![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jigarthanda DoubleX: ఎస్‌జే సూర్య వర్సెస్ రాఘవ లారెన్స్ - క్రేజీ సీక్వెల్ అనౌన్స్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్!
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘జిగర్తాండా’ పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌ను ప్రకటించారు.
![Jigarthanda DoubleX: ఎస్‌జే సూర్య వర్సెస్ రాఘవ లారెన్స్ - క్రేజీ సీక్వెల్ అనౌన్స్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్! Karthik SUbbaraj Announced Much Awaited Jigarthanda DoubleX Starring SJ Suryah Raghava Lawrence Jigarthanda DoubleX: ఎస్‌జే సూర్య వర్సెస్ రాఘవ లారెన్స్ - క్రేజీ సీక్వెల్ అనౌన్స్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/bc2db123c5ece351ab96c51244af49e31670779830498252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సిద్ధార్థ్, బాబీ సింహా నటించిన ‘జిగర్తాండా’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘జిగర్తాండా డబుల్ ఎక్స్’ అనే సినిమాను కార్తీక్ ప్రకటించాడు. ఇందులో ఎస్‌జే సూర్య, రాఘవ లారెన్స్ నటించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను కూడా విడుదల చేశారు.
‘జిగర్తాండా’ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయింది. ‘గద్దలకొండ గణేష్’ పేరుతో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. వరుణ్ తేజ్, అధర్వ ఇందులో హీరోలుగా నటించారు. ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది.
2014లో విడుదల అయిన ‘జిగర్తాండా’ అప్పట్లో చాలా అవార్డులు కూడా గెలుచుకుంది. నెగిటివ్ రోల్‌లో కనిపించిన బాబీ సింహాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా లభించడం విశేషం. ఈ పాత్రను విజయ్ సేతుపతి చేయాల్సిందని కార్తీక్ సుబ్బరాజ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు.
‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ను స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. లిరిక్స్‌ను ప్రముఖ రచయత వివేక్ అందిస్తున్నారు. ఫైట్ మాస్టర్‌గా దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రాఫర్‌గా ఎం.షెరీఫ్ వ్యవహరిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)