Karthika Deepam మార్చి 3 ఎపిసోడ్: అడ్డంగా నరికేస్తానంటూ ఫ్యాక్షన్ డైలాగ్ పేల్చిన వంటలక్క, తమ్ముడి కోసం హిమ వీరంగం

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 3 గురువారం 1290 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం మార్చి 3 గురువారం ఎపిసోడ్

మోనిత బస్తీలో చీరలు పంచుతుంటుంది. పండుగలకు చీరలు పంచడం కొందరికే అలవాటు, నేను కూడా ఓ పండుగకే మీకు చీరలు పంచుతున్నా అంటుంది. ఈరోజు ఏం పండుగంటే నా కార్తీక్ నా ఇంటికి వచ్చాడు, నా ఇంట్లో కాలు పెట్టాడు, అంతకన్నా గొప్ప పండుగ ఏం ఉంటుంది అంటూ పెద్ద లెక్చర్ ఇస్తుంది. కార్తీక్ దీపకు మాత్రమే కాదు..నాక్కూడా మొగుడే అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన దీప లాగిపెట్టి చెంపపై కొడుతుంది.  మళ్లీ అను ఆ మాట..నీకు మతిపోయిందా ఏంటి..డాక్టర్ బాబు ఇంటికొస్తే మొగుడైపోతాడా, నువ్వు చీరలు పంచేస్తావా, పిచ్చిపిచ్చి వేషాలేస్తే పీకపిసికి చంపేస్తా...అడ్డదారిలో బిడ్డను కన్నావ్, అడ్డుగోలుగా మాట్లాడుతున్నావ్,అడ్డంగా నరికేస్తాను జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. 

Also Read: ఎనీ క్వశ్చన్స్ అంటూ మహేంద్ర ఆవేశం, జగతి మౌనం - బుధవారం ఎపిసోడ్ అదిరింది
తనంతట తానే తాళి కట్టుకుంది, అడ్డదారిలో బిడ్డను కంది, బిడ్డను పోగొట్టుకుంది, జైలుకెళ్లి వచ్చింది..ఇదీ ఈవిడగారి చరిత్ర అని చెబుతుంది దీప. కార్తీక్ తో నేను డీల్ పెట్టుకున్నా...అనుకున్న ప్రకారం నా బిడ్డను తిరిగి తెచ్చి ఇవ్వాలి...ఇవ్వకపోతే చాలా జరుగుతాయ్ దీపక్కా...నా బిడ్డను నాకిచ్చేవరకూ నేను వెళ్లిపోయేవరకూ కార్తీక్ నావాడే అనుకుంటానని మోనిత అంటే...బురదలో రాయి వేస్తే ఇలానే ఉంటుందని దీప...నేను బురదను కాదు అందులో తామరపువ్వుని  అంటుంది మోనిత. నా బిడ్డను వెతకండి లేదంటే నీ ఇంట్లో ఉన్న బిడ్డను ఇవ్వండి అని అడుగుతుంది మోనిత. నీ తోక ఎలా కత్తరించాలో నాకు తెలుసు, నీ సంగతి చూడకపోతే నా పేరు దీపే కాదంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

