Karthika Deepam మార్చి 4 ఎపిసోడ్: నువ్వు నటివి అయితే నేను మహానటిని, మోనితకి విశ్వరూపం చూపించిన సౌందర్య

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 4 శుక్రవారం 1291 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం మార్చి 4 శుక్రవారం ఎపిసోడ్ 

దత్తత డ్రామా
బాబుని దత్తత ఇస్తున్నారన్న విషయం మోనిత ద్వారా తెలుసుకున్న కార్తీక్..సౌందర్యని ప్రశ్నిస్తాడు. పిల్లలు లేని దంపతులు కనిపించారు వాళ్లకు ఆనంద్ ని దత్తత ఇవ్వాలని అనిపించింది అంటుంది. దత్తత ఇవ్వడానికి మీరెవరు, తీసుకునేందుకు వాళ్లెవరన్న మోనిత ప్రశ్నకు... మధ్యలో నీకేంటని ప్రశ్నిస్తుంది. ఇది కెరక్ట్ కాదు..ఈ దత్తతని నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని మోనిత అంటే.. ఈ దత్తతని నేను ఒప్పుకోను అంటుంది. నువ్వెవరే ఒప్పుకోవడానికి అంటే నేను ఆ బాబు కన్నతల్లిని ని అందరిముందూ చెప్పకతప్పలేదు మోనితకి. అప్పటికీ షాక్ లో ఉన్న కార్తీక్.. మోనితా నీకు మతిపోయిందా అంటాడు. ఈ ఆనంద్ నా కొడుకు, మన బాబు అని క్లారిటీ ఇస్తుంది. మమ్మీ, దీప తనేం మాట్లాడుతుందో విన్నావా అని క్వశ్చన్ చేస్తాడు కార్తీక్. అవును కార్తీక్ తను నిజం చెబుతోంది ఆనంద్ మోనిత బిడ్డే..ఈ విషయం తన నోటి నుంచి తనే ఒప్పుకోవాలని ఈ దత్తత నాటకం ఆడానని క్లారిటీ ఇస్తుంది సౌందర్య. 

సౌందర్య
ఇదంతా నాటకమా అన్న మోనితతో..తెలివితేటలు నీకే ఉన్నాయా నీ బిడ్డ మా ఇంట్లోనే ఉన్నాడని తెలిసి కూడా కార్తీక్ ను ఇబ్బంది పెడుతూ దగ్గరవ్వాలని ప్లాన్ వేస్తూ... నీ బిడ్డని వెతికి ఇవ్వాలని కార్తీక్ కి మళ్లీ చెబుతావా...ఏంటి నాటకాలా, ఇంకా ఎన్నాళ్లు మా ఫ్యామీలీతో ఆడుకుంటావ్.. బాబుని మేము ఎవ్వరినీ దత్తతకు ఇవ్వడం లేదు...నిన్ను ఇక్కడకు రప్పించాలనే కార్డులు ప్రింట్ చేసి బస్తీవాసులకు ఇచ్చి వచ్చాను. ఆ విషయం నీకు తెలుస్తుందని, నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు...అందుకే దత్తత అనే నాటకం ఆడాను. నువ్వు మామూలు నటివి అయితే నేను మహా నటిని... తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు...భగవంతుడా నన్ను క్షణించు...నీ సన్నిధిలో ఈ రకంగా అయినా ఓ మంచి పని జరుగుతోంది అంటుంది.

Also Read: రిషి-వసు మధ్య మాటల యుద్ధం, జగతి విషయంలో స్ట్రాంగ్ గా నిలబడిన మహేంద్ర
ఆనంద్ మోనిత కొడుకేంటి..మీరు ఏం మాట్లాడుతున్నారని కార్తీక్ అంటాడు. ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది సారీరా పెద్దోడా...బాబు మనింట్లో ఉన్నాడని తెలిసినా, ఆ వంకతో నీతో తిరగాలని , కొన్నాళ్లయ్యాక ఈ బాబుని అడ్డుపెట్టుకుని నిన్ను ఇరికించాలని ప్లాన్ చేసుకుందని అసలు విషయం బయటపెడుతుంది సౌందర్య. బాబు మీద మనం అందరం అభిమానం పెంచుకున్నాక, వాడిని ఇవ్వమని అడిగి రచ్చ చేద్దామని ప్లాన్ చేసుకుందంటుంది. స్పందించిన కార్తీక్ తన బిడ్డ మన దగ్గరకు ఎలా వస్తాడంటూ ప్రశ్నిస్తాడు. తాడికొండలో ఉన్న కోటేష్ హైదరాబాద్ వచ్చి మోనిత బిడ్డని కార్లోంచి ఎత్తుకెళ్లాడని సౌందర్య చెబుతుంది. అవును డాక్టర్ బాబు బిడ్డని దత్తత తీసుకున్నానని కోటేష్ మనకి అబద్ధం చెప్పాడని దీప మరింత క్లారిటీ ఇస్తుంది. కోటేష్ బిడ్డని దొంగిలించిన వీడియో నీకు చూపించవద్దని రత్నసీతకు ఈ మోనిత ఆదేశాలు జారీ చేసింది. రత్నసీతకు వీడియో చూపించవద్దని నేనెందుకు చెబుతాను అంటుంది మోనిత.ఆ పక్కనే ఉన్న రత్నసీతను పిలిచిన సౌందర్య..ఆమెతో నిజం చెప్పిస్తుంది. ఆనంద్ మోనిత బిడ్డే అని నాకు-దీపకు ఆలస్యంగా తెలిసింది..దీని కుట్ర బయటపెట్టాలనే పూజ అని అబద్ధం చెప్పి ఇక్కడకు తీసుకొచ్చానంటుంది. ఆ తర్వాత రత్నసీత ఫోన్లో కోటేష్ బిడ్డని ఎత్తుకెళ్లిన వీడియో చూస్తాడు కార్తీక్. మీరు అడిగితే లేదని చెప్పమని మోనిత చెప్పింది సార్...కానీ అబద్ధం చెప్పలేక దీపక్క వస్తే ఈ వీడియో చూపించానని చెబుతుంది రత్నసీత. 

