అన్వేషించండి

Veena Kapoor Alive : నేను బతికే ఉన్నా - నటి వీణా కపూర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్

హిందీ నటి వీణా కపూర్ మర్డర్ న్యూస్ గత వారం సంచలనం సృష్టించింది. ట్విస్ట్ ఏమిటంటే... తాను చావలేదంటూ ఆమె పోలీసుల ముందుకు వచ్చాడు. అసలు, ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... 

హిందీ నటి వీణా కపూర్ (Actor Veena Kapoor) బుధవారం పోలీసుల ముందుకు వచ్చారు. ముంబైలోని డింఢోషి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె... తాను చావలేదని, బతికే ఉన్నానని చెప్పారు. తనను కన్న కుమారుడు హత్య చేయలేదని ఆవిడ స్పష్టం చేశారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
 
సంచలమైన వీణా కపూర్ హత్య!
ముంబై మహా నగరంలో గత వారం ఓ దారుణం చోటు చేసుకుంది. ఆస్తి గొడవల్లో వీణా కపూర్ (Veena Kapoor) అనే మహిళను ఆమె కన్న కుమారుడు అత్యంత పాశవికంగా హత్య చేశాడు. సచిన్ కపూర్ అనే వ్యక్తి కన్న తల్లిపై బేస్ బాల్ బ్యాటుతో దాడి చేశాడు. తల్లి తలపై కొట్టి కొట్టి ప్రాణాలు పోయేలా చేశాడు. ఆ తర్వాత మృత దేహాన్ని తీసుకుని ముంబైకు 90 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. రాయఘడ్ జిల్లాలోని ఓ నదిలో పారేశాడు.
 
ముంబైలోని జుహూ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీణా కపూర్ మర్డర్ అని న్యూస్ బయటకు రావడంతో అందరూ నటి వీణా కపూర్ అనుకున్నారు. హిందీ టీవీ సీరియల్స్ నటి, వీణా కపూర్ స్నేహితురాలు నీలు కోహ్లీ సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో మర్డర్ న్యూస్ నిజమని నమ్మారు. 

వీణా కపూర్ మర్డర్ విషయానికి వస్తే... అమెరికాలో ఆమె కుమారుడు ఉంటున్నారు. ఆయనకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు వీణ చిన్న కుమారుడు సచిన్ కపూర్‌ను ఇంటరాగేట్ చేయగా... తల్లిని హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడితో పాటు మర్డర్ చేయడంతో పాటు బాడీని మాయం చేయడానికి సహకరించిన వీణా కపూర్ వ్యక్తిగత సహాయకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి గొడవల కారణంగా తల్లిని హత్య చేసినట్లు సచిన్ కపూర్ పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. 

వార్త వైరల్ అవ్వడంతో...
వీణా కపూర్ కుమారుడికి టార్చర్!
వీణా కపూర్ మర్డర్ న్యూస్ వైరల్ కావడంతో ఆమె కుమారుడికి ఫోనులు చేయడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో అయితే చాలా మంది తిట్టడం స్టార్ట్ చేశారు. ఈ టార్చర్ ఎక్కువ కావడంతో వీణా కపూర్ బయటకు వచ్చారు. పేరు తీసుకు వచ్చిన తంటా ఇదంతా!

Also Read : ఆన్‌లైన్‌లో 'అవతార్ 2' - పైరసీ ప్రింట్స్‌తో ఫ్రీ షోస్

వీణా కపూర్ మర్డర్ కావడం... అదే పేరుతో నటి ఉండటంతో న్యూస్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అదీ సంగతి! ఇక... నటి వీణా కపూర్ విషయానికి వస్తే, ఆమె వయసు 74 సంవత్సరాలు. ఆమె కుమారుడి పేరు అభిషేక్ చడ్డా. ఆయనతో కలిసి వీణా కపూర్ మీడియా ముందుకు వచ్చారు. అదీ సంగతి!

సెలబ్రిటీలు కొందరికి గతంలో ఈ విధమైన చేదు అనుభవం ఎదురైన సందర్భాలు ఉన్నాయి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్ళిన తారలు మరణించినట్టు న్యూస్ రావడంతో కుటుంబ సభ్యులు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయవద్దని కోరిన ఘటనలు కొన్ని ఉన్నాయి. వీణా కపూర్ విషయంలో కన్న కుమారుడు హత్య చేశాడని వార్త రావడంతో ఆయనను తిట్టిన వారు ఎక్కువ అయ్యారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget