News
News
X

Karthika Deepam October 7th Update: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు

కార్తీకదీపం అక్టోబరు 7 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క

FOLLOW US: 
 

Karthika Deepam October 7th Episode 1477 (కార్తీకదీపం అక్టోబరు 7 ఎపిసోడ్)

శౌర్య వాళ్ల  పిన్ని బాబాయ్ తో టిఫిన్ తినేందుకు వస్తుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే..సంగారెడ్డిలో దసరా వేడుకలు బాగా జరుగుతాయి అక్కడకు వెళదాం అంటారు. అయితే అమ్మానాన్నలు కనిపించే అవకాశం ఉందా అని అంటుంది శౌర్య ఆ వెంటనే మోనిత వాళ్ళ బాడీలకు పోస్టుమార్టం చేశాను అన్న మాటలు గుర్తొచ్చి ఇంక వాళ్ళు కనిపించరు లెండి అని నిరాశ చెందుతుంది. మరోవైపు దీప అదే హోటల్లో వాళ్ల అమ్మ,అన్నయ్యతో వస్తుంది. అప్పుడు దీప వాళ్ళ అమ్మ, మోనిత సంగారెడ్డి కే కార్తీక్ బాబుని తీసుకెళ్తుంది అని నీకు ఎలా తెలుసు అని అనగా, డాక్టర్ బాబుని బయటకు తీసుకురావాలంటే ఏదో ఒక మంచి కారణమే అది వెతుకుని ఉంటాది. డాక్టర్ బాబుకి ఇదే మన ఊరు అని చెప్పింది, సంగారెడ్డిలో దసరా బాగా అవుతుంది అంతకన్నా మంచి కారణం ఇంకేం ఉంటుంది అంటుంది.

శౌర్య వాళ్ళ బాబాయ్ దీపను చూసి ఆటో ఎక్కిన సంగతి గుర్తుతెచ్చుకుని అక్కడికి వచ్చి పలకరిస్తాడు. అప్పుడు దీప అతనిని గుర్తుపట్టి, ఆరోజు మీరు నాకు చాలా సహాయం చేశారు ధన్యవాదాలు అని వాళ్ళ అన్నయ్యకి, అమ్మకి పరిచయం చేస్తుంది. ఇంతలో శౌర్య,బాబాయ్ త్వరగా రా అని అంటుంది. శౌర్య గొంతు విన్న దీప వెనక్కి చూసి శౌర్య గొంతులా ఉంది అనుకుంటుంది. కానీ వెనక్కి తిరిగే సమయానికి అనుకోకుండా శౌర్యని కవర్ చేసి నిల్చుంటాడు సూర్యుడు. ఇంతలో దీప మీ అమ్మాయి పేరేంటని అడిగితే జ్వాల అని చెబుతాడు సూర్యుడు. వెళ్లిన తర్వాత ఇంతసేపు ఎవరితో సోదేస్తున్నావు అని చంద్రమ్మ అడగడంతో మొన్న ఆటోలో అని మాట పూర్తికాకముందే శౌర్య..గుర్తుపట్టిన ప్రతి వాళ్ళతో వెళ్లి మాట్లాడడమేనా మేము ఆర్డర్ పెట్టేసాము మీరు ఆర్డర్ చెప్పండి అంటుంది. 

Also Read: అప్పుడే ప్రేమ అంతలోనే కోపం, రిషిధార గమ్యం ఏంటో మరి!

News Reels

శౌర్య చేతులు కడుక్కోడానికి వెళ్తున్నప్పుడు చంద్రమ్మ దీప చూసి గుర్తుపట్టి అక్కడికి వెళ్లి అమ్మ ఒకరోజు బస్సులో మీరు మా అమ్మాయికి మంచినీళ్లు బాటిల్ కొనిచ్చారు గుర్తుపట్టారా అని తిరిగి డబ్బులు ఇస్తుండగా, నేను అప్పుడే చెప్పాను కదా అమ్మ. అమ్మలాంటి దాన్ని ఇచ్చాను అని మళ్ళీ ఎందుకు డబ్బులు అని అనగా అదే సమయంలో శౌర్య, పిన్ని త్వరగా రా అని అంటుంది. వస్తున్నాను అని చంద్రమ్మ వెళ్తుంది. అప్పుడు దీప వాళ్ళ పిన్ని బాబాయ్ లతో అచ్చు మా శౌర్య గొంతులాగే ఉంది అంటే...తను ఇక్కడ ఎందుకుంటుంది, అమెరికాలో ఉంటుందని అంటారు దీప వాళ్ల అమ్మ, అన్నయ్య.

ఆ తర్వాత దీప హ్యాండ్ వాష్ కి వెళుతున్నప్పుడు శౌర్య చూస్తుంది. వెనుకనుంచిచూసి అచ్చం అమ్మలానే ఉందనుకుని లేచి వెళ్లబోతూ మోనిత మాటలు గుర్తొచ్చి ఆగిపోతుంది. ఎక్కడికమ్మా అని చంద్రమ్మ  అడగడంతో అమ్మను మర్చిపోలేక పోతున్నాను పిన్ని. ఇప్పుడు అమ్మలాగే ఒకరు కనిపించారు కానీ అమ్మా వాళ్లు లేరు కదా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దీప, వాళ్ళ అమ్మ,అన్నయ్య తో హోటల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. 

