మేష రాశి అక్టోబర్ నెల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. మీ మాటతీరుపై మీకు నియంత్రణ లేకుంటే చాలామందితో విభేదాలు రావొచ్చు. కెరీర్లో చిన్న సమస్య ఎదురైన తర్వాత అనుకున్న సక్సెస్ అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు పరిశోధించి ముందుకు సాగాలి.
వృషభ రాశి అక్టోబర్ నెల ప్రారంభం వృషభ రాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు ముగింపు దశకు వస్తాయి. భూమి , భవన నిర్మాణ పనిలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మిథున రాశి ఈ నెలలో మీరు వాహనం లేదా స్థిరాస్తి ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో పరస్పర సమన్వయం పెరుగుతుంది. తొందరపాటుతో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే చిక్కుకుపోతారు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కర్కాటక రాశి అక్టోబర్ మొదటి వారం కర్కాటక రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు శుభఫలితాలున్నాయి. నెల మధ్యలో అకస్మాత్తుగా ఖర్చులు పెరగొచ్చు. కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేయవలసి రావొచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.
సింహ రాశి అక్టోబర్ నెలలో సింహరాశివారు శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాలు విజయవంతమవుతాయి. కోర్టు-కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. అధికారుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
కన్యా రాశి కన్యారాశి వారికి అక్టోబర్ మాసంలో మిశ్రమ ఫలితాలున్నాయి. శారీరక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆహారంపై అశ్రద్ధ చూపొద్దు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అధిక ప్రసంగం తగ్గించుకుంటే మంచిది... అప్పుడే వారు కోరుకున్న ప్రయోజనాలను పొందుతారు.
తులా రాశి తులారాశి వారికి గడిచిన నెలల కన్నా అక్టోబరు కలిసొస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు సీనియర్ అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నెలాఖరు నాటికి, పని వేగం మందగించవచ్చు. ఎలాంటి వివాదాల్లో చిక్కుకోవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి అక్టోబర్ నెల ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వ్యాపారులు అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలను పొందుతారు. పెట్టిన పెట్టుబడులు ప్రస్తుతం లాభదాయకంగా ఉంటాయి. అవివాహితులు వివాహానికి సంబంధించిన శుభవార్త వింటారు.
ధనస్సు రాశి ధనస్సు రాశివారికి అక్టోబర్ అంత అనుకూలంగా లేదు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతాయి. పలుకుబడి ఉన్న వ్యక్తి సహాయంతో ఒక పెద్ద ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఉంటుంది మీ ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది.
మకర రాశి అక్టోబర్ నెల ప్రారంభం మకర రాశివారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాల వల్ల బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంట్లో ఒక వ్యక్తి కారణంగా డిస్ట్రబెన్స్ ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.
కుంభ రాశి కుంభ రాశి వారికి నెల ప్రారంభంలో కొన్ని వ్యాపార సమస్యలను ఎదుర్కొంటారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీలు, పెట్టుబడుల సమయంలో జాగ్రత్తగా ఉండండి. వివేకం, విచక్షణతో నిర్ణయాలు తీసుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మీన రాశి మీన రాశివారికి అక్టోబర్ లో శుభవార్తలు వింటారు. మీ మనస్సుకు అనుగుణంగా పనులు పూర్తవుతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. విదేశీ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు కోరుకున్న ప్రయోజనాలుంటాయి. కుటుంబంలో ఓ శుభకార్యం నిర్వహిస్తారు.