Karthi Viral Video: WWE ఫైటర్‌తో కలిసి హీరో కార్తీ అదిరిపోయే మాస్ ఫైట్, వీడియో వైరల్
హీరో కార్తీ ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన WWE ప్రమోషన్ వీడియోలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రమోషన్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
తమిళ నటుడు కార్తీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 'సుల్తాన్','పొన్నియిన్ సెల్వన్', 'సర్దార్' వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం కార్తీ చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. తాజాగా కార్తీ ఓ ప్రకటనలో కనిపించారు. WWE ఫైటర్‌తో కలిసి స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ ప్రమోషన్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఇది చూసిన కార్తీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
WWE ప్రమోషన్స్ కోసం సోనీ స్పోర్ట్స్ టెన్ 4 వినూతన ప్రచారానికి తెరలేపింది. అందులో భాగంగానే ఓ ఫన్నీ ప్రమోషన్ వీడియోను విడుదల చేసింది. ఈ ప్రోమో వీడియోలో కార్తీ WWE రెజ్లర్ స్కాటిష్ వారియర్ డ్రూ తో కలసి కనిపించారు. ఈ వీడియోలో బ్యాంకును దోచుకోడానికి ఓ దొంగల ముఠా వస్తుంది. బ్యాంక్‌లో కస్టమర్లను, సిబ్బందిని తుపాకులతో బెదిరిస్తారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ మేనేజర్ రెడ్ బటన్ నొక్కడంతో వారిని కాపాడటానికి కార్తీ, డ్రూ ప్రొక్లయినర్‌తో గోడను బద్దలు కొట్టుకుని బ్యాంక్‌లోకి వస్తారు. ఆ తర్వాత అసలు ఫైట్ మొదలవుతుంది.
వీడియోలో ఫైటింగ్ కు ముందు కార్తీ, డ్రూ ‘‘నువ్ స్టార్ట్ చేయ్ బ్రో అంటే నువ్ స్టార్ట్ చేయ్ బ్రో’’ అంటూ.. అనుకుంటుండగానే దొంగల ముఠా వారిపై పడుతుంది. దీంతో ఇద్దరూ వారితో ఫైట్ చేసి అందర్నీ కాపాడతారు. తర్వాత ఎందుకు దొంగతనం చేయాలనుకుంటున్నారు అని ఆ దొంగల ముఠాను అడిగితే.. యాక్షన్, థ్రిల్, డ్రామా, కిక్ కోసం అని చెప్తారు. అది విన్న కార్తీ అవన్నీ కావాలంటే దొంగతనం ఎందుకు చేయడం, సోనీ స్పోర్ట్స్ టెన్-4లో WWE వస్తుందిగా అని అంటారు. ఇండియాలో నెంబర్ వన్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ WWE అని చెప్పడంతో ప్రోమో వీడియో ముగుస్తుంది.
ఈ ప్రోమో వీడియో ఆకట్టుకునేలా ఉండటంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో మ్యూజిక్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ ఫన్నీగా ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎప్పుడూ రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా వినూత్నంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసమే ఇలా ప్లాన్ చేశారట. ఈ ప్రోమో వీడియో తెలుగు, తమిళం వెర్షన్ లలో కార్తీ కనిపించగా హిందీ వెర్షన్ లో నటుడు జాన్ అబ్రహం నటించాడు.
ప్రస్తుతం కార్తీ.. మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష నటించిన 'పొన్నియిన్ సెల్వన్ 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2023 సమ్మర్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం భారీ హిట్ ను అందుకోవడంతో పార్ట్ 2పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం కార్తీ దర్శకుడు మురుగదాస్ ‘జపాన్’ చిత్రంలో బిజీగా ఉన్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ‘ఖైదీ 2’ కూడా రానుంది.
Also Read : నేను బతికే ఉన్నా - నటి వీణా కపూర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్