అక్టోబరు 6 రాశిఫలాలు



మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి, అందుకు తగిన ఆదాయం కూడా ఉంటుంది. మీ అతిథులతో చెడుగా ప్రవర్తించవద్దు. మీ ప్రవర్తన కుటుంబ సభ్యులను బాధపెడుతుంది. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.



వృషభ రాశి
ఈ రోజు మీరు స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఫీలవుతారు. చాలా రోజులుగా కార్యాలయంలో నిలిచిపోయిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. ప్రేమవ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.



మిథున రాశి
స్నేహితులు, ప్రియమైన వారితో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థికంగా మీరు ఉన్నతంగా ఉంటారు. కుటుంబం , స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.



కర్కాటక రాశి
ఈ రోజు పనిభారం మీకు చికాకును తెప్పిస్తుంది. ఆర్థిక పథకాల్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఓసారి ఆలోచించి అడుగేయండి. రోజు ఉదయం నుంచి కాస్త డల్ గా ఉన్నా సాయంత్రం ఓ శుభవార్తవింటారు..మీ సంతోషం పెరుగుతుంది.



సింహ రాశి
ఇంటి పెద్దల ఆశీస్సులతో ఏదైనా తలపెడితే సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది. ఆఫీసులో కొన్ని కొత్త బాధ్యతలు మీ భుజాలపై పడవచ్చు. విద్యార్థులు చదువులో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. పాత స్నేహితుడిని కలుసుకోవచ్చు



కన్యా రాశి
మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్నేహితుని రాకతో ఆనందం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.



తులా రాశి
పెట్టుబడికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇంకొన్ని రోజులు ఆగడం మంచిది. మీరు ఎప్పటినుంచో నమ్ముతున్నది నిజంగా నమ్మదగినది కాదని తెలుసుకుని ఈరోజు మీరు చాలా బాధపడతారు.



వృశ్చిక రాశి
ఈ రోజు ప్రయాణాలు సాగుతాయి. ఆఫీసు పని కోసం బయటకు వెళ్ళవలసి రావచ్చు, ఈ రోజంతా బాగుంటుంది. ఇంటికి దూరపు బంధువు రాక సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు తలపెట్టే పనులకు మీ భాగస్వామి మద్దతు ఉంటుంది.



ధనుస్సు రాశి
మీరు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయం కాదు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు మీ స్నేహితుల మద్దతు లభిస్తుంది.



మకర రాశి
ఓ సమస్య నుంచి బయటపడాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలని తెలుసుకోవడం మంచిది. ఇతరులను ఆకట్టుకోవడానికి అదనపు డబ్బు ఖర్చు చేయకండి. మీ వ్యక్తిత్వానికి కొందరు ఆకర్షితులవుతారు.



కుంభ రాశి
ఈ రోజు అదృష్టం మీకు కలిసొస్తుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. ధనలాభంతో పాటు ఆనందం కూడా ఉంటుంది. వివాహితులకు ఈరోజు అనుకూలమైన రోజు. శ్రమకు తగిన విజయం లభిస్తుంది.



మీన రాశి
ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన ప్రణాళికను వేస్తారు. మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాల కారణంగా మీ మానసిక ఆందోళన పెరుగుతుంది. మీ మంచి ప్రవర్తన ఇతరులను ఆకట్టుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.