మోనితకి చెంపదెబ్బ
 అందరి మాటలూ విన్నాక స్పందించిన మోనిత...నేను నా బిడ్డని అడ్డం పెట్టుకుని ప్లాన్ చేశాను...అయితే ఏంటట అనగానే సౌందర్య చెంప చెళ్లుమనిపిస్తుంది. ఎందుకు పుట్టావే నువ్వు...మా ఫ్యామిలీకి నరకం చూపించడానికా..అసలు నువ్వు ఆడదానివేనా..ఎన్నిసార్లు తిట్టినా-కొట్టినా-జైలుకి వెళ్లొచ్చినా నీకు బుద్ధి రాలేదా... ఇంత చేసి ఇన్ని నాటకాలు ఆడి పసివాడిని అడ్డం పెట్టుకుని ప్లాన్ వేశావ్...నిజం తెలిసాక కూడా అయితే ఏంటంట అంటున్నావా..ఛీఛీ... నీ బిడ్డను నీకిచ్చేస్తే కార్తీక్ జోలికి రానన్నావంట కదా.. కార్తీక్ ని వదిలేసి వెళ్లిపోతాను అన్నావంట కదా అంటూ బాబుని తీసుకెళ్లి మోనిత చేతిలో పెడుతుంది సౌందర్య. నీ కొడుకును తీసుకువెళ్లు అని సౌందర్య అంటే..కార్తీక్, దీప బాధపడతారు. మీరెవ్వరూ ఏం మాట్లాడొద్దు...మధ్యలో అడ్డురాకండి..ప్రేమని అడ్డుపెట్టుకుని గేమ్స్ ఆడటం దీనికి అలవాటు... మనం బాబుని ఇవ్వలేమని దీని ధైర్యం అన్న సౌందర్య... ఆఖరి సారిగా చెబుతున్నాను విను.. నువ్వు అన్నట్టే నీ బిడ్డని నీకిచ్చేశాను...నువ్వు ఎప్పటికీ మా ఇంటివైపు చూడకు..నీ బిడ్డ ఎప్పటికీ మా ఇంటి వారసుడు కాడు, కాలేడు. నువ్వు ఎప్పటికీ మా ఇంటి కోడలిగా రాలేవు కాలేవు..నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, ఒక మనవడు, ఇద్దరు మనవరాళ్లు..ఇదే నా ఫ్యామిలీ అని స్ట్రాంగ్ గా చెబుతుంది. చూశారు కదా అందరూ..దీనితో దీని కొడుకుతో మాకు ఎలాంటి సంబంధం లేదు... పిలవగానే అందరూ వచ్చినందుకు నమస్కారం అంటుంది. పదండిలా ఈ రోజుతో మనకు పీడ పోయిందని సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆనంద్ ని చూస్తూ బాధగా దీప-కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. 

Also Read: అడ్డంగా నరికేస్తానంటూ ఫ్యాక్షన్ డైలాగ్ పేల్చిన వంటలక్క, తమ్ముడి కోసం హిమ వీరంగం
బొమ్మలు, పాలసీసా పట్టుకుని మేడపైనుంచి దిగొచ్చిన హిమ..అమ్మా తమ్ముడు ఎక్కడా కనిపించడం లేదేంటని అడుగుతుంది. అందర్నీ అడుగుతుంటే... తమ్ముడిని వాళ్ల బంధువులు వచ్చి తీసుకెళ్లారని చెబుతుంది సౌందర్య. షాక్ అయిన హిమ.. తీసుకెళ్లడం ఏంటి, తమ్ముడికి బంధువులు ఎవ్వరూ లేరుకదా, అయినా మీరెలా ఇస్తారు, అమ్మా తమ్ముడిని ఎవరికి ఇచ్చారు మనం వెళ్లి తెచ్చుకుందాం పద, డాడీ తమ్ముడిని తెచ్చుకుందాం పదండి, శౌర్య నువ్వు మాట్లాడవేంటి తమ్ముడు వెళ్లిపోతే నీకు బాధగా లేదా... నాకు తమ్ముడు కావాలి, నాకు ఆనంద్ కావాలి అంటూ నేలపై కూర్చుని ఏడుస్తుంది. సముదాయించేందుకు దీప ప్రయత్నించినా...నాకేం చెప్పొద్దు, నేను విననంటుంది.

Published at : 04 Mar 2022 08:50 AM (IST) Tags: karthika deepam latest episode కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Nirupam Paritala premi viswanathSobha Shetty Karthika Deepam 4th March Episode 1291

సంబంధిత కథనాలు

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్