అప్పుడు దారిలో ఓ పోస్టర్ చూసి దీప వాళ్ళ అన్నయ్య ఈవిడ మా పిన్ని గారు రాజ్య లక్ష్మి అమ్మ. ఈవిడ మాటకి ఊర్లో చాలా విలువ గౌరవం ఉన్నాయి. ఈవిడ మాట ఈ ఊర్లో ఎక్కడైనా చెల్లుతుంది అంటుంది. అలా అయితే మొన్న మోనిత ఆ ఊరు వాళ్ల చేత నన్ను దోషిగా నిలబెట్టిన విషయం చెప్తే మనకు సపోర్ట్ చేస్తారా అని అడుగుతుంది. తప్పకుండా చేస్తారు కానీ ఆవిడ ఎవ్వర్నీ అంత తొందరగా నమ్మరు అంటాడు. అప్పుడు దీప ఆ బతుకమ్మ తల్లి మనల్ని కాపాడాలి అంటుంది. మరోవైపు శౌర్య వాళ్ళ ఆటో దీప వాళ్ళ కార్ ని దాటుకుంటూ వెళ్తుంది. అప్పుడు దీప నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి బండిని నెమ్మదిగా నడపాల్సిన అవసరం లేదు అన్నయ్య... ఆటో కూడా మనల్ని దాటేసింది అంటుంది.అటు శౌర్య కూడా కారుతో పోటీపడుతుంది. కారు దాటిన వెంటనే చేయి బయట పెట్టి వెక్కిరిస్తుంది. ఆటోలో అంత స్పీడ్ వెళ్లడం మంచిది కాదు కదా అని అన్నయ్య అంటే..చిన్నపిల్ల కదా అన్నయ్య వదిలేయ్ లే మనం నెమ్మదిగానే వెళ్దాం..వాళ్లు గెలిచారు అనుకుని వేగం తగ్గిస్తారంటుంది దీప. ఇప్పుడు ఎక్కడికి అని అడిగితే మా పిన్ని దగ్గరకే అంటాడు అన్నయ్య.

Also Read: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

మరోవైపు మోనిత, కార్తీక్ కారు ఆపగా అక్కడ ఒక నేత్రదాన శిబిరం ఉంటుంది. అప్పుడు కార్తీక్ కిగతం గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మోనిత,ఎక్కడికి వెళ్లినా నాకు ఆటంకాలు ఆగడం లేదు ఎందుకు ఇప్పుడు కార్తీక్ కి ఏదైనా గుర్తొస్తుందా అని భయపడుతుంది. అప్పుడు కార్తీక్ మోనిత తో మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చామా? నేనిక్కడ ఎవరినో కలిసినట్టు అనిపిస్తోంది. మనం లోపలికి వెళ్లి నేత్రదానం చేద్దామని కార్తీక్ అనగా మోనిత,బయట పేరు చూశాడు అంటేనే ఏదో గుర్తొస్తుంది అన్నాడు. లోపలికి వెళ్తే ఏదైనా గుర్తొచ్చే అవకాశం ఉందా అని అనుకుని వద్దులే కార్తిక్ అనేస్తుంది. కార్తీక్ మాత్రం లోపలకు తీసుకెళతాడు.. ఆ వెనుకే దీప వాళ్ల కారు, ఆ వెనుకే శౌర్య ఆటో వచ్చి ఆగుతాయి. నేను లోపలకు వెళతానని శౌర్య అనడంతో నువ్వు చిన్నపిల్లవు కదమ్మా వాళ్లు తీసుకోరని అంటాడు చంద్రుడు..అయితే నువ్వెళ్లి ఇవ్వు బాబాయ్ అంటుంది.

అదే సమయంలో దీప వాళ్ళు కార్తీక్ దగ్గరకు వెళ్తారు. అప్పుడు మోనిత అప్లై చేస్తూ ఉండగా, కార్తీక్ భార్య అని రాయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఇదే నా జీవితం గమ్యం అని రాయడం మొదలుపెట్టేసరికే దీప అక్కడికి వస్తుంది. 
ఎపిసోడ్ ముగిసింది..

రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
రాజ్యలక్ష్మి అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది.వంటలక్కది ఇదే ఊరు అని చెప్పింది కదా ఇల్లెక్కడో అంటాడు కార్తీక్. అసలు ఆ మాటే ఎత్తొద్దన్నాకదా అని మోనిత ఫైర్ అవుతుంది ఇంతలో దీప అక్కడకు వస్తుంది...

Published at : 07 Oct 2022 09:52 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Serial October 7th Karthika Deepam Episode 1477

సంబంధిత కథనాలు

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్  శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Urvasivo Rakshasivo OTT Release : ఆహా ఓటీటీలోకి 'ఊర్వశివో రాక్షసివో' - రిలీజ్ ఎప్పుడంటే?

Urvasivo Rakshasivo OTT Release : ఆహా ఓటీటీలోకి 'ఊర్వశివో రాక్షసివో' - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Amararaja Telangana : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Amararaja Telangana :  తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !