I Hate You Movie: ఐ హేట్ యు, ప్రేమలో కొత్త కోణాన్ని చూపించే సైకలాజికల్ ఫిల్మ్
యువ హీరో కార్తీక్ రాజు నటించిన లేటెస్ట్ సినిమా 'ఐ హేట్ యు'. సైకలాజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ న్యూ ఏజ్ ఫిలిమ్స్ చేస్తున్న యంగ్ హీరో కార్తీక్ రాజు. ఐశ్వర్య రాజేష్ 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాలో పల్లెటూరి యువకుడిగా ఆయన నటనకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. సాయి కిరణ్ అడివి దర్శకత్వం వహించిన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' సినిమాలో మోడ్రన్ యువకుడిగా కనిపించారు. గత ఏడాది (2023లో) విడుదలైన 'అథర్వ' సినిమాలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉద్యోగిగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.
'ఐ హేట్ యు' అంటున్న కార్తీక్ రాజు
I Hate You Telugu Movie: కార్తీక్ రాజు కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ఐ హేట్ యు'. ఇందులో మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని బి. లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగరాజ్ నిర్మిస్తున్నారు. అంజి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
సైకలాజికల్ లవ్ స్టోరీగా 'ఐ హేట్ యు'
I Hate You Movie Story: 'ఐ హేట్ యు' సినిమా ద్వారా ప్రేమలో కొత్త కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నామని చిత్ర నిర్మాత నాగరాజ్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఇదొక సైకలాజికల్ లవ్ స్టోరీ. మా దర్శకుడు అంజి రామ్ గారు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ రాశారు. అలాగే, కొత్త పంథాలో సినిమాను చక్కగా తెరకెక్కించారు. హీరో కార్తీక్ రాజుకు నటుడిగా మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. హీరోయిన్లు మోక్ష, షెర్రీ అగర్వాల్ సహా నటీనటులు అందరూ క్యారెక్టర్లకు తగ్గట్టు నటించారు. ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లు చక్కటి సహకారాన్ని అందించటంతో అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తి చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేస్తాం'' అని అన్నారు.
Also Read: కాంజూరింగ్ కన్నప్పన్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో రెజీనా, సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ సినిమా
'ఐ హేట్ యు' గురించి హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ "ఇదొక డిఫరెంట్ సినిమా. ఓ విధంగా ప్రయోగం అని కూడా చెప్పవచ్చు. తెలుగులో ఇటువంటి కథతో సినిమా రాలేదని అనుకుంటున్నాను. అందరికీ నచ్చేలా మా దర్శక నిర్మాతలు సినిమా తీశారు'' అని చెప్పారు.
Also Read: కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?
కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఒరిజినల్ స్టోరి, డైలాగ్స్: ప్రభోద్, ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్, స్టంట్స్: రామకృష్ణ, కొరియోగ్రాఫర్: అనీష్, అసోసియేట్ నిర్మాత: అనూష, సహ నిర్మాతలు: విష్ణు తేజ సర్విశెట్టి, నిర్మల్ కుమార్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్. మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: సాకార్, చిత్ర సమర్పణ: బి. లోకనాథం, నిర్మాణ సంస్థ: శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: నాగరాజు, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అంజి రామ్.