దీపకు ధైర్యం చెప్పి బస్తీకి వెళ్లిన సౌందర్య
నా కొడుకు దొరక్కపోతే మీ ఇంట్లో పెంచుకుంటున్న బాబుని నాకివ్వండన్న మోనిత మాటలు తలుచుకుంటూ ఆలోచనలో పడతాడు కార్తీక్. పెద్దోడా ఏం ఆలోచిస్తున్నావ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన సౌందర్య ఏవీ ఆలోచించకు, జరగాల్సింది జరుగుతుంది, కష్టాలు వచ్చినప్పుడే మన ధైర్యం ఏంటో తెలుస్తుంది, మొండిగా ఎదిరించాలంటుంది. ఒకసారో రెండుసార్లో కష్టాలొస్తే ఎదిరించవచ్చు మమ్మీ కానీ నాకేంటి నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉందంటూ వెళ్లిపోతాడు. కార్తీక్ దీపకు మొగుడే కాదు నాక్కూడా మొగుడే అన్న మోనిత మాటలు తలుచుకుంటూ ఏడుస్తూ వస్తున్న దీపని సౌందర్య, ఆనందరావు ఓదార్చుతారు. ఇప్పుడే బస్తీకి వెళ్లివచ్చానంటూ అక్కడ మోనిత హడావుడి మొత్తం చెబుతుంది. అన్నీ తెలిసి కావాలని బిడ్డను అడ్డం పెట్టుకుని మనల్ని ఆడిస్తోంది అత్తయ్య, నా బతుకేంటి ఇలా అయిపోయిందని బాధపడుతుంది. మనం ఏమీ చేయలేమా సౌందర్య అన్న ఆనందరావు ప్రశ్నకు సమాధానంగా... దీపా ఏడవొద్దు ఈ సౌందర్య ఉండగా నీకు భయం లేదని భరోసా ఇస్తుంది. బస్తీకి వెళ్లిన సౌందర్య...తాడికొండ నుంచి దీప-కార్తీక్ తీసుకొచ్చిన బాబుని పిల్లలు లేనివారికి దత్తత ఇస్తున్నాం, ఈ కార్యక్రమం గుళ్లో చేస్తున్నాం అందరూ రావాలి అని పిలిచి వెళ్లిపోతుంది. అరుణ నువ్వు మోనిత ఇంట్లో పనిచేస్తున్నావ్ కదా అని అడిగితే..డబ్బులిస్తోందమ్మా అంటుంది అరుణ. మోనిత ఇంటివైపు చూస్తూ సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

సౌందర్య-కార్తీక్
కట్ చేస్తే రెడీ అయిన కార్తీక్ బయటకు వెళ్లేందుకు బయలుదేరుతాడు....పొద్దున్నే ఎక్కడికి అంటే...బయట కొంచెం పనిఉంది మమ్మీ అది చూసుకుని హాస్పిటల్ కి వెళతానంటాడు. ఏం పనిపై వెళుతున్నావ్ అని సౌందర్య అడిగితే.. మిస్సైన పిల్లలకు సంబంధించి ఓ వ్యక్తి  సమాచారం ఇస్తాడని మోనిత చెప్పింది..ఇద్దరం కలసి అక్కడకు వెళుతున్నాం అని చెబుతాడు. వెంటనే స్పందించిన సౌందర్య..నువ్వు బయటకు వెళ్లడానికి వీల్లేదు..గుళ్లో పూజ చేయిస్తున్నాం నువ్వు వస్తున్నావ్ అంతే చెప్పేసి వెళ్లిపోతుంది. ఏంటి దీపా ఇది అని అడిగినా దీప కూడా సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది.

Also Read: కార్తీక్ ముందు మరోసారి బయటపడిన మోనిత నిజస్వరూపం
మోనిత ఆవేశం
వాళ్లింట్లో ఉన్న పిల్లాడిని ఎవరికో దత్తత ఇస్తున్నారంట అందర్నీ గుడికి రమ్మని చెప్పారని లక్ష్మణ్ చెప్పడంతో..మోనిత ఆవేశంగా ఆ ఇన్విటేషన్ కార్డ్ చింపేస్తుంది. అసలేం జరుగుతోంది, కథ ఇలా అడ్డం తిరిగింది..మా బాబు, మా మనవడు, మా తమ్ముడు అంటూ చిలకపలుకులు పలికి ఇప్పుడు దత్తత ఇవ్వడానికి ఎందుకు సిద్ధమయ్యారు, ఇన్నాళ్లూ అంత ప్రేమ చూపించిన వారు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు...ఏదైనా ప్లాన్ చేస్తున్నారా....నేను నా బిడ్డను అడ్డం పెట్టుకుని కార్తీక్ కి దగ్గరవ్వాలని ప్లాన్ చేసుకుంటే ఈ దత్తత ఏంటి...అయినా నా బిడ్డని దత్తత ఇవ్వడానికి వీళ్లెవరు, ఇప్పుడు నేను వెళ్లి నా బిడ్డ అని చెప్పలేను, మానలేను..అయినా నా కొడుకుని దత్తత ఎలా ఇస్తారో చూస్తాను, వీళ్ల సంగతి తేలుస్తాను అంటూ ఆవేశంగా బయలుదేరుతుంది. 

