్మాయిని అందరూ 'బ్యాడ్ లక్ సఖి' అంటారు. రైఫిల్ షూటింగ్‌లో ఎటువంటి నేపథ్యం లేని ఆ అమ్మాయి కోచ్ దగ్గరకు వెళ్లినప్పుడు లక్ష్యం మీద కాలుస్తుంది. కోచింగ్ తీసుకుని పోటీలకు వెళ్లినప్పుడు ఆమె గుర్తి తప్పుతుంది. ఆ తర్వాత నిరాశలో కూరుకుపోయిన సఖి, దేశం గర్వపడేలా పతకం ఎలా సాధించింది? విజేతగా ఎలా నిలిచింది? అనేది కథగా తెలుస్తోంది.
'మనకి ఏది అలవాటు?' - 'గెలుపు'
'లక్ అనేది?' - 'లేదు'
'మన రాత?' - 'మనమే రాసుకోవాలి'
అంటూ జగపతిబాబు, కీర్తీ సురేష్ మధ్య సాగిన సంభాషణ స్ఫూర్తి నింపేలా ఉంది. ఈ నెల 28న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Also Read: శ్రీముఖి పేరును చేతి మీద టాటూగా వేయించుకున్న క్రేజీ ఫ్యాన్
Also Read: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Shakini-Dhakini: ‘శాకిని డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్, యాక్షన్ కామెడీతో వస్తున్న రెజినా, నివేదా థామస్
Ohmkar: ఆ ఛానెల్ తో విభేదాలు? ఇక జెమినీ టీవీలో ఓంకార్ షోస్!
Dil Raju: ఏదైనా తెలుసుకొని రాయండి, లేకుంటే మూసుకొని ఉండండి - దిల్రాజు ఫైర్
Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్కి పండగే!
Bipasha Basu: ఆ ఫోటోలను షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాసా బసు
Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి
AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !
Ambati Vs Janasena : బపూన్, రంభల రాంబాబు - అంబటిపై విరుచుకుపడుతున్న జనసేన ! కారణం ఏమిటంటే ?
Live Train Status: రైలు రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవాలా! పేటీఎం యాప్తో వెరీ ఈజీ!!