By: ABP Desam | Updated at : 02 Mar 2022 09:51 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu March 2nd 387 (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు (Guppedantha Manasu )మార్చి 2 బుధవారం ఎపిసోడ్
షార్ట్ ఫిలిం అయిపోయిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దేవయాని ఏర్పాటు చేసిన రిపోర్టర్ నోటికొచ్చిన ప్రశ్నలన్నీ అడిగి అందరి ముందూ అవమానిస్తుంటాడు. నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్ అని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు తగ్గడు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో జగతి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. అప్పటి కూడా తగ్గని రిపోర్టర్..మీ సంతానం గురించి చెప్పలేదంటే మీకు పెళ్లికి ముందే పుట్టారా, కుంతీ పుత్రులా అని అవమానిస్తాడు. కోపంతో రగిలిపోయిన మహేంద్ర..జస్ట్ స్టాపిట్ అని రిపోర్టర్ కి వార్నింగ్ ఇచ్చి...జగతి ఆగు అని పిలుస్తాడు. అప్పటికి కూడా వినిపించుకోకుండా వెళ్లిపోతుండడంతో ..నీ భర్తగా చెబుతున్నా ఆగు అంటూ వెళ్లి జగతిని చేయి పట్టుకుని తీసుకొస్తాడు మహేంద్ర. అక్కడున్న వారందరికీ ఇదో పెద్ద షాక్.
Also Read: కార్తీక్ ముందు మరోసారి బయటపడిన మోనిత నిజస్వరూపం
మహేంద్ర: నేరుగా జగతి చేయిపట్టుకుని స్టేజ్ పైకి తీసుకొచ్చిన మహేంద్ర... ఇప్పుడు చెబుతున్నా వినండి...జగతి నా భార్య, జగతి ఒంటరి కాదు..నేను మహేంద్ర భూషణ్ సన్నాఫ్ దేవేంద్ర భూషణ్.. జగతిని పెద్దల సమక్షంలో శాస్త్రోక్తంగా పెళ్లిచేసుకున్నాను. ( నేనొకటి చెబితే వీడొకటి చేశాడు అనుకుంటూ రిపోర్టర్ పై మనసులోనే రగిలిపోతుంటుంది). రిపోర్టర్ ని ఉద్దేశించి ఇందాక ఏమన్నావ్ పాపో-బాబో ఉన్నారని కదా..ఎస్ ...మా ఇద్దరికీ సింహం లాంటి కొడుకున్నాడు వాడే రిషేంద్ర భూషణ్ అని చెబుతాడు. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అడగండి...ఎనీ క్వశ్చన్స్ అని స్ట్రాంగ్ గా మాట్లాడతాడు మహేంద్ర. అప్పటి వరకూ షాక్ లో ఉన్న మంత్రిగారు... మైక్ తీసుకుని నిల్చుని దయచేసి అందరూ వినండి అంతా మన మంచికే అంటారు అది ఈ రోజు నిజమైంది, గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ రోజు వీరిద్దరి బంధం తెలిసింది. జగతి మేడం మేథావి, మహేంద్ర సహనశీలి, రిషి డైనమిక్..వీళ్లు కలవడం కన్నా మనకు ఏం కావాలి చెప్పండి అని స్టేజ్ పై మాట్లాడుతుంటాడు.