గుడికి వెళ్లిన సౌందర్య..వారణాసిని పిలిచి ఏర్పాట్లు సరిగానే జరుగుతున్నాయా, బస్తీవాసులంతా వచ్చారా అంటుంది. పిల్లలు ఏరి మేడం అని అడిగిన వారణాసితో ఆదిత్యతో కలసి స్కూల్ కి వెళ్లారని చెబుతుంది.  ఇంతకీ ఏం పూజ చేస్తున్నారని కార్తీక్ అడిగితే...ఏ పూజ అయినా అందరి మంచి కోసమే చేస్తాం కదా పద అంటుంది. మాతో పాటూ గుడికి రావడం మొదటిసారి కదా అంటూ ఆనంద్ ని ముద్దులాడుతూ గుడికి వెళతాడు. బస్తీవాళ్లంతా వచ్చారెందుక అని అడిగితే.. ఓ మంచిపని చేసేటప్పుడు అందర్నీ పిలవడం మంచిదే కదా అని నేను రమ్మన్నాను అంటుంది. ఓ వైపు పూజ జరుగుతుంటే..మరోవైపు మోనిత ఆవేశంగా వచ్చి ఆపండి అని అరుస్తుంది. (తన పథకం నెరవేరుతున్నందుకు సౌందర్య ముఖంలో సంతోషం కనిపిస్తుంది). 

మోనిత-కార్తీక్-సౌందర్య
 పీటలపై కార్తీక్ దీప, ఒడిలో బాబు, గుడిలో మీరు..అసలేం జరుగుతోందిక్కడ అని మోనిత అంటే... రా మోనితా నిన్ను పిలుద్దామనుకుని మరిచిపోయానంటుంది. గుళ్లోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకో మంచి జరుగుతుంది అంటే...దేవుడైనా, పతిదేవుడైనా నాకు కార్తీక్ అన్న మోనిత..బాబుని దత్తత ఇవ్వడం ఏంటి కార్తీక్-మావాడు మా ప్రాణం అన్నావ్ కదా అని క్వశ్చన్ చేస్తుంది. బాబుని దత్తత ఇవ్వడం ఏంటి మోనితా అని కార్తీక్ అంటే... నాకన్నా గొప్ప నటుడివి బాగా నటిస్తున్నావ్..గుళ్లోకి వచ్చి పూజ చేస్తూ బాబుని వేరేవాళ్లకి దత్తత ఇస్తున్నావ్, మళ్లీ ఏంటని నన్ను అడుగుతున్నావా అని క్వశ్చన్ చేస్తుంది. మీ మమ్మీగారు ఇదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా కార్డులు ప్రింట్ చేసి మరీ అందర్నీ ఆహ్వానించిందని చెప్పగానే...స్పందించిన కార్తీక్ మమ్మీ ఏంటిది ఆనంద్ ని మనం దత్తత ఇస్తున్నామా...కార్డులు పంచావా అని అడుగుతాడు. 

రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
అమ్మా .... తమ్ముడు ఎక్కడ అని హిమ ఇల్లంతా తిరుగుతుంది...ఎవ్వరూ సమాధానం చెప్పరు. చెప్పండి అని హిమ రెట్టించేసరి తమ్ముడిని బంధువులు వచ్చి తీసుకెళ్లారని చెబుతారు. నాకు ఆనంద్ కావాలి అంటూ హిమ వీరంగం మొదలెడుతుంది. 

Published at : 03 Mar 2022 08:52 AM (IST) Tags: karthika deepam latest episode కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Nirupam Paritala premi viswanathSobha Shetty Karthika Deepam 3rd March Episode 1290

సంబంధిత కథనాలు

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి