News
News
X

Karthika Deepam September 24 Update: డాక్టర్ బాబుకి గతం గుర్తుచేసేందుకు దీప సరికొత్త సాహసం, కార్తీక్ లో మార్పు చూసి మురిసిపోయిన మోనిత

కార్తీకదీపం సెప్టెంబరు 24 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

FOLLOW US: 

Karthika Deepam September 24th Episode 1466 (కార్తీకదీపం సెప్టెంబరు 24 ఎపిసోడ్)

సౌందర్య, ఆనందరావు వచ్చి వెళ్లిన విషయం మోనిత గుర్తుచేసుకుంటుంది. ఇంతలో శివ వచ్చి..మేడం వాళ్లు నిజంగా సార్ వాళ్ల అమ్మా-నాన్నేనా ఇందాక మీరు వంటలక్కతో మాట్లాడుతుండగా విన్నాను అంటాడు. అప్పుడే వచ్చిన కార్తీక్ వచ్చిన వాళ్లు ఎవరని అడగడంతో శివ వాళ్ల అమ్మానాన్న అని చెబుతుంది. 
కార్తీక్: అదేంటి..మరి శివను కలవకుండా వెళ్లారేంటి..
మోనిత: కనిపిస్తే ఇంటికి వస్తానని గోల చేస్తాడని ఇక్కడే ఉంచమని చెప్పి వెళ్లారు
ఆ తర్వాత ఆనందరావు, సౌందర్య కార్లో వెళుతూ మోనిత ఇంట్లో జరిగినదంతా గుర్తుచేసుకుంటారు...

అటు శౌర్యను కలుస్తుంది హిమ.నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని హిమ అంటే..నువ్వు ఇక్కడ ఉండలేవు వెళ్లిపో అని చెబుతుంది శౌర్య.
మరోవైపు కార్తీక్..దీప అన్న మాటలు గుర్తుచేసుకుంటూ ఉండగా మోనిత వస్తుంది
మోనిత: ఏం ఆలోచిస్తున్నావ్ కార్తీక్
కార్తీక్: ఆ వంటలక్క పదే పదే డిస్ట్రబ్ చేస్తోంది
మోనిత: ఇక్కడ ఉన్నంతవరకూ అది డిస్ట్రబ్ చేస్తూనే ఉంటుంది..మనం ఎక్కడికైనా వెళ్లిపోదాం
కార్తీక్: మనం వెళ్లడం కాదు మోనిత..తనంతట తానే వెళ్లిపోయేలా చేయాలి
మోనిత: తనంతట తాను వెళ్లదు కార్తీక్..అలా వెళ్లాలంటే ఏదైనా అద్భుతం జరగాలి

Also Read: తల్లిదండ్రులను చూసిన కార్తీక్,దీపను చూసిన ఆనందరావు - మాయా ప్రపంచంలో మోనిత వెలిగిస్తోన్న 'కార్తీకదీపం'

News Reels

ఆ తర్వాత బయటకు వెళుతున్న దీపకు ఎదురైన కార్తీక్..మాట్లాడాలి అంటాడు.సరే డాక్టర్ బాబు అంటే అలా పిలవొద్దని చెబుతాడు
కార్తీక్: ఈ రోజు మీకో విషయం కచ్చితంగా చెప్పి వెళదాం అని వచ్చాను..ఈ రోజు నుంచి మీ వల్ల నాకు ఎటువంటి సమస్యా రాకూడదు..నాకు గతం గుర్తులేకపోవచ్చు నా ఊరు, పేరు గుర్తులేకపోవచ్చు కానీ ఒక్క విషయం నమ్మకంగా చెప్పగలను నా భార్య పేరు మోనిత, నా కొడుకు పేరు ఆనంద్..నువ్వు ఎదురింట్లో ఉంటున్నావ్.. నేను నా కుటుంబం ప్రశాంతంగా ఉండాలి.. మీరు నా వెంట పడడం మానేయాలి..ఏం చేస్తే నా వెంటపడడం మానేస్తారు.. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు..కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు..మీరు నిజంగా డబ్బులకోసమే ఇదంతా చేస్తుంటే ఇవిగో డబ్బులు...ఇవి తీసుకుని దూరంగా వెళ్లిపోండి... ఇంతలో మోనిత నుంచి కాల్ రావడంతో ఎక్కడున్నావ్ అని అడిగితే నేను వంటలక్క దగ్గరున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు..
మోనిత: ఇప్పుడు దాంతో కార్తీక్ మాట్లాడే ముఖ్యమైన విషయం ఏముంది..దీపపై కోపంగా ఉన్నాడు కదా మళ్లీ అక్కడకు ఎందుకు వెళ్లాడు అనుకుంటూ అక్కడకు వెళ్లి చాటుగా వింటుంటుంది..
కార్తీక్: ఆ డబ్బులు సరిపోకపోతే ఇంకా ఇస్తాను కానీ నన్ను మాత్రం వదిలి వెళ్లిపోండి..ఇంకా ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఇస్తాను కానీ మా వెంట పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి..డాక్టర్ బాబు, నా భర్త అని అంటుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా..ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను..నా భార్య అయితే భయపడిపోయి ఊరే వదిలి వెళ్లిపోదాం అంటోంది.. వెళ్లిపోవడానికి క్షణం పట్టదు..కానీ వెళితే భయపడి వెళ్లినట్టు ఉంటుంది కదా..ఏం తప్పు చేశామని వెళ్లిపోవాలి.. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోండి..
దీప: మా ఊరు...
కార్తీక్: నాకు అవసరం లేదు..మీ వివరాలేవీ నాకు అవసరం లేదు..నాకు కావాల్సింది మీరు వెళ్లిపోవడమే..నా సహనం కోపంగా మారకముందే మీరు వెళ్లిపోవాలి..
ఇదంతా విన్న మోనిత..దేవుడా ఇంత తొందరగా ఇంత మార్పు తీసుకొస్తావని ఊహించలేదనుకుంటుంది..
దీప: ఈ డబ్బు అని దీప అంటే..ఇవ్వమని చెప్పలేదని కార్తీక్ అనడంతో.. నా మొగుడు నాకిచ్చిన డబ్బుపై నాకు హక్కుంది నా దగ్గరే ఉంటుకుంటాను..మీకు నచ్చిన చీరలు కొనుక్కుంటాను
వంటలక్కా అని కార్తీక్ చేయి ఎత్తబోతుండగా మోనిత అక్కడకు వస్తుంది.. ఆవిడంతే కార్తీక్ మారదని కార్తీక్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది.

Also Read: కిచెన్లో రిషిధార - కళాశాల నుంచి వంటింటికి చేరిన ప్రేమకథ
ఏదైనా చేయగలిగిన సత్తా ఉన్న నేను పిల్లల విషయంలో మాత్రం నిస్సహాయంగా ఎందుకు మారిపోయానో అర్థం కావడం లేదని సౌందర్య బాధపడుతుండగా...ఇదివరకూ ఉన్న సౌందర్య ఇలా మాట్లాడేది కాదంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి..సిటీ మొత్తం జల్లెడ పడతాను అంటుంది. మరోవైపు దీప దేవుడికి దండం పెట్టుకుని..ఈ రోజు ఓ సాహసం చేయబోతున్నాను ఇది ఫలించేలా చేయి, డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చేలా చేయు అని అంటుంది..

సోమవారం ఎపిసోడ్ లో
కాలనీ అసోసియేషన్ వార్షికోత్సవంలో తన కథనే నాటకంగా వేసేందుకు నిర్ణయించుకుంటుంది దీప. ఆ తర్వాత కార్తీక్ ని కలసి అక్కడకు రావాలని కోరుతుంది. నేనెందుకు రావాలని అడిగితే..ఈ రోజు నేను వేయబోయే నాటకం చూస్తే నా భర్త ఎవరో మీకు తెలుస్తుంది అని చెబుతుంది..అయితే వస్తానంటాడు కార్తీక్...

Published at : 24 Sep 2022 08:32 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Serial September 24 Karthika Deepam 1466 Episode

సంబంధిత కథనాలు

Sankranti 2023 Telugu Movies : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?

Sankranti 2023 Telugu Movies : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?

Gruhalakshmi December 1st: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్

Gruhalakshmi December 1st: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్

Janaki Kalaganaledu December 1st: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్

Janaki Kalaganaledu December 1st: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్

Bigg Boss 6 Telugu Episode 88: ఫస్ట్ ఫైనలిస్టుగా ఆదిరెడ్డి? ఓటమిని తీసుకోలేకపోయిన రేవంత్

Bigg Boss 6 Telugu Episode 88: ఫస్ట్ ఫైనలిస్టుగా ఆదిరెడ్డి? ఓటమిని తీసుకోలేకపోయిన రేవంత్

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!