వసుధార-గౌతమ్: అప్పటి వరకూ షాక్ లో ఉన్న రిషి..తేరుకుని అక్కడి నుంచి సీరియస్ గా వెళ్లిపోతాడు. అది గమనించిన వసుధార వెనుకే వెళ్లి వెతుకుతుంటుంది. మరోవైపు గౌతమ్ కూడా షాక్ లోంచి బయటకు వెళ్లిపోతాడు. జగతి మేడం రిషి మదర్ ఏంటి, వీడెందుకు ఇన్నాళ్లూ చెప్పలేదు, అసలు రిషి ఏడి..చాలా సేపటి నుంచి కనిపించడం లేదు ఎటెళ్లాడు అని వెతుకుతూ వసుధారని చూసి అక్కడకు వెళతాడు. వసుధార...ఏంటిది అసలేం జరిగిందని అడుగుతాడు. షార్ట్ ఫిలిం ప్రివ్యూలో ఆ రాద్దాంతం ఏంటి, అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఇవన్నీ నీకు ముందే తెలుసా అంటే.. అవన్నీ మాట్లాడే టైమ్ ఇది కాదు అనేస్తుంది వసుధార. రిషి ఎక్కడున్నాడు అని గౌతమ్ అడిగితే...రిషి కనిపించలేదు, కారు కూడా కనిపించలేదంటుంది. నువ్వేం కంగారుపడకు, నేను వెతుకుతాను , నువ్వు కూడా వెతుకు అని చెప్పేసి వెళతాడు.
Also Read: మహేంద్ర ఆవేశం, జగతి ఆనందం, రిషి కోపం, దేవయానికి షాక్
రిషి-వసుధార: రిషి కోపంతో కారుని తీసుకుని తండ్రి మాటలు తల్చుకుంటూ గ్రౌండ్ లో స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటాడు...ఎదురుగా వసుధార కనిపించడంతో సడెన్ బ్రేక్ వేసి కోపంగా కిందకు దిగుతాడు. ఎప్పటిలా ఫైర్ అవుతూ ఉంటాడు. అడ్డంగా నిల్చున్నావ్ ఏంటని అడిగితే..ఏం చేస్తున్నారు మీరు అంటుంది. కనిపిస్తోంది కదా అని రిషి అంటే...కనిపించేవన్నీ నిజాలు కావుకదా అంటుంది. నాకు ప్రవచనాలు చెప్పకు అని రిషి అంటే..చెప్పాల్సిన అవసరం నాకు లేదంటుంది. అంతా నన్ను చూసి నవ్వుకుంటున్నారు, నన్ను నవ్వుల పాలు చేశారని బాధపడిపోతుంటే... ఇప్పుడు ఏం జరిగిందని బాధపడుతున్నారని వసు రిప్లై ఇస్తుంది. మనుషులు ఎంత అవకాశవాదులో తెలిసిపోయిందన్న రిషితో... ఎవరు అవకాశవాదులు అని ప్రశ్నిస్తుంది. షార్ట్ ఫిల్మ్ సందర్భాన్ని అవకాశం కోసం వాడుకున్నారు మీ మేడం అని రిషి అంటే... మీరు చిన్నప్పటి నుంచీ తప్పుగానే ఆలోచిస్తున్నారని మండిపడుతుంది. మేడంలో స్వార్థ్యం లేదు..ఆవిడ అలా ఉండాలనుకుంటే ఇంత బాధపడేవారు కాదు. అందరి ముందు అన్ని ప్రశ్నలు వేస్తున్నా, గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నా ఒక్కమాట కూడా మేడం బ్యాలెన్స్ తప్పి మాట్లాడలేదంటుంది. ఎపిసోడ్ ముగిసింది.
రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
మహేంద్ర ఇంట్లో అడుగుపెడుతుండగా..అక్కడే ఆగు అంటుంది జగతి. గుమ్మం దాటి లోపలకు రావొద్దంటే..నేనేం చేశానంటాడు మహేంద్ర. నువ్వే చేశావ్...రిషిని బాధపెట్టకూడదనే కదా చాలా భరించాం అని జగతి అంటే స్టాపిడ్ జగతి అని అరుస్తాడు మహేంద్ర. మరోవైపు డాడీ మాట్లాడుతుంటే మేడం ఆపొచ్చు కదా..డాడీ ఆవేశం రూపంలో అవకాశం వచ్చిందని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారంటాడు రిషి.
Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న
Guppedantha Manasu మే 26(ఈరోజు) ఎపిసోడ్: మనసులో మాట బయటపెట్టిన రిషి- ఐ లవ్ యు చెప్పిన వసుధారకు సర్ప్రైజ్
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం