సూర్యగ్రహణం - ఈ రాశుల వారిపై ప్రభావం



అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఉంది. దీని ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. అయితే కొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో ఏ రాశుల వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలంటే...



తులా రాశి
ఈ గ్రహణం సమయంలో సూర్యుడు ఈ రాశిలో ఉంటాడు కాబట్టి ఈ రాశిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆ రోజు ఈ రాశివారు తలపెట్టిన పనులు నష్టానికి దారితీస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గుండె సంబంధిత సమస్యలున్న రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.



వృషభ రాశి
సూర్యగ్రహణం ప్రభావం ఈ రాశులవారిపైకూడా ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనవసర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది..వాహనం నడిపేవారు జాగ్రత్త.ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉండే మార్గాలు వెతుక్కోవడం మంచిది.



మిథున రాశి
మిథున రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటే ఇదే మంచి అవకాశం. ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఆధ్యాత్మిక పరంగా ఖర్చులు పెరుగుతాయి. మీకు కొంత ఆర్థిక నష్టం ఉండొచ్చు.



కన్యా రాశి
సూర్యుడు కన్యారాశికి పన్నెండో స్థానంలో సంచరిస్తున్నాడు. సూర్యగ్రహణం సమయంలో విదేశీ ప్రయాణాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎగుమతి-దిగుమతుల వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవచ్చు. వైద్య ఖర్చులు పెరిగే అవకాసం ఉంది.పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.



వృశ్చిక రాశి
ఈ రాశివారికి రెండో ఇంట సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ సమయంలో మీ మాటపై చాలా ప్రభావం ఉంటుంది. కుటుంబం, ఆదాయం వంటి విషయాల్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఉంటాయి. మాటతీరు మార్చుకోవడం మంచిది.



శ్రీ శుభకృత్ నామసంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారం అక్టోబరు 25వ తేదీ స్వాతి నక్షత్రం రెండో పాదంలో కేతుగ్రస్త సూర్యగ్రహణం సాయంత్రం దాదాపు 5.03 నిముషాలకు ప్రారంభమవుతుంది.



స్పర్శ కాలం సాయంత్రం - 5 గంటల 3 నిముషాలు
మధ్య కాలం సాయంత్రం - 5 గంటల 28 నిముషాలు



మోక్ష కాలం సాయంత్రం - 5 గంటల 35 నిముషాలు
ఆద్యంత పుణ్యకాలం 32 నిముషాలు